తెలంగాణ - ప్రసిద్ధ కవులు
1. ‘బసవ పురాణం’ రచయిత?
ఎ) నన్నెచోడుడు
బి) యథావాక్కుల అన్నమయ్య
సి) మల్లికార్జున పండితుడు
డి) పాల్కురికి సోమనాథుడు
- View Answer
- సమాధానం: డి
2. పాల్కురికి సోమనాథుడు ఏ కాకతీయ పాలకుడి కాలంలో విశేష ఖ్యాతి గడించారు?
ఎ) గణపతి దేవుడు
బి) ప్రతాపరుద్రుడు
సి) రుద్రమదేవి
డి) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: ఎ
3. ‘వృషాధిప శతకం’ ఎవరు రచించారు?
ఎ) మారన
బి) గౌరన
సి) కేతన
డి) పాల్కురికి సోమనాథుడు
- View Answer
- సమాధానం: డి
4. మహమ్మదీయ పాలకులు మొదటిసారిగా వరంగల్పై ఎప్పుడు దాడి చేశారు?
ఎ) 1310
బి) 1303
సి) 1296
డి) 1323
- View Answer
- సమాధానం: బి
5. ‘దశరథ రాజ నందన చరిత్ర’ అనే తెలుగు నిరోష్ఠ్య కావ్య రచయిత ఎవరు?
ఎ) నేబది కృష్ణయామాత్యుడు
బి) శాకల్యమల్ల
సి) పొన్నెగంటి తెలగనాచార్యుడు
డి) మరింగంటి సింగాచార్యులు
- View Answer
- సమాధానం: డి
6. మరింగంటి సింగాచార్యులు ఏ రాజవంశం కాలంలో ప్రసిద్ధి చెందారు?
ఎ) పద్మనాయకులు
బి) రెడ్డిరాజులు
సి) గోల్కొండ కుతుబ్షాహీలు
డి) కాకతీయులు
- View Answer
- సమాధానం: సి
7. ‘రతీ మన్మథాభ్యుదయం’ కావ్య రచయిత ఎవరు?
ఎ) మరింగంటి సింగాచార్యులు
బి) నేబది కృష్ణయామాత్యుడు
సి) మల్లినాథసూరి
డి) పొన్నెగంటి తెలగనార్యుడు
- View Answer
- సమాధానం: ఎ
8. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పురాణాన్ని (మార్కండేయ పురాణం) అనువాదం చేసిన కవి ఎవరు?
ఎ) గౌరన
బి) కేతన
సి) మారన
డి) పోతన
- View Answer
- సమాధానం: సి
9. మారన తెలుగులో రచించిన మార్కండేయ పురాణాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
ఎ) గణపతిదేవుడు
బి) గన్నయ నాయకుడు
సి) ప్రతాపరుద్రుడు
డి) రెండో ప్రోలరాజు
- View Answer
- సమాధానం: ఎ
10. ‘ఈశ్వర అల్లా తేరో నాం’ అనే శ్రవ్య నాటక రచయిత?
ఎ) ఆరుద్ర
బి) దాశరథీ రంగాచార్యులు
సి) గౌరన
డి) శ్రీనాథుడు
- View Answer
- సమాధానం: ఎ
11. ‘సింహగిరి వచనాలు’ రచయిత?
ఎ) పోతన
బి) కేతన
సి) మారన
డి) కృష్ణమాచార్యులు
- View Answer
- సమాధానం: డి
12. మధుర కవితకు ఆద్యుడైన ‘కృష్ణమాచార్యులు’ ఏ కాకతీయ చక్రవర్తి కాలానికి చెందినవారు?
ఎ) ప్రతాపరుద్రుడు
బి) గణపతిదేవుడు
సి) రుద్రమదేవి
డి) ప్రోలరాజు
- View Answer
- సమాధానం: ఎ