TSPSC Group IV: పరీక్షల షెడ్యూల్, వివరాలివీ..
ఇటీవలే గ్రూప్–1 మెయిన్ పరీక్ష తేదీలను ఖరారు చేయగా.. అత్యధిక పోస్టులున్న గ్రూప్–4 పరీక్షల తేదీలను ఫిబ్రవరి 2న ప్రకటించింది. 2023 జూలై ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో గ్రూప్–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని.. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్ –ఉర్దూలలో ఉంటాయని పేర్కొంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఎక్కువ పోస్టులు చూపి.. కొన్ని తగ్గించి..
వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,168 గ్రూప్–4 పోస్టులను భర్తీ చేస్తామని 2022 డిసెంబర్ 1న టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించి డిసెంబర్ 30న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసినా.. 8,039 ఖాళీ పోస్టులను మాత్రమే చూపింది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. తర్వాత 2023 జనవరి 28న విడుదల చేసిన అనుబంధ నోటిఫికేషన్‌తో మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జత చేసింది. వీటితో కలిపి మొత్తంగా భర్తీ చేసే గ్రూప్–4 పోస్టుల సంఖ్య 8,180కి చేరింది.
చదవండి: TSPSC Group-4 : పది లక్షల మంది పోటీ... ఈ మెలకువలు పాటిస్తే విజయం సాధ్యం!
నేటితో గడువు పూర్తి
గ్రూప్–4 పోస్టులకు ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనుంది. ఫిబ్రవరి 2 సాయంత్రం వరకు 9 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపు ఒక్కో పోస్టుకు 110 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు
రెండు పేపర్లు.. 300 మార్కులు..
గ్రూప్–4 పోస్టుల భర్తీకి రెండు పరీక్షలు ఉంటాయి. ఇందులో జూలై 1న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం సెక్రటేరియల్ ఎబిలిటీ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటలు సమయం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ప్రతి పేపర్‌కు 150 మార్కులు.. రెండు పరీక్షలు కలిపి మొత్తం 300 మార్కులు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలను టీఎస్‌పీఎస్సీ తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
చదవండి: Group 4 Preparation Tips: 9,168 గ్రూప్-4 పోస్టులపై.. గురిపెట్టండిలా!
గ్రూప్–4 పరీక్ష షెడ్యూల్, వివరాలివీ..
సెషన్ |
సమయం |
పేపర్/సబ్జెక్ట్ |
సమయం |
ప్రశ్నలు |
మార్కులు |
ఉదయం |
10.00–12.30 |
పేపర్–1/జనరల్ స్టడీస్ |
2.30గం. |
150 |
150 |
మధ్యాహ్నం |
2.30–5.00 |
పేపర్–2/సెక్రటేరియల్ ఎబిలిటీ |
2.30గం. |
150 |
150 |