TS Police Exams Extra Marks : ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అదనపు మార్కులు ఇవే.. వీరికి ప్రత్యేకంగా..
ఎస్‌ఐ, కానిస్టేబుల్ పిలిమ్స్ రాతపరీక్షలో ఆ 7 ప్రశ్నలకు అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. దీంతో పరీక్షల్లో అభ్యర్థులకు 7 మార్కులు కలువనున్నాయి.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అప్పుడు ఉన్న హాల్ టికెట్ నంబర్లతో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. జనవరి 30వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దేహదారుఢ్య పరీక్ష కోసం పార్ట్2 అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలని పోలీసు నియామక బోర్డు తెలిపింది. ప్రస్తుతం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులై ఇప్పటికే దేహదారుఢ్య పరీక్ష పూర్తి చేసిన వారికి అవసరం లేదని స్పష్టం చేశారు. దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అవ్వని వారి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు నియామక బోర్డు తెలిపింది.
➤ TSPLRB: పోలీస్ ఉద్యోగాల తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు
ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు..
కోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10గంటల వరకు పార్ట్-2 అప్లికేషన్ సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 8 ఉదయం 8గంటల నుంచి 12వ తేది రాత్రి 10గంటల వరకూ దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణ ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అదనపు మార్కుల పూర్తి వివరాలు ఇవే..