మాదిరి ప్రశ్నలు- 1
1. తెలంగాణలోని కొండలు - వాటి పేర్లకు సంబంధించి సరికాని జత ఏది?
1) కరీంనగర్ - రాఖీ గుట్టలు
2) వరంగల్ - కందికల్ గుట్టలు
3) నిజామాబాద్ - రాచకొండ గుట్టలు
4) రంగారెడ్డి - అనంతగిరి కొండలు
- View Answer
- సమాధానం: 3
2. ఏ రాష్ర్టం తెలంగాణలోని ఎక్కువ జిల్లాలతో సరిహద్దులు కలిగి ఉంది?
1) ఛత్తీస్‌గఢ్
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంతో తెలంగాణలోని ఏ జిల్లా సరిహద్దును కలిగి లేదు?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
4. తెలంగాణ రాష్ట్రానికి వాయవ్యంలో సరిహద్దుగా ఉన్న రాష్ర్టం ఏది?
1) ఒడిశా
2) కర్ణాటక
3) ఛత్తీస్‌గఢ్
4) మహారాష్ర్ట
- View Answer
- సమాధానం: 4
5. ప్రత్యేకంగా.. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షకాలంలో అధిక వర్షపాతం సంభవించడానికి కారణమేంటి?
1) అరేబియా సముద్రంలో సంభవించే అల్పపీడనం
2) పసిఫిక్ మహాసముద్రంపై నుంచి గంగా మైదానానికి వీచే అల్పపీడనం
3) హిందూ మహాసముద్రంపై వీచే గాలులు
4) బంగాళాఖాతంపై నుంచి గంగా మైదానానికి పయనించే అల్పపీడనాలు
- View Answer
- సమాధానం: 4
6. తెలంగాణలో ‘లక్ష్మీదేవ్పల్లి కొండ’ ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్
2) మెదక్
3) ఆదిలాబాద్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 2
7. హరిద్రా, గోదావరి, మంజీరా నదులు ఏ ప్రాంతంలో ‘త్రివేణి సంగమం’గా ఏర్పడతాయి?
1) కాళేశ్వరం
2) ధర్మపురి
3) కందకుర్తి
4) భద్రాచలం
- View Answer
- సమాధానం: 3
8. కింది వాటిలో ఆదిలాబాద్ జిల్లాలో లేని జలపాతం ఏది?
1) పొచ్చెర జలపాతం
2) మల్లెల తీర్థం
3) గుండాయి జలపాతం
4) గాయత్రి జలపాతం
- View Answer
- సమాధానం: 2
9. కింది వాటిలో ఏ జిల్లాలో మూసీ నది ప్రవహించదు?
1) నల్లగొండ
2) హైదరాబాద్
3) రంగారెడ్డి
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 4
10. నదులు - వాటి జన్మస్థానాలకు సంబంధించి సరికాని జత ఏది?
1) కడెం - బోతాయి గ్రామం
2) వార్ధా - సాత్పూర పర్వతాల్లో ఉన్న ముల్తాయ్ సమీపంలో
3) మూసీ - షాబాద్ గుట్టలు
4) మంజీరా - బాలఘాట్ కొండలు
- View Answer
- సమాధానం: 3
11. ‘సకలవాణి’, ‘ఆలేరు’, ‘ఈసా’లు ఏ నదికి చెందిన ఉపనదులు?
1) పాలేరు
2) భీమా
3) మున్నేరు
4) మూసీ
- View Answer
- సమాధానం: 4
12. నదులు - అవి కలిసే ప్రదేశాలకు సంబంధించి సరికాని జత ఏది?
1) ప్రాణహిత - కాళేశ్వరం (గోదావరి)
2) మూసీ - వాడపల్లి (కృష్ణా)
3) కృష్ణా - దివిసీమ (బంగాళాఖాతం)
4) మంజీరా - కందకుర్తి (గోదావరి)
- View Answer
- సమాధానం: 3
13.ఏ మృత్తికలు ‘జలదాన శక్తి’ని అధికంగా కలిగి ఉంటాయి?
1) ఒండ్రు మృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు
3) జేగురు మృత్తికలు
4) ఎర్ర మృత్తికలు
- View Answer
- సమాధానం: 2
14.మన రాష్ర్టంలో ఒండ్రు నేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
1) 48%
2) 25%
3) 20%
4) 7%
- View Answer
- సమాధానం: 3
15. తెలంగాణలో అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా ఏది?
1) కరీంనగర్
2) ఖమ్మం
3) ఆదిలాబాద్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 4
16. తెలంగాణలోని వ్యవసాయ వాతావరణ మండలాలు - వాటి కేంద్రాలకు సంబంధించి సరికాని జత ఏది?
1) దక్షిణ తెలంగాణ మండలం - పాలెం
2) మధ్య తెలంగాణ మండలం - వరంగల్
3) ఉత్తర తెలంగాణ మండలం - నిర్మల్
4) అధిక ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతాల మండలం - చింతపల్లి
- View Answer
- సమాధానం: 3
17.‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’గా ఏ జిల్లాను పిలుస్తారు?
