Polycet 2023 Results: కలకోవ విద్యార్థినికి ఎంపీసీ స్ట్రీమ్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్
Sakshi Education
మునగాల: సూర్యా పేట జిల్లా కలకోవ గ్రామానికి చెందిన విద్యార్థిని శరణ్య మే 26న విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో 120 మార్కులకు 119 మార్కులు సాధించి ఎంపీసీ స్ట్రీమ్‌లో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించింది.
తండ్రి భిక్షమయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. శరణ్య 10వ తరగతి వరకు సూర్యాపేటలో చదివింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ ర్యాంక్ సాధించినట్లు శరణ్య తెలిపింది. భవిష్యత్‌లో ఐఐటీ పూర్తి చేసి సివిల్స్ సాధించడమే లక్ష్యమని చెప్పింది. ఇంకా ఎంపీసీ స్ట్రీమ్‌లో ఇదే జిల్లాకు చెందిన ఎస్‌కె.సిద్దిఖ్ 120 మార్కులకు 116 మార్కులు సాధించి స్టేట్ 2వ ర్యాంకు, కె.శశివదన్ స్టేట్ 3వ ర్యాంకు సాధించారు. ఎంబైపీసీ స్ట్రీమ్‌లో ఎం.అక్షయతార 120 మార్కులకు 116 మార్కులతో స్టేట్ 2వ ర్యాంకు, కె.ఉజ్వల్ 116 మార్కులు సాధించి స్టేట్ 4వ ర్యాంకులు సాధించారు.
చదవండి:
2 crore salary package: రెండు కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన హైదరాబాదీ అమ్మాయి
Published date : 27 May 2023 01:30PM