మాదిరి ప్రశ్నలు-8
1. రాజుకు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ అవసరాల కోసం ‘నాయంకర సైన్యం’ అనే వ్యవస్థను రూపొందించిన రాజ్యం ఏది?
1) విజయనగర రాజులు
2) చాళుక్యులు
3) శాతవాహనులు
4) కాకతీయులు
- View Answer
- సమాధానం: 4
2. సంస్కృతంలో ‘సంగీత చింతామణి’ గ్రంథాన్ని రాసిన రెడ్డిరాజు ఎవరు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) రాచవేమారెడ్డి
3) కాటయ వేమారెడ్డి
4) కుమారగిరి రెడ్డి
- View Answer
- సమాధానం: 1
3. రేచర్ల వెలమలు ఎక్కువగా ఆదరించిన మతం ఏది?
1) శైవం
2) వైష్ణవం
3) బౌద్ధం
4) క్రైస్తవం
- View Answer
- సమాధానం: 2
4. రెడ్డిరాజుల ప్రధాన మతం ఏది?
1) శైవం
2) వైష్ణవం
3) బౌద్ధం
4) జైనం
- View Answer
- సమాధానం: 1
5. పల్నాడు, వినుకొండ సీమల్లో ‘రంభైయెున ఏకులు వడుకున్’ అని వర్ణించిన కవి?
1) పోతనామాత్యుడు
2) పాల్కురికి సోమనాథుడు
3) శ్రీనాథమహాకవి
4) డిండిమభట్టు
- View Answer
- సమాధానం: 3
6. దేశీయ-విదేశీ వర్తకుల సంరక్షణార్థం క్రీ.శ 1358లో మోటుపల్లి రేవు అభయ శాసనాన్ని సంస్కరించిన రెడ్డి రాజెవరు?
1) కుమారగిరి రెడ్డి
2) అనపోతారెడ్డి
3) పెదకోమటి వేమారె డ్డి
4) కాటయ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 2
7. కాకతీయ తోరణాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా ఎంచుకున్నారు. ఓరుగల్లులోని స్వయంభూ దేవాలయానికి నాలుగువైపులా రాతితో ఈ తోరణాలను ఏ కాకతీయ రాజు నిర్మించాడు?
1) రెండో ప్రోలరాజు
2) ప్రతాపరుద్రుడు
3) గణపతి దేవుడు
4) మహాదేవుడు
- View Answer
- సమాధానం: 3
8. ‘ఆంధ్రదేశాధీశ్వరుడు’గా ఖ్యాతిగాంచిన కాకతీయ రాజు ఎవరు?
1) ప్రతాపరుద్రుడు
2) రుద్రమదేవి
3) ప్రోలరాజు
4) గణపతి దేవుడు
- View Answer
- సమాధానం: 4
9. ‘రంగనాథ రామాయణం’ ఎవరు రచించారు?
1) పోతన
2) శ్రీనాథుడు
3) పండితారాధ్యుడు
4) గోన బుద్ధారెడ్డి
- View Answer
- సమాధానం: 4
10. ‘అవక్రవిక్రమ యశస్య సంభావ్య బాహ ర్గలుడు’ అనే బిరుదు ఎవరికి ఉంది?
1) ముసునూరి ప్రోలయనాయకుడు
2) ముసునూరి కాపయనాయకుడు
3) ముసునూరి పోచయనాయకుడు
4) ముసునూరి దేవయనాయకుడు
- View Answer
- సమాధానం: 1
11. ముసునూరి కాపయనాయకునికి ‘అరుమనగంటి పురవరాధీశ్వరుడు’ (ఆమనగల్లు) అనే బిరుదు ఉన్నట్లు ఏ శాసనంలో పేర్కొన్నారు?
1) కలువచేరు శాసనం
2) పిల్లలమర్రి శాసనం
3) ఆర్యావట శాసనం
4) గణపేశ్వర శాసనం
- View Answer
- సమాధానం: 4
12. ముసునూరి కాపయనాయకుడు, రేచర్ల అనపోతా నాయకుడి మధ్య క్రీ.శ. 1367-68లో భీకర యుద్ధం ఎక్కడ జరిగింది?
1) ఓరుగల్లు
2) భీమవరం
3) నల్గొండ
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 2
13. రాచకొండ, దేవరకొండ రాజధానులుగా త్రిలింగ దేశాన్ని ఎవరు పాలించారు?
