తెలంగాణ పండుగలు
1. తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ర్ట పండుగగా ఏ రోజున ప్రకటించింది? 2014లో)
ఎ) జూన్ 2
బి) జూన్ 6
సి) జూన్ 16
డి) జూన్ 18
- View Answer
- సమాధానం: సి
2. బతుకమ్మ పండుగకు సంబంధించిన వాస్తవ అంశం?
1. తంగేడి పూలు ఉపయోగించడం
2. అశ్వయజ మాసం మొదటిరోజు ప్రారంభమవుతుంది
3. మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ
4. రెండో రోజు అటుకుల బతుకమ్మ
ఎ) 1, 3 మాత్రమే
బి) 2, 4 మాత్రమే
సి) 1, 2 మాత్రమే
డి) 1, 3, 4 మాత్రమే
- View Answer
- సమాధానం:డి
3. బోనాల పండుగకు సంబంధించి వాస్తవ అంశం?
1. బోనం (భోజనం)
2. ఘటోత్సవం (కలశం)
3. రంగం (భవిష్యవాణి)
ఎ) 1, 2 మాత్రమే వాస్తవం
బి) 1, 3 మాత్రమే వాస్తవం
సి) 2, 3 మాత్రమే వాస్తవాలు
డి) పైవన్నీ వాస్తవాలే
- View Answer
- సమాధానం:డి
4. ఏడుపాయల జాతర ఏ ప్రాంతంలో ప్రసిద్ధి?
ఎ) నాగసానిపల్లి
బి) రంగధాం పల్లి
సి) కేస్లాపూర్
డి) వేలాల
- View Answer
- సమాధానం: ఎ
5. ‘సమ్మక్క-సారక్క’ అతిపెద్ద గిరిజన జాతర. ఇది మేడారం(వరంగల్ జిల్లా)లో రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. దీనికి సంబంధించి సరికానిది?
ఎ) 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ర్ట పండుగగా ప్రకటించింది
బి) ఇది ప్రధానంగా నాలుగు రోజుల పండుగ
సి)కన్నెపల్లి నుంచి సారక్కను తీసుకొస్తారు
డి) సమ్మక్క - సారలమ్మ అక్కా చెల్లెళ్లు
- View Answer
- సమాధానం: డి
6. హర్తాళిక పండుగను ఏ పండుగకు ముందు జరుపుకుంటారు?
ఎ) దసరా
బి) వినాయక చవితి
సి) దీపావళి
డి) పీర్ల పండగ
- View Answer
- సమాధానం: బి
7. మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా ‘గొల్లగట్టు’ జాతర ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన అంశం?
1. దీన్నే పెద్దగట్టు జాతర అంటారు
2. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లిలో ఉంది
3. ఆరాధ్యదైవం లింగమంతుల స్వామి
ఎ) 1 మాత్రమే
బి) 1, 2 మాత్రమే
సి) 2, 3 మాత్రమే
డి) 1, 2, 3 మాత్రమే
- View Answer
- సమాధానం: డి
8. సాధారణంగా వర్షాకాలం ప్రారంభమై నాట్లు పూర్తయిన తర్వాత తొమ్మిది రోజులపాటు జరుపుకొనే ఆదివాసీల పండుగ?
ఎ) నాగశేష
బి) పెర్సాపెన్
సి) శీతల భవానీ
డి) తీజ్ పండుగ
- View Answer
- సమాధానం: డి