128 Jobs: Physical Director పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాంకేతిక విద్య కమిషనరేట్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనరేట్ పరిధిలోని కాలేజీల్లో 128 Physical Director(PD) ఉద్యోగాల భర్తీకి Telangana State Public Service Commission (TSPSC) డిసెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసింది.
Physical Director పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాంకేతిక విద్య కమిషనరేట్ పరిధిలో 31 ఖాళీలు, ఇంటర్మీడియెట్ విద్య కమిషనరేట్ పరిధిలో 97 ఖాళీలున్నాయి. 2022 జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నిండి 44 సంవత్సరాల లోపు ఉండాలని కమిషన్ తెలిపింది. దరఖాస్తులను జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారని తెలిపింది. మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడాలని కమిషన్ సూచించింది.