1) కాకతీయులు
2) రేచర్ల పద్మనాయకులు
3) రెడ్డిరాజులు
4) విజయనగర రాజులు
- View Answer
- సమాధానం: 2
14. రేచర్ల వంశ మూలపురుషుడెవరు?
1) రేచర్ల ప్రసాదిత్యుడు
2) రేచర్లరుద్రుడు
3) బేతాళ రెడ్డి
4) సర్వజ్ఞ సింగభూపాలుడు
- View Answer
- సమాధానం: 3
15. రేచర్ల పద్మనాయకుల వంశచరిత్రను తెలిపే గ్రంథం పేరేమిటి?
1) ప్రతాపరుద్ర చరిత్ర
2) పండితారాధ్య చరిత్ర
3) చమత్కార చంద్రిక
4) వెలుగోటి వారి వంశావళి
- View Answer
- సమాధానం: 4
16.‘కాకతీయ రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదు ఉన్న రేచర్ల నాయకుడెవరు?
1) రేచర్ల రుద్రుడు
2) రేచర్ల ప్రసాదిత్యుడు
3) బేతాళ రెడ్డి
4) సింగమనేడు
- View Answer
- సమాధానం: 2
17. ‘సర్వజ్ఞ’ అనే బిరుదున్న రేచర్ల పద్మ నాయకుడెవరు?
1) అనపోతానాయకుడు
2) మాదానాయకుడు
3) కుమారసింగభూపాలుడు
4) దాచానాయకుడు
- View Answer
- సమాధానం: 3
18. రెడ్డి-వెలమ రాజుల మధ్య అనుసంధానకర్తగా ఎవరు వ్యవహరించారు?
1) పోతనామాత్యుడు
2) గౌరన
3) కొరవి గోపరాజు
4) శ్రీనాథుడు
- View Answer
- సమాధానం: 4
19. హన్మకొండలో పద్మాక్షి, సిద్ధేశ్వరాలయాలను నిర్మించిన కాకతీయ రాజెవరు?
1) గణపతి దేవుడు
2) ప్రోలరాజు
3) మహాదేవుడు
4) రుద్రమదేవి
- View Answer
- సమాధానం: 2
20. తెలంగాణలో భారీ నీటి పారుదల సౌకర్యాల కల్పన చేపట్టిన తొలి రాజవంశం?
1) కుతుబ్షాహీలు
2) విజయనగర రాజులు
3) కాకతీయులు
4) రేచర్ల పద్మనాయకులు
- View Answer
- సమాధానం: 3
21. కిందివాటిలో భిన్నమైంది ఏది?
1) క్షీరారామం
2) ద్రాక్షారామం
3) కాళేశ్వరం
4) శ్రీశైలం
- View Answer
- సమాధానం: 1
22. శత్రువుల రక్తాన్ని శరీరమంతా పూసుకునే పూజా విధానమైన ‘రణము కుడుపు’ అనే భైరవ తాంత్రిక పద్ధతిని ఏ రాజవంశం ఆచరించింది?
1) రేచర్ల పద్మనాయకులు
2) రెడ్డిరాజులు
3) కాకతీయులు
4) విజయనగర రాజులు
- View Answer
- సమాధానం: 1
23.‘గజ సాహిణీ’ అనే బిరుదు ఎవరిది?
1) విద్యానాథుడు
2) రుద్రమదేవి
3) జాయపసేనాని
4) గణపతి దేవుడు
- View Answer
- సమాధానం: 3
24.‘ప్రతాపరుద్ర యశోభూషణం’ రచయిత ఎవరు?
1) శ్రీనాథుడు
2) విద్యానాథుడు
3) పోతన
4) అచితేంద్రుడు
- View Answer
- సమాధానం: 2
25. ‘చమత్కార చంద్రిక’ రచయిత ఎవరు?
1) బొమ్మకంటి అప్పయామాత్యుడు
2) శ్రీనాథుడు
3) పోతన
4) విశ్వేశ్వరుడు
- View Answer
- సమాధానం: 4
26. పురిటిసుంకం, పొయ్యిలపై పన్ను విధించిన రెడ్డి రాజెవరు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) సింగభూపాలుడు
3) రాచవేమారెడ్డి
4) కుమారగిరిరెడ్డి
- View Answer
- సమాధానం: 3
27. ‘కైఫీయతులు’ అంటే ఏమిటి?
