Skip to main content

రహదారులు - రవాణా

పంచాయతీరాజ్ రహదారులు
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన వివిధ కార్యక్రమాలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపడుతుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో 2014 ఏప్రిల్ 1 నాటికి 64,046 కి.మీ. పొడవైన గ్రామీణ రహదారులు ఉన్నాయి.
వివరాలు:
  • సీసీ అండ్ బీటీ రహదారులు- 20282 కి.మీ.
  • డబ్ల్యూబీఎం రహదారులు-14146 కి.మీ.
  • కంకర రోడ్లు-14734 కి.మీ.
  • మట్టి రోడ్లు-14884 కి.మీ.
భవనాలు: రాష్ర్టంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ భవనాల నిర్మాణ వైశాల్యం వరుసగా 38.85 లక్షల చదరపు అడుగులు, 12.27 లక్షల చ.అడుగులు.

రవాణా
రాష్ర్ట ఆర్థికాభివృద్ధిలో రోడ్డు రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. లెసైన్సుల జారీ, మోటారు వాహనాల రిజిస్ట్రేషన్, మోటార్ పర్మిట్ల లెవీ జారీ తదితరాల్లో రవాణా శాఖది ప్రధాన పాత్ర. ఆ శాఖ రహదారి భద్రతకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి రాష్ర్టంలో 77 లక్షలకుపైగా వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. వీటిలో 74 శాతం ద్విచక్ర వాహనాలే. తర్వాతి స్థానంలో కార్లు ఉన్నాయి.

వాహనం

సంఖ్య (2015 జనవరి నాటికి)

ఆటో రిక్షాలు

291354

కాంట్రాక్ట్ క్యారేజ్ వాహనాలు

6466

విద్యాసంస్థల వాహనాలు

20243

సరకు రవాణా వాహనాలు

328087

మాక్సి క్యాబ్‌లు

18978

మోపెడ్‌లు, మోటార్ సైకిళ్లు

5722894

మోటార్ కార్లు

924778

మోటార్ క్యాబ్‌లు

62590

ప్రైవేట్ సేవల వాహనాలు

2482

స్టేజీ క్యారేజ్ వాహనాలు

15572

ట్రాక్టర్లు, ట్రైలర్లు

285581

ఇతరాలు

42090

మొత్తం

7721115


రవాణా శాఖలోని అన్ని సేవలనూ పూర్తిగా కంప్యూటరీకరించారు. రవాణా శాఖకు సంబంధించిన కార్యాలయాలతో పాటు ఇంటర్నెట్, మీ-సేవా, ఇ-సేవా కేంద్రాల ద్వారా సేవలను అందిస్తున్నారు. 15 చెక్‌పోస్టులు, 11 ఎంవీఐ కార్యాలయాలను మూడంచెల నిర్మాణానికి అనుసంధానించారు. ప్రస్తుతం రాష్ర్టంలోని మొత్తం 66 ప్రదేశాలు మూడంచెల సాఫ్ట్‌వేర్ లోకి మారాయి. రాష్ర్టంలోని అన్ని కార్యాలయాల ద్వారా రోజూ సగటున 29 వేల లావాదేవీలు జరుగుతున్నాయి. మోటారు వాహనాల డీలర్లు వాహనాన్ని విక్రయించిన సమయంలోనే ఆన్‌లైన్‌లో పన్ను చెల్లిస్తున్నారు. దీంతో వారి లావాదేవీలు (కొత్త వాహనానికి టీఆర్ జారీ) కేంద్ర సర్వర్‌లో అప్‌డేట్ అవుతున్నాయి. ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష, డీఎల్ పరీక్ష కోసం వెబ్ ద్వారా స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. కేంద్రీకృత ఎంఐఎస్ సహాయంతో ప్రధాన కార్యాలయంలో వాస్తవిక సమయంలోనే వివిధ లావాదేవీలను పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.

రవాణా శాఖ ఆదాయం

సంవత్సరం

మొత్తం రాబడి (కోట్ల రూ.లలో)

2010-11

1294.73

2011-12

1517.40

2012-13

1768.00

2013-14

1753.72

2014-15

1579.76

(31.01.2015 వరకు)
తెలంగాణ రాష్ర్ట రహదారి రవాణా సంస్థ: తెలంగాణ రాష్ర్ట రహదారి రవాణా సంస్థ పరిధిలో 3 జోన్లు, 10 రీజియన్లు, 94 డిపోలు ఉన్నాయి. 10,342 బస్సులున్నాయి. 2013-14 చివరి నాటికి సుమారు 58 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2013-14లో ఇంధన సామర్థ్యం లీటరుకు 5.18. ఈ సంస్థ 34.17 లక్షల కి.మీ. మేర బస్సులను నడుపుతోంది. రోజూ 83.15 లక్షల మంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తోంది. సగటు వాహన ఉత్పాదకత రోజుకు 331 కి.మీ.

