Skip to main content

22 నుంచి పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

సబ్‌ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బీసీ స్టడీసర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సెప్టెంబర్‌ 18న ఓ ప్రకటనలో తెలిపింది.
22 నుంచి పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
22 నుంచి పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

కోవిడ్‌–19 నేపథ్యంలో ఆన్ లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లలో సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ బాలాచారి వివరించారు. జనరల్‌ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్‌ తదితర అంశాల్లో 60 రోజుల పాటు శిక్షణ సాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,622 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిని బ్యాచ్‌లుగా విభజించి కోచింగ్‌ ఇస్తామని చెప్పారు. దీంతోపాటు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఆన్ లైన్ తరగతులు వీక్షించవచ్చని వెల్లడించారు. 

చదవండి: 

ఈ ఐపీఎస్ ఆఫీస‌ర్‌ ఫస్ట్‌ ప్రయారిటీ వీళ్ల‌కే..ఒక్క మాటలో చెప్పాలంటే..?

ఏపీ పోలీస్‌ అధికారులకు కేంద్ర పురస్కారాలు

Published date : 20 Sep 2021 04:26PM

Photo Stories