1) స్థానిక చరిత్రలు
2) రాజవంశ చరిత్రలు
3) పొగడ్తలు
4) నాణేలు
- View Answer
- సమాధానం: 1
28. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం నాటకాలపై ‘కుమారగిరి రాజీయం’ పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం రాసిన రెడ్డిరాజు ఎవరు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) కుమారగిరి రెడ్డి
3) రాచవేమారెడ్డి
4) కాటయవేమారెడ్డి
- View Answer
- సమాధానం: 4
29.శ్రీశైలంలో ‘వీర శిరోమండపం’ నిర్మించిన రెడ్డిరాజెవరు?
1) రాచవేమారెడ్డి
2) కుమారగిరి రెడ్డి
3) అనవేమారెడ్డి
4) పెదకోమటి వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 3
30. అహోబిలం, శ్రీశైలం పాతాళ గంగకు సోపానాలు (మెట్లు) నిర్మించిన రెడ్డి రాజు?
1) అనపోతారెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) ప్రోలయవేమారెడ్డి
4) రాచవేమారెడ్డి
- View Answer
- సమాధానం: 3
31.‘కర్పూర వసంతరాయుడు’ అనే బిరుదు ఉన్న రెడ్డిరాజు ఎవరు?
1) అనవేమారెడ్డి
2) కొమరగిరి (కుమారగిరి) రెడ్డి
3) ప్రోలయవేమారెడ్డి
4) పెదకోమటి వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 2
32.సంస్కృతంలో ‘సాహిత్య చింతామణి’, ‘సంగీత చింతామణి’ రాసిన రెడ్డిరాజు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) రాచవేమారె డ్డి
3) ప్రోలయ వేమారెడ్డి
4) కాటయ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 1
33. రెడ్డి రాజుల కాలంలో విదేశాలతో నౌకా వ్యాపారాన్ని నిర్వహించినవారు?
1) వామన భట్టభాణుడు
2) వెన్నెలకంటి సూరన
3) అవచి తిప్పయశెట్టి
4) శ్రీనాథుడు
- View Answer
- సమాధానం: 3
34. రెడ్డిరాజుల కులదేవత పేరేమిటి?
1) విద్యాదేవి
2) మూల గూరమ్మ
3) కాకతి
4) దుర్గాదేవి
- View Answer
- సమాధానం: 2
35. శ్రీనాథ మహాకవి ఏ రెడ్డిరాజు ఆస్థానంలో ‘విద్యాధికారిగా’ పనిచేశాడు?
1) ప్రోలయవేమారెడ్డి
2) పెదకోమటి వేమారెడ్డి
3) రాచవేమారెడ్డి
4) కాటయ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 2
36. ‘లకుమాదేవి’ అనే నాట్యగత్తె ఏ రెడ్డిరాజు కొలువులో ఉండేది?
1) పెదకోమటి వేమారెడ్డి
2) కుమారగిరి రెడ్డి
3) కాటయ వేమారెడ్డి
4) రాచ వేమారెడ్డి
- View Answer
- సమాధానం: 2
37. ‘వేమభూపాల చరితం’ అనే చారిత్రక గ్రంథ రచయిత ఎవరు?
1) వామన భట్టభాణుడు
2) శ్రీనాథుడు
3) పోతన
4) గౌరన
- View Answer
- సమాధానం: 1
38. ‘సింహాసన ద్వాత్రింశిక’ రచయిత ఎవరు?
1) అనంతామాత్యుడు
2) మల్లన
3) కొరవి గోపరాజు
4) కొమ్మన
- View Answer
- సమాధానం: 3
39.‘భోగినీ దండకం’, ‘వీరభద్ర విజయం’ గ్రంథాల రచయిత ఎవరు?
1) పోతనామాత్యుడు
2) శ్రీనాథుడు
3) విశ్వేశ్వర కవి
4) ఎర్రాప్రెగడ
- View Answer
- సమాధానం: 1
40. రెడ్డిరాజుల కాలంలో ‘భూమిని’ దేనితో కొలిచేవారు?
1) దారం
2) కేసరపాటి గడ
3) ఇనుప గొలుసు
4) కాళ్ల అడుగులు
- View Answer
- సమాధానం: 2
41. తెలంగాణలో అనపోత సముద్రం, రాయ సముద్రం, నాగ సముద్రం అనే చెరువులను ఎవరికాలంలో తవ్వించారు?
1) రేచర్ల పద్మనాయుకులు
2) కాకతీయులు
3) రెడ్డి రాజులు
4) విజయనగర రాజులు
- View Answer
- సమాధానం: 1
42. నీటి పారుదల సౌకర్యార్థం ‘సంతాన సాగరం’ అనే పెద్ద తటాకం, జగనొబ్బగండ కాల్వలను ఎవరు నిర్మించారు?
