Skip to main content

TSPLRB: పోలీస్‌ ఉద్యోగాల తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫామ్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ తుది రాత పరీక్ష తేదీల షెడ్యూల్‌లో స్వల్పంగా మార్పు లు చేసినట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వి.వి. శ్రీనివాస రావు తెలిపారు.
TSPLRB
పోలీస్‌ ఉద్యోగాల తుది రాత పరీక్షల తేదీల్లో మార్పులు

టీఎస్‌పీఎస్సీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జనవరి 13న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి 12న జరగాల్సిన కమ్యూనికేషన్‌ ఎస్సై, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో ఏఎస్సై తుది రాత పరీక్షలను ఒక రోజు ముందుకు.. అంటే మార్చి 11వ తేదీకి మార్చినట్టు వెల్లడించారు.

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

సివిల్‌ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ కానిస్టేబుల్, ఐటీ కమ్యూనికే షన్స్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది రాత పరీక్ష తేదీని ఏప్రిల్‌ 23 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీకి మార్చినట్టు వివరించారు. కాగా, సివిల్‌ ఎస్సై సహా ఇతర పోస్టులకు తుది రాత పరీక్షలు ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే యథావిధిగా నిర్వహి స్తామని శ్రీనివాసరావు తెలిపారు.

Published date : 14 Jan 2023 03:09PM

Photo Stories