AP Constable Events 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. కానిస్టేబుల్ ఈవెంట్స్ కొట్టడం ఈజీనే..
ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్ రాతపరీక్షను జనవరి 22వ తేదీన నిర్వహించి.. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. అయితే ఇప్పుడు తాజాగా.. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం దేహదారుఢ్య, మెయిన్ పరీక్షలకు కాల్ లెటర్లను మార్చి 1 నుంచి 10వ తేదీలోగా slprb.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి ఒక ప్రకటనలో తెలిపింది.
Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు కానిస్టేబుల్ ఈవెంట్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం.. ఈవెంట్స్ కొట్టాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఈవెంట్స్‌లో విజయం సాధించడం ఎలా..? మొదలైన వాటి గురించి ప్రత్యేక స్టోరీ మీకోసం..
కొలతలు ఇలా..
☛ పురుష అభ్యర్థులు 167.6 సెం.మీ ఎత్తు, 86.3 సెం.మీ. ఛాతి కలిగుండాలి.
☛ మహిళా అభ్యర్థులు 152.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్ట్‌లకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
☛ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ విజేతలకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(1600 మీటర్లు,వంద మీటర్లు, లాంగ్ జంప్) నిర్వహిస్తారు. వీటిలో 1600 మీటర్ల టెస్టులో తప్పనిసరిగా అర్హత పొందాలి. అలాగే వంద మీటర్ల టెస్ట్, లాంగ్ జంప్‌ల్లో ఏదో ఒకదాంట్లో అర్హత సాధిస్తే సరిపోతుంది.
లాంగ్ జంప్ ఈ టెక్నిక్ పాటిస్తే.. :
లాంగ్ జంప్‌కు ముందుగా పవర్ లెగ్‌ను సరిచూసుకోవాలి. జంప్‌కు టేకాఫ్ తీసుకోవడానికి అభ్యర్థులకు కుడికాలు లేదా ఎడమకాలు ఏది అనువుగా ఉందో పరీక్షించుకోవాలి. 7 అడుగులు, 15 అడుగులు, 21 అడుగులు.. ఇలా దూరం పెంచుతూ సాధన చేయాలి. రోజూ అయిదు నుంచి పదిసార్లు సాధన చేయడం మంచిది.
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
ఇలా సాధన చేస్తే ఈజీనే.. :
☛ శారీరక పరీక్షలు గట్టెక్కడం అత్యంత కీలకం. కష్టపడి ప్రాక్టీస్ చేస్తేనే ఈవెంట్లు దాటతారనే విషయాన్ని గుర్తించి ప్రణాళిక ప్రకారం సాధన చేయాలి.
☛ అభ్యర్థులు ముందుగా పరుగులో వేగం పెంచుకోవడానికి శ్వాసపై నియంత్రణా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. రోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు పరుగును క్రమేణా ప్రాక్టీస్ చేయాలి. పరుగును ప్రారంభించే ముందు వామప్స్ వల్ల శరీరం వేడెక్కి దేహ దారుఢ్య సాధన తేలికవుతుంది.
☛ వారంలో ఒకసారి తప్పనిసరిగా లాంగ్‌రన్ 5-6 కిలోమీటర్లకు తగ్గకుండా సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
☛ అభ్యర్థులు రన్నింగ్ కోసం బ్రాండెడ్ స్పోర్ట్స్ షూను ఉపయోగించాలి. తప్పనిసరిగా టీ షర్టు ధరించి, ప్రాక్టీస్ ప్రారంభించాలి.
☛ సిగరెట్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
☛ రోజూ ఉడికించిన గుడ్లు, డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.
☛ సెలక్షన్స్‌లో ఒకేరోజు అన్ని ఈవెంట్స్ నిర్వహిస్తారు. కాబట్టి రోజు విడిచి రోజు తప్పనిసరిగా ఈవెంట్స్‌ను సరిచూసుకోవాలి.
☛ అభ్యర్థులు గ్రౌండ్‌కు ప్రాక్టీస్‌కు వెళ్లే ముందు తప్పనిసరిగా సపోర్టర్ ధరించాలి.
☛ రోజూ ఉదయం 5 గంటల నుంచి 7.30, సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు ప్రాక్టీస్ కోసం కేటాయించాలి. మిగతా సమయంలో రాతపరీక్షకు ప్రిపరేషన్ కొనసాగించాలి.