TS Police Exam Pattern : పోలీసు ఉద్యోగాల రాతపరీక్ష విధానం ఇదే..
పోలీసు ఉద్యోగాల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాత పరీక్ష విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందామా..
ఎంపిక విధానం :
1. ప్రిలిమినరీ రాత పరీక్ష
2. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
3. ఫైనల్ రాత పరీక్ష
చదవండి: TS Police Syllabus
ప్రిలిమినరీ రాత పరీక్ష :
ఎస్సై, కానిస్టేబుల్ విభాగాల్లో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రిలిమినరీ రాత పరీక్షలో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పరీక్ష సమయం 3 గంటలు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. అయితే ఈ సారి నుంచి ప్రిలిమినరీ రాత పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి తప్పు సమాధానానికి 1/5వ వంతు మార్కు కోత వి«ధిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ రాత పరీక్షలో 30 శాతం మార్కులు(60 మార్కులు) సాధించిన అభ్యర్థులను తర్వాత దశ(ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్)కు ఎంపిక చేస్తారు.
TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్ మార్కులు ఉన్నాయ్.. జాగ్రత్తగా రాయండిలా..
పోటీ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ :
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈ దశలో నిర్ణీత సమయంలో పురుష అభ్యర్థులు 1600 మీ. పరుగు, మహిళ అభ్యర్థులు 800 మీటర్ల పరుగులో అర్హత సాధించాల్సి ఉంటుంది. అర్హత సాధించిన వారికి లాంగ్ జంప్, షార్ట్‌పుట్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
ఫైనల్ రాత పరీక్ష :
➤ కానిస్టేబుల్స్ ఫైనల్ రాత పరీక్షలో 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉండవు. ఇందులో అర్థమెటిక్,రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లిష్ సబ్జెక్టులు నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపరులో అర్హత సాధించిన అభ్యర్థుల మార్కుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్పీ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్స్‌కు ఫైనల్ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.
➤ సబ్ ఇన్‌స్పెక్టర్స్ ఫైనల్ రాత పరీక్షలో 4 పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లలో ఇంగ్లిష్, తెలుగు భాషాంశాలపై 100 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. 3, 4వ పేపర్లుగా అర్థమెటిక్–రీజనింగ్, జనరల్ స్టడీస్ అంశాలపై 200 మార్కులకు 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ఈ సారి నెగిటివ్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
TS Government Jobs: మరో 677 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..