శాతవాహన అనంతర యుగం
1. సోమశేఖర శర్మ శాతవాహనుల తర్వాత ఏ పాలకుల కాలం వరకు ‘అజ్ఞాత యుగం’గా పేర్కొన్నాడు?
1) ఇక్ష్వాకులు
2) బాదామీ చాళుక్యులు
3) వాకాటకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 2
2. హర్షుడికి సమకాలికంగా తెలంగాణ ప్రాంతాన్ని పులకేశి పాలించినట్లు పేర్కొన్నవారెవరు?
1) మల్లంపల్లి సోమశేఖర శర్మ
2) వట్టికోట ఆళ్వారుస్వామి
3) ఆదిరాజు వీరభద్రరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 4
3. ‘శ్రీ పర్వతీయులు’ అని ఎవరిని పేర్కొంటారు?
1) బాదామీ చాళుక్యులు
2) వాకాటకులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 3
4. ఇక్ష్వాకులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు?
1) వాకాటకులు
2) శాతవాహనులు
3) విష్ణుకుండినులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
5. స్వతంత్రంగా ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించినవారెవరు?
1) వీరపురుషదత్తుడు
2) ఎహుబల శాంతమూలుడు
3) రుద్ర పురుషదత్తుడు
4) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
- View Answer
- సమాధానం: 4
6. పురాణాల ప్రకారం ఇక్ష్వాక రాజులు ఎంతమంది?
1) 6
2) 7
3) 8
4) 4
- View Answer
- సమాధానం: 2
7. ఇక్ష్వాక రాజుల పాలనా క్రమం?
1) రుద్రపురుషదత్తుడు, శ్రీశాంతమూలుడు, వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు, వీరపురుషదత్తుడు
2) వీరపురుషదత్తుడు, ఎహుబల శాంతమూలుడు, శ్రీశాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు
3) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు, వీరపురుషదత్తుడు, ఎహుబల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు
4) ఎహుబల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు, శ్రీశాంతమూలుడు
- View Answer
- సమాధానం: 3
8. ఇక్ష్వాకుల రాజధాని ఏది?
1) విజయపురి
2) నేలకొండపల్లి
3) ధాన్యకటకం
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 1
9. బి.ఎన్.శాస్త్రి ప్రకారం ‘దక్షిణాపథపతి’ అనే బిరుదున్న రాజు ఎవరు?
1) రుద్రపురుషదత్తుడు
2) శ్రీశాంతమూలుడు
3) ఎహుబల శాంతమూలుడు
4) వీరపురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 3
10. ఉజ్జయినీ పాలకుడైన శకరాజు కుమార్తెను వివాహమాడిన రాజు?
1) వీరపురుషదత్తుడు
2) రుద్రపురుషదత్తుడు
3) ఎహుబల శాంతమూలుడు
4) శ్రీశాంతమూలుడు
- View Answer
- సమాధానం: 2
11. ఏ రాజవంశ పాలనలో ‘ఎలిసిరి’ అనే ఉద్యోగి ఉండేవాడు?
1) ఇక్ష్వాకులు
2) వాకాటకులు
3) విష్ణుకుండినులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 1
12. ‘హలసహస్త్ర’ బిరుదాంకితుడెవరు?
1) రుద్రపురుషదత్తుడు
2) వీరపురుషదత్తుడు
3) శ్రీశాంతమూలుడు
4) ఎహుబల శాంతమూలుడు
- View Answer
- సమాధానం: 3
13. ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
1) మయూరం
2) గుర్రం
3) వృషభం
4) సింహం
- View Answer
- సమాధానం: 4
14. వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు అవలంబించిన మతం ఏది?
1) జైనం
2) వైదికం
3) శైవం
4) బౌద్ధం
- View Answer
- సమాధానం: 2
15. ఎవరి పాలనా కాలాన్ని ‘బౌద్ధమతానికి స్వర్ణయుగం’గా పేర్కొంటారు?
1) ఎహుబల శాంతమూలుడు
2) శ్రీశాంతమూలుడు
3) వీరపురుషదత్తుడు
4) రుద్రపురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 3
16. ఇక్ష్వాకులు పోషించిన భాష ఏది?
