Skip to main content

TSPSC: గ్రూప్‌–4 దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 30న ముగియనుంది.
TSPSC
గ్రూప్‌–4 దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

Telangana State Public Service Commission (TSPSC) గత డిసెంబర్‌ 1న గ్రూప్‌–4 నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను డిసెంబర్‌ 30న వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టిన టీఎస్‌పీఎస్సీ... అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. జనవరి 30 వరకు దరఖాస్తులకు గడువు విధించగా... ఇప్పటివరకు 7,41,159 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది. 

చదవండి: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు

పోస్టులు తగ్గుతూ... పెరుగుతూ... 

గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీలో పోస్టుల సంఖ్య నిలకడగా లేదు. గత డిసెంబర్‌ 1న ప్రకటించిన వెబ్‌నోట్‌ ప్రకారం 9,168 పోస్టులు భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఆ తర్వాత డిసెంబర్‌ 30న విడుదల చేసిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో 8,039 ఖాళీలను మాత్రమే ప్రకటించింది. తాజాగా ఈనెల 28న విడుదల చేసిన గ్రూప్‌–4 అనుబంధ ప్రకటనలో మరో 141 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను జత చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వివరించింది. దీంతో పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. మరోవైపు ఓటీఆర్‌ అప్‌డేషన్, విద్యార్హతల ధ్రువపత్రాలు తదితరాలను సంబంధిత అధికారుల నుంచి తీసుకుని దరఖాస్తు చేసుకోవాడానికి మరింత సమయం కావాలంటూ అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని కోరుతున్నారు. అయినా గడువు పెంపుపై ఇంతవరకు టీఎస్‌పీఎస్పీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నేటి సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుండటంతో చివరి నిమిషం వరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన కోసం వేచిచూడాల్సి ఉంది. 

చదవండి: TSPSC Group-4 : పది లక్షల మంది పోటీ... ఈ మెలకువలు పాటిస్తే విజయం సాధ్యం!

Published date : 30 Jan 2023 02:01PM

Photo Stories