Skip to main content

TS Police Exams : 17,516 ‘పోలీస్‌’ ఉద్యోగాల తుది రాత పరీక్షల తేదీ ఇవే.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : పోలీసు ఉద్యోగాల భర్తీలో కీలకమైన తుది రాత పరీక్షల నిర్వహణకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. అవకతవకలకు తావులేకుండా పూర్తిస్థాయిలో సాంకేతికతను టీఎస్‌ఎల్పీఆర్బీ వినియోగిస్తోంది.
ts si and constable mains exam 2023 details in telugu
ts si and constable mains exam 2023

పోలీస్‌ శాఖతోపాటు ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్ల కింద విడుదల చేసిన 554 ఎస్సై, 16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

ts si and constable mains exam dates 2023

మార్చి 11న తుది రాత పరీక్షలు మొదలుకానున్నాయి. ఆ రోజు ఐటీ, కమ్యూనికేషన్స్‌ ఎస్‌ఐ, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో ఏఎస్‌ఐ పోస్టులకు పరీక్ష జరగనుండగా, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మార్చి 26న పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై తుది రాత పరీక్ష, ఏప్రిల్‌ 2న కానిస్టేబుల్‌ మెకానిక్, డ్రైవర్‌ పోస్టులకు, ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో సివిల్‌ ఎస్సై పోస్టులకు, ఏప్రిల్‌ 30న సివిల్‌ కానిస్టేబుల్, కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది రాత పరీక్షలు జరగనున్నాయి.

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

రాత పరీక్షలకు కేంద్రాలు ఇవే.. 

ts si and constable mains exam centres telugu news

అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్షలకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్‌ ఎస్సై, ఫింగర్‌ప్రింట్‌ ఏఎస్సై, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్, మెకానిక్‌వంటి పోస్టుల అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్‌ ఎస్సైలకు హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో అభ్యర్థులు పాల్గొనే కానిస్టేబుల్‌ తుది రాత పరీక్షలు హైదరాబాద్‌తోపాటు పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

 Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

ఫైనల్‌ రాతపరీక్ష సిల‌బ‌స్ ఇదే.. 

ts police mains exam syllabus 2023

ఎస్సై(సివిల్‌/ తత్సమానం) ఫైనల్‌ రాతపరీక్ష పేపర్‌–1లో ఇంగ్లిష్‌కు సంబంధించి యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రహెన్షన్, ఇతర భాషా నైపుణ్యాలపై పదోతరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్‌ విధానంలో లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూప, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–2లో తెలుగు/ఉర్దూ భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉంటాయి. 

పేపర్‌–3లో అర్థమెటిక్, రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌–4 జనరల్‌ స్టడీస్‌లో జనరల్ సైన్స్‌, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, భారత దేశ భౌగోళిక శాస్త్రం, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన విలువలు, సున్నితత్వం, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, భావోద్వేగ తెలివితేటలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలపై ప్రశ్నలు వస్తాయి.

ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events Tips

ఇవి చ‌దివితే..
☛ అర్థమెటిక్‌ విభాగం నుంచి సరాసరి, గ.సా.భా., క.సా.గు.,సంఖ్యలు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణలు, నిష్పత్తి–అనుపాతం,భాగస్వామ్యం, వయసులు, శాతా లు, లాభ–నష్టాలు–తగ్గింపులు, సరళ వడ్డీ, చక్రవడ్డీ, మిశ్రమాలు,కాలం–పని, పంపులు–ట్యాంకులు, పనులు–వేతనాలు, కాలం–దూరం, రైళ్లు, పడవలు–ప్రవాహాలు, ఆటలు–పందేలు అంశాలనుంచి ప్రశ్నలను సాధన చేయాలి. 
☛ ప్యూర్‌ మ్యాథ్స్‌ విభాగం నుంచి వైశాల్యాలు, ఘనపరిమాణాలు, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం,సంభావ్యత,త్రికోణమితి, మాత్రికలు మొదలైన∙అంశాలు ముఖ్యమైనవి. వీటితోపాటు పదోతరగతిలోపు ప్యూర్‌ మ్యాథ్స్‌ను కూడా చదవాలి.
☛ వెర్బల్‌ రీజనింగ్‌లో కేలండర్‌లు, గడియారాలు, టైమ్‌ సీక్వెన్స్, నంబర్‌ టెస్ట్, ర్యాంకింగ్‌ టెస్ట్, డైరెక్షన్‌ టెస్ట్, నంబర్‌ సిరీస్, మిస్సింగ్‌ నంబర్స్, మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్‌ టెస్ట్, కోడింగ్‌–డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, పజిల్స్‌ టెస్ట్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, అర్థమెటికల్‌ రీజనింగ్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం తదితర అంశాలు ముఖ్యమైనవి.

➤☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కానిస్టేబుల్‌, ఎస్ఐ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి
☛ లాజికల్‌ రీజనింగ్‌లో లాజికల్‌ వెన్‌డయాగ్రమ్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ ఆర్గుమెంట్స్, స్టేట్‌మెంట్స్‌ అండ్‌ అసంప్షన్స్, అసర్షన్‌ అండ్‌ రీజన్, సిల్లోజియం, డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. 
☛ నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌లో క్యూబ్స్‌ అండ్‌ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్‌ ఇమేజెస్, వాటర్‌ ఇమేజెస్, కంప్లీషన్‌ ఆఫ్‌ ఫిగర్స్, పేపర్‌ ఫోల్డింగ్, పేపర్‌ కట్టింగ్, కౌంటింగ్‌ ఫిగర్స్‌ మొదలైనవి ముఖ్యమైనవి.

 Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..

Published date : 09 Mar 2023 08:15PM

Photo Stories