1) తెలుగు
2) సంస్కృతం
3) పైశాచీ
4) ప్రాకృతం
- View Answer
- సమాధానం: 4
17. ఇంద్రపాలనగర శాసనాన్ని ఎవరు వేయించారు?
1) విక్రమేంద్రభట్టారక వర్మ
2) విక్రమేంద్రవర్మ
3) మూడో మాధవవర్మ
4) రెండో మాధవవర్మ
- View Answer
- సమాధానం: 1
18. మేనత్త కూతురును వివాహం చేసుకోవడం ప్రధానంగా ఏ రాజవంశంలో కనిపిస్తుంది?
1) ఇక్ష్వాకులు
2) బాదామీ చాళుక్యులు
3) విష్ణుకుండినులు
4) శాతవాహనులు
- View Answer
- సమాధానం: 1
-
19. కీసర సమీపంలో ‘ఘటకేశ్వరం’ అనే ఘటికా స్థానాన్ని నెలకొల్పిందెవరు?
1) మాధవవర్మ
2) ఇంద్రభట్టారకవర్మ
3) విక్రమేంద్రవర్మ
4) విక్రమేంద్ర భట్టారకవర్మ
- View Answer
- సమాధానం: 2
20. ఇంద్రభట్టారక వర్మ తన కూతురు ఇంద్ర భట్టారికను ఎవరికిచ్చి వివాహం చేశాడు?
1) ఈశాన్యవర్మ
2) మొదటి అరికేసరి
3) మొదటి కీర్తివర్మ
4) శర్వవర్మ
- View Answer
- సమాధానం: 4
21. గోవిందవర్మ భార్య పేరుపై నిర్మించిన మహాదేవ విహారానికి విక్రమేంద్ర భట్టారక వర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది?
1) పేణ్కపర
2) ఇరుణ్ణెరో
3) రాయగిరి
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 2
22. ‘జనాశ్రయుడు’ అనే బిరుదున్న విష్ణుకుండిన రాజు ఎవరు?
1) ఇంద్రభట్టారకవర్మ
2) విక్రమేంద్రవర్మ
3) రెండో గోవిందవర్మ
4) నాలుగో మాధవవర్మ
- View Answer
- సమాధానం: 4
23. పొలమూరు శాసనం వేయించింది?
1) ఇంద్రభట్టారకవర్మ
2) నాలుగో మాధవవర్మ
3) రెండో గోవిందవర్మ
4) విక్రమేంద్రవర్మ
- View Answer
- సమాధానం: 2
24. నాలుగో మాధవవర్మ వేయించిన పొలమూరు శాసన కాలం?
1) క్రీ.శ. 619
2) క్రీ.శ. 620
3) క్రీ.శ. 621
4) క్రీ.శ. 622
- View Answer
- సమాధానం: 3
25. విష్ణుకుండిన వంశ చివరి రాజు ఎవరు?
1) మంచన భట్టారకుడు
2) రెండో గోవిందవర్మ
3) మూడో మాధవవర్మ
4) ఇంద్రభట్టారక
- View Answer
- సమాధానం: 1
26. నాలుగో మాధవవర్మ ఏ కాలంలో రాజ్యానికి వచ్చాడని బి.ఎన్. శాస్త్రి అభిప్రాయం?
1) క్రీ.శ. 560
2) క్రీ.శ. 570
3) క్రీ.శ. 563
4) క్రీ.శ. 573
- View Answer
- సమాధానం: 4
27. మొదటి గోవిందవర్మ పృథ్వీమూలుడి సహాయంతో ఎవరిని తుదముట్టించాడు?
1) శాలంకాయనులు
2) ఆనందగోత్రికులు
3) రెడ్డి రాజులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 1
28. మొదటి గోవిందవర్మ భార్య మహాదేవి ఏ మతానికి చెందింది?
1) జైనం
2) శైవం
3) బౌద్ధం
4) వైష్ణవం
- View Answer
- సమాధానం: 3
29. ఇంద్రపురిలో బౌద్ధ మహా విహారానికి మొదటి గోవిందవర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది?
