ఏపీపీ రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదేశం
Police Recruitment Board
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)ల (కేటగిరీ–7) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రాతపరీక్ష లో ఉత్తీర్ణులైన వారి తాత్కాలిక ఎంపిక వివరాలను అభ్యర్థుల సంబంధిత లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు బోర్డు డిసెంబర్ 8న ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు www.tslprb.in సంబంధిత ఖాతాలకు లాగిన్ అయి ఎంపిక వివరాలను, ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని అన్ని కాలమ్‌లను పూర్తిచేసి ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు అప్‌లోడ్ చేయాలని తెలిపింది.