విమానాశ్రయాలు
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం:
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ) నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. ఇదో పీపీపీ ప్రాజెక్ట్. విమానాశ్రయ నిర్మాణంలో తొలిదశ కోసం రూ. 2920 కోట్లు వెచ్చించారు. ఆర్‌జీహెచ్‌ఐఏఎల్ ఓ జాయింట్ వెంచర్ కంపెనీ. దీని ప్రమోటర్ జీఎంఆర్ గ్రూప్ (63 శాతం). మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్టింగ్ బెర్‌హద్ (ఎంఏహెచ్‌బీ (11 శాతం), రాష్ర్ట ప్రభుత్వం (13 శాతం), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (13 శాతం) ఇతర కన్సార్టియం భాగస్వాములు. 2014 డిసెంబర్ 31 నాటికి, ఆర్‌జీహెచ్‌ఐఏఎల్‌లో 485 మంది ఉద్యోగులున్నారు.
అనుసంధానత: విమానాశ్రయాన్ని చేరుకోడానికి రెండు ప్రధాన మార్గాలున్నాయి, పశ్చిమ దిశ నుంచి ఎన్‌హెచ్-7, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) మీదుగా ఉన్న మార్గం ఒకటి. తూర్పు దిశ నుంచి శ్రీశైలం రాష్ర్ట రహదారి రెండోది. ఓఆర్‌ఆర్ మొదటి దశ సైబరాబాద్‌ను విమానాశ్రయంతో అనుసంధానిస్తుంది. 11.8 కి.మీ. ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే(పీవీఎన్‌ఆర్) ద్వారా నగరం మధ్య నుంచి విమానాశ్రయానికి కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. వీటితోపాటు మల్టీమోడల్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టం(ఎంఎంటీఎస్), మోనో రైల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం(ఎంఆర్‌టీఎస్), ఇతర ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అన్వేషిస్తున్నారు.
ప్రయాణికుల రాకపోకలు: 2014-15 (ఏప్రిల్ 14 - డిసెంబర్ 14)లో దేశీయ ప్రయాణికుల్లో 20 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ ప్రయాణికుల్లో వృద్ధి 13 శాతం. మొత్తం ప్రయాణికుల రాకపోకల్లో 18 శాతం వృద్ధి కనిపించింది. అదే కాలవ్యవధిలో 77.50 లక్షల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలందించింది.
ఎయిర్ ట్రాఫిక్ మూవ్‌మెంట్స్(ఏటీఎం): 2014-15 (ఏప్రిల్ 14-డిసెంబర్ 14)లో దేశీయ ఏటీఎం వృద్ధి సుమారు 9 శాతం. అంతర్జాతీయ ఏటీఎం వృద్ధి 7 శాతంగా ఉంది. మొత్తం ఏటీఎంలో వృద్ధి 9 శాతం. అదే కాలవ్యవధిలో ఈ విమానాశ్రయం 71,308 ఏటీఎం నిర్వహించింది.
సరకు రవాణా: 2014-15 (ఏప్రిల్ 14- డిసెంబర్ 14)లో దేశీయ కార్గోలో వృద్ధి సుమారు 18 శాతం. అంతర్జాతీయ కార్గో పరిమాణం 13 శాతం పెరిగింది. మొత్తం కార్గోలో 15 శాతం వృద్ధి కనిపించింది. అదే కాలవ్యవధిలో ఈ విమానాశ్రయం 77,226 టన్నుల కార్గోను నిర్వహించింది.
ఆర్‌జీఐఏలో నూతన పరిణామాలు (ఏప్రిల్ -డిసెంబర్, 2014):
  • ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో వారానికి రెండు రోజుల సరకు రవాణా కార్యకలాపాలు ప్రారంభించింది.
  • టర్కిష్ కార్గో వారానికి ఒకసారి సరకు రవాణా కార్యకలాపాలను ఆరంభించింది.
  • ఎయిర్ ఏసియా కౌలాలంపూర్‌కి నేరుగా ప్రయాణికుల విమాన సేవలను ప్రారంభించింది.
  • గల్ఫ్ ఎయిర్ బహ్రయిన్ నుంచి నేరుగా ప్రయాణికుల విమానాలను ప్రారంభించింది.
  • ఇంటర్నేషనల్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో రిటైల్ సౌకర్యాలను మెరుగుపరిచారు.
  • విమానాశ్రయంలో తెలంగాణ టూరిజం కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభమైంది.
  • టూరిస్ట్ వీసా ఆన్ ఎరైవల్(టీవీఓఏ)ను ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)తో పాటు ఆర్‌జీఐఏలో అమలు చేస్తున్నారు. 43 దేశాల ప్రజలు ఉపయోగించుకునేలా 2014 డిసెంబర్ 1 నుంచి ఈ సదుపాయాన్ని ప్రారంభించారు.
  • ఏరోస్పేస్ పార్క్ లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం యునెటైడ్ టెక్నాలజీస్ కార్పొరేషన్ ఇండియా లీజు ఒప్పందంపై సంతకాలు చేసింది.
వరంగల్ విమానాశ్రయం: ప్రస్తుతం ఈ విమానాశ్రయం 748.02 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అదనంగా 438 ఎకరాలు కావాలని ఏఏఐ కోరింది.
ప్రాంతీయ విమానాశ్రయాలు: ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధి కోసం వైమానిక విధానం రూపొందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా వైమానిక విధాన ముసాయిదాను సమర్పించింది. ఈ విధానంపై ఆర్థిక, టీఆర్ అండ్ బీ, హోం తదితర విభాగాలు తమ అభిప్రాయాలు తెలియజేశాయి.

