Skip to main content

TS Constable Preliminary Exam Date : కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ మార్పు.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కానిస్టేబుల్‌, తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్ష తేదీ మార్పు చేశారు. ఆగ‌స్టు 21వ తేదీన జ‌ర‌గాల్సిన ఈ ప‌రీక్ష‌ను ఆగ‌స్టు 28వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు.

కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఈ ప‌రీక్ష తేదీని మార్పు చేశారు. ఈ మేర‌కు తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆగ‌స్టు 8వ తేదీన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టికెట్లుల‌ను అభ్యర్థులు ఆగ‌స్టు 18వ తేదీ వ‌ర‌కు డౌన్‌లోడ్‌ చేసుకోవ‌చ్చ‌ని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.  16,321 సివిల్‌/తత్సమాన కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ తత్సమాన పోస్ట్‌లకు 9,54,064 దరఖాస్తులు వ‌చ్చాయి.

ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’  కోసం క్లిక్ చేయండి

TS SI Preliminary Exam Question Paper With Key (Click Here)

ఈ సారి 12,91,006 దరఖాస్తులు.. కానీ
పోలీస్, ఎస్‌పీఎఫ్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లో 17,516 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల గడువు మే 26తో ముగిసింది. 52 శాతం (3,55,679) మంది ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, 3 శాతం మంది నాలుగు ఉద్యోగాలకు, ఒక శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేయగా, 6 పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 21 శాతం (2,76,311) మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయని వెల్లడించారు. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్‌ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయోసడలింపుతో 1.4లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ పోటీలో అవకాశం దక్కింది. అలాగే ప్రిలిమినరీ రాతపరీక్షకు 67 శాతం మంది తెలుగు మీడియం, 32.8శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూ మీడియం ఎంచుకున్నారు.

TS Police Recruitment: ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం.. విజయం సాధించడానికి మార్గాలు..

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

కానిస్టేబుల్‌–ప్రిలిమినరీ ప‌రీక్ష విధానం
కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మొత్తం ఎనిమిది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి..ఇంగ్లిష్, అర్థమెటిక్, జనరల్‌ సైన్స్, భారత దేశ చరిత్ర–సంస్కృతి–భారత జాతీయోద్యమం, భౌగోళిక శాస్త్ర సిద్ధాంతాలు–భారత భౌగోళిక శాస్త్రం–పాలిటీ–ఎకానమీ; జాతీయ–అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు, రీజనింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కలిగిన అంశాలు. వీటిలో ఇంగ్లిష్‌ మినహా మిగతా విభాగాలకు తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు.

Police Exam Tips: మూడు టెక్నిక్‌లు పాటిస్తే .. పోలీసు ఉద్యోగం మీదే..!

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

Published date : 08 Aug 2022 05:50PM
PDF

Photo Stories