1) నిజామాబాద్
2) వరంగల్
3) ఖమ్మం
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 4
18. కింది వాటిలో కాకతీయుల కాలానికి చెందని నీటి పారుదల సౌకర్యం ఏది?
1) పోచారం చెరువు
2) రామప్ప చెరువు
3) పాకాల చెరువు
4) లక్నవరం చెరువు
- View Answer
- సమాధానం: 1
19. తెలంగాణలో కాలువల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా?
1) వరంగల్
2) నల్లగొండ
3) కరీంనగర్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 2
20. కింది వాటిలో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ - 2 ద్వారా లబ్ధి పొందని జిల్లా ఏది?
1) ఖమ్మం
2) ఆదిలాబాద్
3) నల్లగొండ
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
21.కింది వాటిలో నదులు - వాటిపై నిర్మించిన ప్రాజెక్ట్‌లకు సంబంధించి సరికాని జత ఏది?
1) గోదావరి - నిజాంసాగర్ ప్రాజెక్ట్
2) తుంగభద్ర - రాజోలిబండ మళ్లింపు పథకం
3) మంజీరా - సింగూర్ ప్రాజెక్ట్
4) కృష్ణా - కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం
- View Answer
- సమాధానం: 1
22. ప్రాజెక్టులు - అవి ఉన్న జిల్లాలకు సంబంధించి సరికాని జత ఏది?
1) దేవాదుల ఎత్తిపోతల పథకం -వరంగల్
2) శ్రీరామ్‌సాగర్ - నిజామాబాద్
3) సింగూర్ ప్రాజెక్ట్ - మెదక్
4) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం - నల్లగొండ
- View Answer
- సమాధానం: 4
23.తెలంగాణలో బంగారు నిల్వలు ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉన్నాయి?
1) గోదావరి, ప్రాణహిత నదుల సంగమం
2) గోదావరి, మంజీరా నదుల సంగమం
3) గోదావరి, కిన్నెరసాని నదుల సంగమం
4) కృష్ణా, మూసీ నదుల సంగమం
- View Answer
- సమాధానం: 3
24. ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
1) పాల్వంచ
2) రామగుండం
3) మణుగూరు
4) కొత్తగూడెం
- View Answer
- సమాధానం: 4
25. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా గచ్చుకు ఉపయోగపడుతున్న తాండూర్ నీలి సున్నపురాయి బండలు ఏ జిల్లాలో లభిస్తున్నాయి?
1) మహబూబ్‌నగర్
2) రంగారెడ్డి
3) మెదక్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 2
26. మన రాష్ర్టంలో ‘ఫెల్డ్‌స్పార్’ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్
2) నల్లగొండ
3) రంగారెడ్డి
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
27. ఆసియాలో కెల్లా అతిపెద్ద చక్కెర కర్మాగారమైన ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీ’ ఎక్కడ ఉంది?
1) బాలానగర్
2) హుజూర్నగర్
3) శక్కర్‌నగర్
4) సదాశివ్పేట్
- View Answer
- సమాధానం: 3
28. స్పిన్నింగ్ మిల్లు - వాటి స్థాపిత ప్రదేశాలకు సంబంధించి సరికాని జత ఏది?
1) నటరాజ్ స్పిన్నింగ్ మిల్లు - నిర్మల్
2) తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు - బాలానగర్
3) సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్లు - భువనగిరి
4) ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్లు - కమలాపురం
- View Answer
- సమాధానం: 4
29.‘భద్రాచలం పేపర్ బోర్డ్ లిమిటెడ్’ను ఎక్కడ స్థాపించారు?
1) పటాన్చెరువు
2) కమలాపురం
3) సారపాక
4) మాతంగి
- View Answer
- సమాధానం: 3
30. తెలంగాణలోని సిమెంట్ పరిశ్రమలు - వాటి స్థాపిత ప్రదేశాలకు సంబంధించి సరికాని జత ఏది?
1) రాశీ సిమెంట్ కార్పొరేషన్ - వాడపల్లి (నల్లగొండ)
2) కేశోరాం సిమెంట్ - బసంత్‌నగర్ (కరీంనగర్)
3) దక్కన్ సిమెంట్ - సింహపురి (నల్లగొండ)
4) అసోసియేట్ సిమెంట్ కంపెనీ -మంచిర్యాల (ఆదిలాబాద్)
- View Answer
- సమాధానం: 3
31. మన రాష్ర్టంలో ‘భారజల కేంద్రం’ను ఎక్కడ స్థాపించారు?
1) పాల్వంచ
2) కొత్తగూడెం
3) రామగుండం
4) మణుగూరు
- View Answer
- సమాధానం: 4
32.‘సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ’గా ప్రసిద్ధి చెందింది?
1) సిరిసిల్ల
2) పోచంపల్లి
3) గద్వాల
4) మహదేవ్పూర్
- View Answer
- సమాధానం: 2
33. ఇత్తడి కళకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘పెంబర్తి’ ఏ జిల్లాలో ఉంది?