సాగునీరు
వ్యవసాయ రంగ అభివృద్ధికి సాగునీరు ఎంతో అవసరం. గోదావరి, కృష్ణా నదులు, ఉపనదులు, చెరువులు, కుంటలు తెలంగాణలోని సాగునీటి వనరులు. రాష్ర్టంలో దాదాపు 46,000 చెరువులు, జల సంరక్షణ నిర్మాణాలు ఉన్నాయి. ఇవి సాగునీటితోపాటు వాణిజ్య, గృహావసరాలను కూడా తీరుస్తున్నాయి.
రాష్ర్ట ప్రభుత్వం సాగునీటి ప్రాధాన్యతను గుర్తించింది. నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదనల్లో ఉన్న భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో ప్రణాళికాబద్ధమైన వినియోగం (కృష్ణా బేసిన్‌లోని వరదనీటితో సహా లెక్కిస్తే) వరుసగా 933.70 టీఎంసీలు, 298 టీఎంసీలు.
కాకతీయుల నాటి సాగునీటి వ్యవస్థ కరువు నివారణ చర్యలను పునరుద్ధరించడానికి చక్కటి నమూనాను అందిస్తుంది. పాకాల, రామప్ప, లక్నవరం, ఘనపూర్‌లు రాష్ర్టంలోని ప్రధాన చెరువులు. వీటి ఆయకట్టు సుమారు 11,975 హెక్టార్లు. ఈ చెరువులు 5,872 ఎంసీఎఫ్‌టీ నీటిని అందిస్తున్నాయి. వీటితోపాటు ఒక్కొక్కటీ 100 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న 5,000 చెరువులు రాష్ర్టంలో ఉన్నాయి. 2012-13, 2013-14లో భారీ సాగునీటి చెరువులకు చేపట్టిన మరమ్మతుల వల్ల 3,908 హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించారు.
చిన్నతరహా సాగునీటి చెరువులను తెలంగాణకు జీవనరేఖగా భావించవచ్చు. వచ్చే అయిదేళ్లలో మిషన్ కాకతీయ కార్యక్రమం కింద చిన్నతరహా గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. దీని కోసం జీఓఐ, జైకా, ఏఐబీపీ, ప్రపంచ బ్యాంకు నిధులు, సాధారణ రాష్ర్ట ప్రణాళిక ద్వారా నిధులను మంజూరు చేస్తారు. భూగర్భ జలమట్టాలను స్థిరీకరించేందుకు కూడా ఈ కార్యకలాపాలు దోహదం చేస్తాయి. సూక్ష్మ, చిన్న తరహా సాగునీటి వనరుల్లో నీటిని సమీకరించడం కోసం చేపట్టే వాననీటి సంరక్షణ కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్న మరో అంశం.

నది

ప్రాజెక్టు తరహా

ప్రాజెక్టుల సంఖ్య

సామర్థ్యం (టీఎంసీల్లో)

మాగాణం చేసే సత్తా (లక్షల ఎకరాల్లో)

గోదావరి

గోదావరి బేసిన్‌లో పెద్ద, మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులు

27

455

30.54

పెద్ద, మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులు

22 (నిర్మాణంలో ఉన్నవి)

395

35.465

తలపెట్టిన కొత్త ప్రాజెక్టులు

16

62.422

66.09

జలవిద్యుత్ ప్రాజెక్టులకు గోదావరిలో నిర్ణయించిన నీరు

 

21.453

 

కష్ణా

పెద్ద, మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులు

13

89.15

21.494

పెద్ద, మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులు

5 (నిర్మాణంలో ఉన్నవి)

23.90 (నికర జలాలు) 77.0 (వరదనీరు)

11.63

Published date : 24 Nov 2015 04:36PM

Photo Stories