TS TET Results 2022: టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సారి టెట్ పేపర్-1లో 1,04,078(32.68%)మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అలాగే టెట్ పేపర్-2లో 1,24,535(49.64 %) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ టెట్ ఫలితాలు జూన్ 27వ తేదీన విడుదల చేయాల్సింది ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాలు ఆలస్యం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో.. టెట్ పరీక్ష జూన్ 12వ తేదీన(ఆదివారం) నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు 90 శాతం మంది హాజరయ్యారు.
టీఎస్ టెట్-2022 పేపర్-1 ఫలితాల కోసం క్లిక్ చేయండి
టీఎస్ టెట్-2022 పేపర్-2 ఫలితాల కోసం క్లిక్ చేయండి
త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీకి..?
టెట్‌కు మొత్తం 6,29,382 మంది దరఖాస్తు చేసుకోగా, 5,69,576 మంది పరీక్షకు హాజరయ్యారు. డీఈడీ అర్హతతో నిర్వహించిన టెట్ పేపర్–1కు మొత్తం 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా, 3,18,506 మంది(90.62 శాతం) హాజరయ్యారు. 32,976 మంది గైర్హాజరయ్యారు. అయితే, ఈ పరీక్షకు బీఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. పేపర్–2కు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 2,51,070 (90.35 శాతం) మంది హాజరయ్యారు. 26,830 మంది గైర్హాజరయ్యారు. టెట్ పూర్తైన తర్వాత టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సారి పేపర్–2 అభ్యర్థులకు..
వాస్తవానికి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్–2ను బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈసారి పేపర్–2 రాసే వారు కూడా పేపర్–1 రాసి, ఎస్‌జీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు.
TS TET 2022 Paper-1 Final Key: టీఎస్ టెట్ పేపర్-1 ఫైనల్ 'కీ' విడుదల.. ఈ సారి 'కీ' లో..
తెలంగాణ టెట్-2022 పేపర్-2 కొశ్చన్ పేపర్ కోసం క్లిక్ చేయండి (Social Studies)
తెలంగాణ టెట్-2022 పేపర్-1 కొశ్చన్ పేపర్ కోసం క్లిక్ చేయండి