Skip to main content

Polycet 2023 Results: రైతుబిడ్డ.. ఎంబైపీసీలో ఫస్ట్‌ర్యాంకర్‌

కాటారం: రైతుబిడ్డ పాలిసెట్‌లో మెరిశాడు. ఎంబైపీసీలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గంగారానికి చెందిన చీర్ల ఆకాశ్‌ 120కి 116 మార్కులు సాధించి స్టేట్‌ ఫస్ట్‌ర్యాంక్‌ సాధించాడు.
Farmer Son first rank in Polycet 2023 MBIPC
తల్లిదండ్రులతో ఆకాశ్‌

ఆకాశ్‌ తండ్రి చీర్ల రమేశ్‌ రైతు కాగా, తల్లి రజిత గృహిణి. ఆకాశ్‌ 4వ తరగతి వరకు కాటారంలోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 10వ తరగతి వరకు హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాడు. ‘మా నాన్న కష్టం చూసేవాడిని. ప్రణాళికాబద్ధంగా చదివాను. అనుకున్న ర్యాంకు సాధించాను. ఏ కోర్సు తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆకాశ్‌ తెలిపాడు.  

చదవండి:

UPSC Civils 3rd Ranker Interview: విద్యా, వైద్యం, మహిళ సాధికారత సాధించడమే నా లక్ష్యం!

UPSC Civils 22nd Ranker Pavan Datta Interview : నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..|ఈ ల‌క్ష్యం కోస‌మే సివిల్స్ వైపు వ‌చ్చా..

Published date : 27 May 2023 12:47PM

Photo Stories