CM KCR : కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. వీరికి కటాఫ్ మార్కులు తగ్గిస్తాం..
ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది వెలువడిన కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం అందరికీ ఒకే కటాఫ్‌ను నిర్ధారించింది.
TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!
కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 28వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన విషయం తెల్సిందే. ఈ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత కోసం అన్ని కేటగిరీలకు 60 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. దీంతో, ప్రతిపక్ష నేతలు, కొందరు అభ్యర్థులు కటాఫ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కటాఫ్ మార్కులు తగ్గేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)
తెలంగాణలో కానిస్టేబుల్, తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షను ఈ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆగస్టు 30వ తేదీ సాయంత్రం విడుదల చేసిన విషయం తెల్సిందే.
తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కోటాలోని 15,644, రవాణా శాఖ 63, అబ్కారీ 614 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 91.34 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్ మార్కు..
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహించారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడిగారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిలో ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు. 200 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రంలో, తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్ మార్కు ఉంటుంది.