1) భువనగిరి
2) పేణ్కపర
3) మోత్కూర్
4) కొలనుపాక
- View Answer
- సమాధానం: 2
30. పేణ్కపర అగ్రహారాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు?
1) మోత్కూర్
2) రాములబండ
3) రాయగిరి
4) పనకబండ
- View Answer
- సమాధానం: 4
31. పదకొండు అశ్వమేథ యాగాలు, వేయి క్రతువులను చేసినవారు?
1) మొదటి గోవిందవర్మ
2) విక్రమేంద్రవర్మ
3) రెండో మాధవవర్మ
4) దేవవర్మ
- View Answer
- సమాధానం: 3
32. ఇంద్రపాలనగరం నుంచి అమరావతికి రాజధానిని మార్చిన విష్ణుకుండిన రాజు?
1) మొదటి మాధవవర్మ
2) రెండో మాధవవర్మ
3) మొదటి గోవిందవర్మ
4) రెండో గోవిందవర్మ
- View Answer
- సమాధానం: 2
33. కీసరలోని రామలింగేశ్వరాలయం ఎవరి కాలం నాటిది?
1) బాదామీ చాళుక్యులు
2) రాష్ట్రకూటులు
3) విష్ణుకుండినులు
4) వేములవాడ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 3
34.వాకాటక రాజ్యం ఎవరి పాలన తర్వాత విష్ణుకుండిన సామ్రాజ్యంలో చేరింది?
1) రెండో పృథ్వీసేనుడు
2) దామోదరసేనుడు
3) రెండో రుద్రదేవుడు
4) దివాకరసేనుడు
- View Answer
- సమాధానం: 1
35. కీసర రామలింగేశ్వర, చెరువుగట్టు జడల రామలింగేశ్వర, ఇంద్రపాలనగర అమరేశ్వర ఆలయాలను నిర్మించింది ఎవరు?
1) మొదటి గోవిందవర్మ
2) మొదటి మాధవవర్మ
3) రెండో మాధవవర్మ
4) కీర్తివర్మ
- View Answer
- సమాధానం:3
36. ఇంద్రపాలనగర తామ్రశాసనాన్ని వేయించినవారు?
1) విక్రమేంద్రవర్మ
2) విక్రమేంద్రభట్టారకవర్మ
3) ఇంద్రభట్టారక వర్మ
4) మాధవర్మ
- View Answer
- సమాధానం: 2
37. ‘ధర్మామృతం’ ఏ మతానికి సంబంధించిన కావ్యం?
1) బౌద్ధం
2) హిందూ
3) శైవం
4) జైనం
- View Answer
- సమాధానం: 4
38.ఇక్ష్వాకులను తుదముట్టించి కృష్ణానది దక్షిణ ప్రాంతాన్ని వశపరుచుకున్నవారు?
1) వాకాటకులు
2) విష్ణుకుండినులు
3) పల్లవులు
4) రెండో పులోమావి
- View Answer
- సమాధానం: 3
39. ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది?
1) వాకాటకులు
2) పల్లవులు
3) బృహత్పలాయనులు
4) ఆనందగోత్రికులు
- View Answer
- సమాధానం: 1
40. వాకాటకుల రాజధాని ఏది?
1) విదర్భ
2) పురికా
3) విజయపురి
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 2
41. వాకాటక రాజ్య స్థాపకుడు ఎవరు?
1) మొదటి ప్రవరసేనుడు
2) మొదటి రుద్రసేనుడు
3) మొదటి పృథ్వీసేనుడు
4) వింధ్యశక్తి
- View Answer
- సమాధానం: 4
42. వాకాటకులు ఉత్తర భారతదేశానికి చెందిన వారని పేర్కొన్నదెవరు?
1) వి.వి.మిరాసి
2) డాక్టర్ జైస్వాల్
3) ఆర్.సి. మజుందార్
4) బి.ఎన్.శాస్త్రి
- View Answer
- సమాధానం: 2
43. వాకాటకులు దక్షిణ భారతదేశానికి చెందినవారని అభిప్రాయపడినవారు?
1) వి.వి.మిరాసి
2) జైస్వాల్
3) ఆర్.సి. మజుందార్
4) బి.ఎన్.శాస్త్రి
- View Answer
- సమాధానం: 1
44. ప్రభావతి ఎవరి భార్య?
