High Court: TSPSC సభ్యుల నియామకానికి దరఖాస్తులు స్వీకరించారా?
దీనిపై స్పష్టంగా వివరాలు తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 28కు వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీలో పలువురు సభ్యుల నియామకం చట్టవిరుద్ధంగా జరిగిందని, వారిని నియమిస్తూ ప్రభుత్వం ఇచి్చన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
చదవండి: BRAOU: అంబేడ్కర్ వర్సిటీ అకడమిక్ డైరెక్టర్‌గా TSPSC మాజీ చైర్మన్
రామావత్ ధన్‌సింగ్, బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్, కారం రవీందర్‌రెడ్డి, అరవిల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్. సత్యనారాయణల టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 108ను కాకతీయ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఏ. వినాయక్‌రెడ్డి సవాల్ చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
చదవండి: TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం నవంబర్ 14న విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఓ కాని్ఫడెన్సియల్ రిపోర్టును కోర్టుకు అందజేసింది. వాదనల తర్వాత.. తదుపరి విచారణను నవంబర్ 28కు వాయిదా వేసింది.