1) వరంగల్
2) కరీంనగర్
3) ఆదిలాబాద్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
34. ‘న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్’ ఏ ఖనిజాన్ని శుద్ధి చేస్తుంది?
1) టైటానియం
2) యురేనియం
3) థోరియం
4) ప్లుటోనియం
- View Answer
- సమాధానం: 2
35. ‘సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్’ ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) వరంగల్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
36. మన రాష్ర్టంలో మొట్టమొదటగా నిర్మించిన థర్మల్ పవర్ స్టేషన్ ఏది?
1) కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్
2) కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్
3) హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్
4) రామగుండం థర్మల్ పవర్ స్టేషన్
- View Answer
- సమాధానం: 3
37. ఏ అభయారణ్యం ద్వారా కడెం నది ప్రవహిస్తోంది?
1) శివ్వారం అభయారణ్యం
2) పోచారం అభయారణ్యం
3) పాకాల్ అభయారణ్యం
4) కవ్వాల్ అభయారణ్యం
- View Answer
- సమాధానం: 4
38. ‘నిర్మల్ కొయ్య బొమ్మల’ను ఏ కలపతో తయారు చేస్తారు?
1) ఇండియన్ రోజ్‌వుడ్
2) పుణికి
3) కాజురైనా
4) టేకు
- View Answer
- సమాధానం: 2
39. ‘పిల్లల మర్రి జింకల పార్క’ ఏ జిల్లాలో విస్తరించి ఉంది?
1) నల్లగొండ
2) ఖమ్మం
3) రంగారెడ్డి
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 4
40. ‘దక్షిణ మధ్య రైల్వే’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1956
2) 1966
3) 1976
4) 1986
- View Answer
- సమాధానం: 2
41. తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
1) 40
2) 42
3) 44
4) 163
- View Answer
- సమాధానం: 3
42. పర్యాటక ప్రాంతమైన ‘మల్లారం’ అటవీ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) ఖమ్మం
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 4
43. క్రీ.శ. 1591లో ‘ప్లేగు వ్యాధి’ నిర్మూలనకు గుర్తుగా మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన కట్టడం ఏది?
1) గోల్కొండ కోట
2) చార్మినార్
3) ఫలక్‌నుమా ప్యాలెస్
4) చౌమహళ్ల ప్యాలెస్
- View Answer
- సమాధానం: 2
44. ‘మూడు మీటర్ల ఎత్తు ఉన్న శివలింగం’కు ప్రసిద్ధి చెందిన ‘కూసుమంచి’ ఏ జిల్లాలో ఉంది?
1) ఖమ్మం
2) మహబూబ్‌నగర్
3) నల్లగొండ
4) కరీంనగర్
- View Answer
- సమాధానం: 1
45. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గ్రామీణ జనాభా వాటా ఎంత?
1) 29.87%
2) 61.33%
3) 71.33%
4) 73.11%
- View Answer
- సమాధానం: 2
46. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ర్టంలో స్త్రీ, పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా ఏది ?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) నిజామాబాద్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
47.2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ లో పురుషల అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా ఏది?
1) హైదరాబాద్
2) ఆదిలాబాద్
3) రంగారెడ్డి
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 1
48. ‘సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ’ అని పిలిచే ‘అంకాపూర్’ ఏ జిల్లాలో ఉంది?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) వరంగల్
4) నిజామాబాద్
- View Answer
- సమాధానం: 4
49. కింద పేర్కొన్న ప్రముఖుల్లో వరంగల్ జిల్లాకు చెందనివారు ఎవరు?
1) కాళోజీ నారాయణరావు
2) దాశరథి కృష్ణమాచార్యులు
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) చుక్కా రామయ్య
- View Answer
- సమాధానం: 3
50. తెలంగాణలోని ఏ జిల్లాను ‘ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్’గా పిలుస్తారు?
1) రంగారెడ్డి
2) మహబూబ్‌నగర్
3) మెదక్
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 2
51. ప్రసిద్ధి చెందిన ‘కొలనుపాక జైన దేవాలయం’ ఏ జిల్లాలో ఉంది?
1) కరీంనగర్
2) నల్లగొండ
3) వరంగల్
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 2
52. తెలంగాణలో విస్తీర్ణం దృష్ట్యా అతి పెద్ద రెండు జిల్లాలు వరసగా..?
1) ఆదిలాబాద్, కరీంనగర్
2) వరంగల్, ఆదిలాబాద్
3) మహబూబ్‌నగర్, ఆదిలాబాద్
4) రంగారెడ్డి, మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 3
53. మన రాష్ర్టంలో ‘మహబూబ్ ఘాట్’ శిఖరం ఏ కొండల్లో ఉంది?
1) నిర్మల్ గుట్టలు
2) రాచకొండ గుట్టలు
3) అనంతగిరి కొండలు
4) షాబాద్ గుట్టలు
- View Answer
- సమాధానం: 1