1) రెండో రుద్రసేనుడు
2) మొదటి ప్రవరసేనుడు
3) వింధ్యశక్తి
4) రెండో చంద్రగుప్తుడు
- View Answer
- సమాధానం: 1
45. శాతవాహనుల తర్వాత దక్కన్ ప్రాంతాన్ని ఐక్యం చేసి పాలించిన రాజు?
1) వింధ్యశక్తి
2) రెండో చంద్రగుప్తుడు
3) ఒకటో ప్రవరసేనుడు
4) రెండో ప్రవరసేనుడు
- View Answer
- సమాధానం: 3
46. వాకాటకులపై విస్తృత పరిశోధన చేసినవారు?
1) కె.సి. చౌదరి
2) ఎ.ఎస్. అల్టేకర్
3) ఆర్.సి. మజుందార్
4) జైస్వాల్
- View Answer
- సమాధానం: 2
47. తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ఏ రాజుల చరిత్ర మరుగునపడింది?
1) శాతవాహనులు
2) వాకాటకులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 2
48. సముద్రగుప్తుడికి సమకాలీకుడైన వాకాటక రాజు ఎవరు?
1) మొదటి పృథ్వీసేనుడు
2) మొదటి ప్రవరసేనుడు
3) హరిసేనుడు
4) మొదటి రుద్రసేనుడు
- View Answer
- సమాధానం: 4
49. వాకాటక మహాదేవి ఎవరి కుమార్తె?
1) మొదటి పృథ్వీసేనుడు
2) రెండో పృథ్వీసేనుడు
3) రెండో రుద్రసేనుడు
4) దామోదరుడు
- View Answer
- సమాధానం: 2
50. వాకాటక మహాదేవిని వివాహమాడిన విష్ణుకుండిన రాజు?
1) రెండో మాధవవర్మ
2) గోవిందవర్మ
3) విక్రమేంద్రవర్మ
4) రెండో రుద్రసేనుడు
- View Answer
- సమాధానం: 1
51. వాకాటక రాజవంశంలో పరాక్రమవంతుడిగా ప్రసిద్ధి పొందిన రాజు ఎవరు?
1) విక్రమేంద్రవర్మ
2) రెండో మాధవవర్మ
3) గోవిందవర్మ
4) హరిసేనుడు
- View Answer
- సమాధానం: 4
52. వాకాటకులు ఏ వర్ణానికి చెందినవారు?
1) క్షత్రియులు
2) బ్రాహ్మణులు
3) వైశ్యులు
4) శూద్రులు
- View Answer
- సమాధానం: 2
53. ‘మేఘదూతం’ కావ్య రచయిత ఎవరు?
1) రెండో ప్రవరసేనుడు
2) సర్వసేనుడు
3) కాళిదాసు
4) సేతుబంధు
- View Answer
- సమాధానం: 3
54. ‘యాజ్ఞవల్క్య’, ‘నారదీయకాత్యాయన’ అనే స్మృతులను ఎవరి కాలంలో రచించారు?
1) విష్ణుకుండినులు
2) వాకాటకులు
3) ఇక్ష్వాకులు
4) పల్లవులు
- View Answer
- సమాధానం: 2
55. ప్రాకృతంలో ‘సేతుబంధం’ అనే కావ్యం రాసింది ఎవరు?
1) కాళిదాసు
2) సర్వసేనుడు
3) భవభూతి
4) రెండో ప్రవరసేనుడు
- View Answer
- సమాధానం: 4
56. ప్రాకృత భాషలో ‘హరివిజయం’ అనే కావ్యాన్ని రాసినవారెవరు?
1) కాళిదాసు
2) సేతుబంధు
3) భవభూతి
4) సర్వసేనుడు
- View Answer
- సమాధానం:4
57. వాకాటకుల కాలం నాటి గొప్ప సాంస్కృతిక కేంద్రం ఏది?
1) రామగిరి
2) రాంటేక్
3) వత్సగుల్మ
4) కొండాపురం
- View Answer
- సమాధానం: 3
58. అజంతా, ఎల్లోరా గుహల్లో వాకాటకుల విహార గుహలేవి?