1) కాకతీయులు
2) విజయనగర రాజులు
3) కుతుబ్షాహీలు
4) రెడ్డిరాజులు
- View Answer
- సమాధానం: 4
43. ‘సర్వమాన్యములు’ అంటే ఏమిటి?
1) రాచభూములు
2) పన్నులు లేని భూములు
3) దేవాలయ భూములు
4) సామంతుల భూములు
- View Answer
- సమాధానం: 2
44.‘మాచల్దేవి’ ఏ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర?
1) భాగవతం
2) క్రీడాభిరామం
3) రంగనాథ రామాయణం
4) హరివంశం
- View Answer
- సమాధానం: 2
45.‘జైమినీ భారతం’ గ్రంథకర్త ఎవరు?
1) తిక్కన
2) ఎర్రాప్రెగడ
3) శ్రీనాథుడు
4) పిల్లలమర్రి పినవీరభద్రుడు
- View Answer
- సమాధానం: 4
46. తెలంగాణలో ‘నవబ్రహ్మ ఆలయాలు’ ఎక్కడ ఉన్నాయి?
1) పానగల్లు
2) వేములవాడ
3) యాదగిరి గుట్ట
4) అలంపురం
- View Answer
- సమాధానం: 4
47. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి?
1) వేములవాడ
2) ఓరుగ ల్లు
3) అలంపురం
4) పిల్లలమర్రి
- View Answer
- సమాధానం: 3
48. కిందివాటిలో సరికాని జత ఏది?
1) నన్నెచోడుడు-కుమార సంభవం
2) సోమనాథుడు-పండితారాధ్య చరిత్ర
3) వేములవాడ భీమకవి-బసవ పురాణం
4) మల్లికార్జున పండితారాధ్యుడు- శివతత్త్వసారం
- View Answer
- సమాధానం: 3
49. 1182లో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగాముడికి సహాయంగా పల్నాడుకు సైన్యాన్ని పంపిన కాకతీయ చక్రవర్తి?
1) రుద్రమదేవి
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు
4) గణపతిదేవుడు
- View Answer
- సమాధానం: 3
50. ‘ఆంధ్ర సురత్రాణ’ అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు?
1) ప్రోలయనాయకుడు
2) అనవేమారెడ్డి
3) కాపయనాయకుడు
4) గన్నయ
- View Answer
- సమాధానం: 3
51.ఎర్రాప్రెగడ ఎవరి ఆస్థానంలో విద్యాధి కారి?
1) అల్లాడరెడ్డి
2) అనవేమారెడ్డి
3) ప్రోలయవేమారెడ్డి
4) అనవోతారెడ్డి
- View Answer
- సమాధానం: 3
52. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు?
1) నెల్లూరు
2) మచిలీపట్నం
3) మోటుపల్లి
4) ధరణికోట
- View Answer
- సమాధానం: 3
53. రుద్రమదేవి పాలనాకాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు?
1) డొమింగో పేస్
2) నికోలోకోంటి
3) మార్కోపోలో
4) జోర్డానస్
- View Answer
- సమాధానం: 3
54.హన్మకొండలోని వేయిస్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది?
1) రుద్రదేవుడు
2) రుద్రమదేవి
3) గణపతి దేవుడు
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 1
55. తొలితరం కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది?
1) జైనం
2) శైవం
3) బౌద్ధం
4) ైవె ష్ణవం
- View Answer
- సమాధానం: 1
56. హన్మకొండ వేయి స్తంభాలగుడి, ఓరుగల్లు దుర్గం, ఏకశిలానగరాలకు పునాది వేసిన కాకతీయ రాజు ఎవరు?
1) గణపతిదేవుడు
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రమదేవి
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 4
57. సేనాధిపతి రేచర్ల రుద్రుడు ప్రసిద్ధిగాంచిన ‘రామప్ప దేవాలయాన్ని’ ఏ కాకతీయ రాజు కాలంలో నిర్మించాడు?
1) ప్రోలరాజు
2) గణపతిదేవుడు
3) ప్రతాపరుద్రుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 2
58. రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు?
1) ప్రతాపరుద్రుడు
2) రుద్ర దేవుడు
3) గణపతిదేవుడు
4) రుద్రమదేవి
- View Answer
- సమాధానం: 3