ఇక్ష్వాకులు
1.పర్నికశ్రేణి అనే ప్రత్యేక వ్యాపారులు, తమలపాకుల వ్యాపారం గురించిన వివరాలు ఏ శాసనంలో ఉన్నాయి?
1) రెంటాల
2) దాచేపల్లి
3) విశపట్టి
4) ఉప్పుకొండూరు
- View Answer
- సమాధానం: 3
2. దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనం ఏది?
1) ఎలిసిరి శాసనం
2) గుమ్మడిదుర్రు శాసనం
3) కేశానపల్లి శాసనం
4) నాగార్జునకొండ శాసనం
- View Answer
- సమాధానం: 1
3. ‘శతసహస్రహలక దాన ప్రదాత’ అనే బిరుదున్న రాజెవరు?
1) వీరపురుషదత్తుడు
2) రుద్రపురుషదత్తుడు
3) ఏహుబల శాంతమూలుడు
4) శ్రీశాంతమూలుడు
- View Answer
- సమాధానం: 4
4. దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన తొలి రాజు (ఇక్ష్వాకులలో)?
1) శ్రీ శాంతామూలుడు
2) వీరపురుష దత్తుడు
3) ఏహబల శాంతామూలుడు
4) 2, 3
- View Answer
- సమాధానం: 3
5. వీరపురుషదత్తుడికి సంబంధించనిది ఏది?
1) ఇతడి పాలనా కాలం బౌద్ధులకు స్వర్ణయుగం
2) ఉజ్జయినీ మహాసేనులతో వివాహ సంబంధాలున్నాయి
3) నాగార్జునకొండలో పుష్పభద్ర, నవగ్రహ ఆలయాలు నిర్మించాడు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
6. ఇక్ష్వాకులకు సంబంధించని అంశం?
1) మాందాత శిల్పం - జగ్గయ్యపేట
2) మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయం
3) వైదికమతాన్ని అవలంబించారు
4) అమరావతిలో నందికేశ్వరాలయం నిర్మించారు
- View Answer
- సమాధానం: 4
7. ఇక్ష్వాకుల రాజధాని? (గ్రూప్-2, 2011)
1) శ్రీకాకుళం
2) విజయపురి
3) పితుండ
4) అమరావతి
- View Answer
- సమాధానం: 2
8. ఇక్ష్వాకులు స్వతస్సిద్ధంగా తెలుగువారేనని వాదించినవారు? (గ్రూప్-2, 2011)
1) కాల్డ్వెల్
2) వి.ఎ.స్మిత్
3) గోపాలాచారి
4) ఓల్టెన్బర్గ్
- View Answer
- సమాధానం: 1
9. హారితీ వీరి కులదేవత? (గ్రూప్-2, 2012)
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) చాళుక్యులు
4) కాకతీయులు
- View Answer
- సమాధానం: 2
10. నాగార్జున కొండలో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేసిన రాజవంశం?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) తూర్పు చాళుక్యులు
4) పల్లవులు
- View Answer
- సమాధానం: 2
11. ఇక్ష్వాకుల కాలం నాటి అంశాల్లో అవాస్తవమైంది?
1) వీరు శిల్పకళకు లేత ఆకుపచ్చ రాయిని ఉపయోగించారు.
2) సమాజంలో భూస్వామ్య విధానం, దేవదాసి పద్ధతిని ప్రవేశపెట్టారు.
3) మతంలో ‘వీరకల్’ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
4) వీరికాలం బౌద్ధమతానికి స్వర్ణయుగం
- View Answer
- సమాధానం: 2
12. ఇక్ష్వాకుల కాలంలో నివసించిన బౌద్ధమత ఆచార్యుడు ఎవరు?
1) భావ వివేకుడు
2) ఆర్యదేవుడు
3) కుమారులబట్టు
4) అసంగుడు
- View Answer
- సమాధానం: 1
13. బుద్ధుణ్ని కిరీటం లేని రాజుగా, దేవుడిగా చెక్కిన అద్భుత శిల్పం ఎక్కడుంది?
1) నాగార్జునకొండ
2) జగ్గయ్యపేట
3) ఏలేశ్వరం
4) ఫణిగిరి
- View Answer
- సమాధానం: 2
14. దక్షిణాపథ సామ్రాట్ బిరుదు ఎవరికి ఉంది?
1) ఏహబల శాంతమూలుడు
2) శ్రీ శాంతమూలుడు
3) వీరపురుషదత్తుడు
4) రుద్ర పురుషదత్తుడు
- View Answer
- సమాధానం: 2
15. తాము బుద్ధుడి వంశీయులమని, లుంబినీ ప్రాంతానికి చెందినవారమని ఇక్ష్వాకులు ఏ శాసనంలో పేర్కొన్నారు?
1) నాగార్జునకొండ
2) విశవట్టి శాసనం
3) ఉప్పుకొండూరు
4) అమరావతి
- View Answer
- సమాధానం: 1
16. ఒకరాజు శివలింగాన్ని తన కాలితో తోసినట్లు ఉన్న శిల్పం ఎక్కడ ఉంది?
1) అమరావతి
2) నాగార్జునకొండ
3) ఫణిగిరి
4) నేలకొండపల్లి
- View Answer
- సమాధానం: 2
17. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధస్థూపం ఎక్కడ ఉంది?
1) నేలకొండపల్లి (ఖమ్మం)
2) ఫణిగిరి (నల్గొండ)
3) ధూళికట్ట (కరీంనగర్)
4) ఏలేశ్వరం (నల్గొండ)
- View Answer
- సమాధానం: 1
18. ఇక్ష్వాకుల స్త్రీలు బౌద్ధమతానికి సేవశారు. ఉపాసిక బోధిశ్రీ ఏడు విహారాలను ఏ ప్రాంతంలో నిర్మించారు?
1) పుష్పగిరి
2) ఫణిగిరి
3) నేలకొండపల్లి
4) పాపిల
- View Answer
- సమాధానం: 4
19. దక్షిణ భారతదేశంలోని తొలి దేవాలయం?
1) హారితీ దేవాలయం
2) పుష్పభద్రస్వామి దేవాలయం
3) అష్టభుజస్వామి దేవాలయం
4) నవగ్రహ దేవాలయం
- View Answer
- సమాధానం: 3
20. ఆనందుడు ఒక గొప్ప?
1) తత్వవేత్త
2) సేనాని
3) సామంతరాజు
4) గొప్పకవి
- View Answer
- సమాధానం: 2