1) 16, 17వ గుహలు
2) 16, 15వ గుహలు
3) 16, 18వ గుహలు
4) 18, 19వ గుహలు
- View Answer
- సమాధానం: 1
59. సర్వసేనుడు దేన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు?
1) రాంటేక్
2) వత్సగుల్మ
3) రాయగిరి
4) పిల్లలమర్రి
60. విష్ణుకుండినులపై లోతైన పరిశోధన చేసినవారెవరు?
1) డాక్టర్ బిరుదురాజు రామరాజు
2) రాపాక ఏకాంబరాచార్యులు
3) పి. శ్రీరామశర్మ
4) బి.ఎన్. శాస్త్రి
- View Answer
- సమాధానం: 4
61. కింది వాటిలో విష్ణుకుండినుల కాలం నాటి నాణేలు దొరికిన ప్రాంతం ఏది?
1) కీసరగుట్ట
2) నార్కట్పల్లి
3) మౌలాలి
4) ఏలేశ్వరం
- View Answer
- సమాధానం: 1
62. విష్ణుకుండినులు తెలంగాణ ప్రాంతంలో రాజ్యానికి వచ్చిన కాలం?
1) క్రీ.శ. 4వ శతాబ్దం చివర
2) క్రీ.శ. 5వ శతాబ్దం చివర
3) క్రీ.శ. 6వ శతాబ్దం
4) క్రీ.శ. 3వ శతాబ్దం
- View Answer
- సమాధానం: 1
63. విష్ణుకుండిన వంశ స్థాపకుడు ఎవరు?
1) గోవిందవర్మ
2) విక్రమేంద్రవర్మ
3) మహారాజేంద్రవర్మ
4) మాధవవర్మ
- View Answer
- సమాధానం: 3
64. విష్ణుకుండినుల తొలి రాజధాని వినుకొండ కాదని చరిత్రకారులు తేల్చారు. అయితే వారి తొలి రాజధాని ఏది?
1) భువనగిరి
2) ఇంద్రపాలనగరం
3) ఏలేశ్వరం
4) విజయపురి
- View Answer
- సమాధానం: 2
65. విష్ణుకుండినుల తొలి రాజుల్లో అగ్రగణ్యుడు ఎవరు?
1) మహారాజేంద్రవర్మ
2) మొదటి మాధవవర్మ
3) మొదటి గోవిందవర్మ
4) రెండో మాధవవర్మ
- View Answer
- సమాధానం: 3
66. మూలరాజు వంశస్థుడైన పృథ్వీమూలుడి కుమార్తె ‘మహాదేవి’ని ఎవరు వివాహం చేసుకున్నారు?
1) మహారాజేంద్రవర్మ
2) మొదటి మాధవవర్మ
3) రెండో మాధవవర్మ
4) మొదటి గోవిందవర్మ
- View Answer
- సమాధానం:4
67. ఇంద్రపాలనగర తామ్రశాసనంలో ‘మహాకవి’గా ఎవరిని పేర్కొన్నారు?
1) మాధవవర్మ
2) ఇంద్రభట్టారకవర్మ
3) విక్రమేంద్ర భట్టారకుడు
4) విక్రమేంద్రవర్మ
- View Answer
- సమాధానం: 4
68. ఈశాన్యవర్మ చేతిలో ఓడిపోయిన విష్ణుకుండిన రాజు?
1) విక్రమేంద్రభట్టారక
2) ఇంద్రభట్టారక వర్మ
3) మాధవవర్మ
4) విక్రమేంద్రవర్మ
- View Answer
- సమాధానం: 2
69. విష్ణుకుండినుల అనంతరం తెలంగాణ ప్రాంతం ఎవరి పాలనలోకి వెళ్లింది?
1) రాష్ట్రకూటులు
2) వేంగీ చాళుక్యులు
3) బాదామీ చాళుక్యులు
4) వేములవాడ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 3
70. తెలంగాణలో అతి ప్రాచీన శాసనం ఏ ప్రాంతంలో ఉందని చరిత్రకారుల అభిప్రాయం?
1) ఏలేశ్వరం
2) ఇంద్రపురి
3) రాయగిరి
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 1
-
71. తెలంగాణలో లభిస్తున్న తొలి సంస్కృత శాసనం ఏది?
1) చైతన్యపురి శాసనం
2) గోరంట్ల తామ్రశాసనం
3) ఏలేశ్వర శాసనం
4) ఇంద్రపాలనగర తామ్రశాసనం
- View Answer
- సమాధానం: 4
72. తెలంగాణలో లభిస్తున్న తొలి ప్రాకృత శాసనం ఏది?
1) గోరంట్ల తామ్రశాసనం
2) చైతన్యపురి శాసనం
3) ఇంద్రపాలనగర తామ్రశాసనం
4) ఏలేశ్వర శాసనం
- View Answer
- సమాధానం: 2
73. తెలంగాణలో గోవిందవర్మ వేయించిన తొలి సంస్కృత శాసన కాలం?
1) క్రీ.శ. 425
2) క్రీ.శ. 430
3) క్రీ.శ. 435
4) క్రీ.శ. 440
- View Answer
- సమాధానం: 3
74. తెలంగాణ ప్రాంతంలో వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం ఏది?
1) జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి
2) కవిజనాశ్రయం
3) ఉదయాదిత్యాలంకారం
4) గోకర్ణ ఛందస్సు
- View Answer
- సమాధానం: 1
75.‘జనాశ్రయ ఛందో విచ్ఛిత్తి’ రాసిందెవరు?
1) ఇంద్రభట్టారక వర్మ
2) మంచన భట్టారకుడు
3) గోవిందవర్మ
4) నాలుగో మాధవ వర్మ
- View Answer
- సమాధానం: 4
76. విష్ణుకుండినుల రాజ భాష ఏది?
1) సంస్కృతం
2) ప్రాకృతం
3) తెలుగు
4) పైశాచీ
- View Answer
- సమాధానం: 1
77. ‘విజయరాజ్య సంవత్సరంబుళ్’ అనే తెలుగు పదమున్న శాసనం ఏది?
1) గోరంట్ల తామ్రశాసనం
2) ఇంద్రపాలనగర తామ్రశాసనం
3) చిక్కుళ్ల శాసనం
4) చైతన్యపురి శాసనం
78. చిక్కుళ్ల శాసనాన్ని వేయించినవారు?
1) నాలుగో మాధవవర్మ
2) విక్రమేంద్ర భట్టారిక వర్మ
3) గోవిందవర్మ
4) రెండో మాధవవర్మ
- View Answer
- సమాధానం: 2
79. ఎవరి కాలం నుంచి శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తున్నాయి?
1) వాకాటకులు
2) రాష్ట్రకూటులు
3) విష్ణుకుండినులు
4) ఇక్ష్వాకులు
- View Answer
- సమాధానం:3
80. ఏ రాజుల పాలనా కాలం నాటికి ‘సంస్కృతం’ పూర్తిగా రాజ భాష అయింది?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) వాకాటకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 4
-
81. ఇక్ష్వాకులు ఏ మతానికి చెందినవారు?
1) బౌద్ధం
2) శైవం
3) జైనం
4) వైదికం
- View Answer
- సమాధానం:2
-
82. ఇక్ష్వాకుల మిత్రులైన ‘అభీరులు’ ఏ మతాభిమానులు?
1) శైవం
2) బౌద్ధం
3) జైనం
4) వైష్ణవం
- View Answer
- సమాధానం: 4
-
83. బుద్ధుడుని దేవతామూర్తిగా కింది వాటిలో ఏ అవతారంగా కూడా కొలిచారు?
1) శివుడు
2) విష్ణుమూర్తి
3) బ్రహ్మ
4) శ్రీకృష్ణుడు
- View Answer
- సమాధానం:2
-
84. ఆంధ్రదేశంలో ‘హిందూ గుహాలయాలను’ మొదట నిర్మించినవారు ఎవరు?
1) విష్ణుకుండినులు
2) శాతవాహనులు
3) ఇక్ష్వాకులు
4) వాకాటకులు
- View Answer
- సమాధానం: 1
-
85. శాసనాల ఆధారంగా ఇక్ష్వాక రాజుల సంఖ్య?
1) 7
2) 4
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 2