ఆధునిక భౌతికశాస్త్రం- 2
1. కింది వాటిలో దేని ద్వారా ఐసోటోపుల ఉనికిని తెలుసుకోవచ్చు?
1) గీగర్-ముల్లర్ కౌంటర్
2) క్లౌడ్ చాంబర్
3) సింటిలేషన్ కౌంటర్
4) బబుల్ చాంబర్
ఎ) 1 మాత్రమే
బి) 1, 3
సి) 1, 2, 3
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: డి
2. సహజ రేడియోధార్మికతకు ప్రమాణం?
ఎ) క్యూరీ
బి) బెకరల్
సి) రూథర్‌ఫర్డ్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. జతపరచండి.
గ్రూప్-ఎ గ్రూప్-బి
i. కాస్మిక్/ విశ్వ కిరణాలు 1) లిబ్బి
ii. సహజ రేడియోధార్మికత 2) రాంట్జన్
iii. X - కిరణాలు 3) హెన్రీ బెకరల్
iv. కార్బన్ డేటింగ్ 4) విక్టర్ హెజ్
i ii iii iv
ఎ) 4 3 2 1
బి) 1 2 3 4
సి) 2 1 4 3
డి) 3 4 1 2
- View Answer
- సమాధానం: ఎ
4. న్యూక్లియర్ రియాక్టర్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
1. సాధారణ ఉష్ణోగ్రత వద్ద భారజలం (D2O) లేదా నీటిని కూలెంట్‌గా వాడతారు.
2. అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవ సోడియంను కూలెంట్‌గా వాడతారు.
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 1 తప్పు, 2 సరైంది
సి) రెండూ సరైనవే
డి) రెండూ తప్పు
- View Answer
- సమాధానం: సి
5. కింది వాటిలో X - కిరణాలకు సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది?
ఎ)వీటి సహాయంతో స్మగ్లర్ల శరీరంలో ఉండే ఓపియం(మత్తు), ఆభరణాలు; పేలుడు పదార్థాలను గుర్తించవచ్చు
బి) విరిగిన ఎముకలు, మూత్రపిండాల్లో రాళ్లను గుర్తించడానికి; విమానాశ్రయాలు, దేశ సరిహద్దుల్లో లగేజ్ తనిఖీ చేయడానికి తోడ్పడతాయి
సి)శిలాజాల వయసు నిర్ధారించవచ్చు
డి) సి.టి. స్కానింగ్ ప్రక్రియలో వాడతారు
- View Answer
- సమాధానం: సి
6. ఐసోటోపులు, వాటి అనువర్తనాలను సరైన విధంగా జతపరచండి.
గ్రూప్-ఎ గ్రూప్-బి
i. అయోడిన్ (131I) 1. కార్బన్ డేటింగ్
ii. కార్బన్ (14C) 2. గాయిటర్ చికిత్స
iii. కోబాల్ట్ (60Co) 3. శరీరంలో రక్తసరఫరా లోపాలు
iv. సోడియం (23Na) 4. కేన్సర్ చికిత్స
i ii iii iv
ఎ) 4 3 2 1
బి) 1 2 3 4
సి) 2 1 4 3
డి) 3 4 1 2
- View Answer
- సమాధానం: సి
7. జీర్ణాశయాన్ని ఎక్స్‌రే తీయడానికి ముందు పేషెంట్‌కు ఇచ్చే రసాయన ద్రావణం ఏది?
ఎ) హైపో
బి) బేరియం మీల్
సి) క్విక్ సిల్వర్
డి) ఎల్లో కేక్
- View Answer
- సమాధానం: బి
8. జతపరచండి.
గ్రూప్-ఎ గ్రూప్-బి
i. కాంతి వేగం1. 3×108 m/sec
ii. అస్ట్రనామికల్ యూనిట్2. 1.459 ×1011m
iii. చంద్రశేఖర్ లిమిట్3. 2.8 × 1030 kg
iv. క్యూరీ 4. 3.7 × 1010 విఘటనాలు/సెకన్
i ii iii iv
ఎ) 4 3 2 1
బి) 1 2 3 4
సి) 2 1 4 3
డి) 3 4 1 2
- View Answer
- సమాధానం: బి
9. కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేసిన భారత శాస్త్రవేత్త?
ఎ) విక్రమ్ సారాభాయ్
బి) హోమీ జహంగీర్ బాబా
సి) సి.వి. రామన్
డి) పైన పేర్కొన్న వారందరూ
- View Answer
- సమాధానం: డి
10. కింది వాటిలో ఓటోహాన్, స్ట్రాస్‌మన్ కనుగొన్నది ఏది?
ఎ) అర్ధజీవిత కాలం
బి) కేంద్రక సంలీనం
సి) కేంద్రక విచ్ఛిత్తి
డి) కృత్రిమ రేడియోధార్మికత
- View Answer
- సమాధానం: సి
11. కింది వాటిలో అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు సంబంధించని ఆవిష్కరణ ఏది?
ఎ) క్వాంటం సిద్ధాంతం
బి) సాపేక్ష సిద్ధాంతం
సి) ద్రవ్యరాశి శక్తితుల్యతా నియమం
డి) కాంతి విద్యుత్ ఫలితం సమీకరణం
- View Answer
- సమాధానం: ఎ
12. కింది వాటిలో కృత్రిమ రేడియోధార్మిక మూలకం కానిది?
ఎ) ఫ్లూటోనియం
బి) ఫెర్మియం
సి) స్ట్రాన్షియం
డి) యురేనియం
- View Answer
- సమాధానం: డి
13. జతపరచండి.
గ్రూప్-ఎ గ్రూప్-బి
i. జె.జె. థామ్సన్ 1) న్యూట్రాన్
ii. రూథర్‌ఫర్డ్ 2) హైడ్రోజన్
iii. చాడ్విక్ 3) ఎలక్ట్రాన్
iv. హెన్రీ కావెండిష్ 4) ప్రోటాన్
i ii iii iv
ఎ) 4 3 2 1
బి) 1 2 3 4
సి) 2 1 4 3
డి) 3 4 1 2
- View Answer
- సమాధానం: డి
14. న్యూక్లియర్ రియాక్టర్‌లోని న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించి గొలుసు చర్యలను అదుపుచేయడానికి వాడే మితకారి కానిది?
1. భారజలం (డ్యుటీరియం ఆక్సైడ్)
2. గ్రాఫైట్
3. దృఢమైన ప్లాస్టిక్
4. పాదరసం
ఎ) 3 మాత్రమే
బి) 4 మాత్రమే
సి) 3, 4
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
15. అణు రియాక్టర్లలో శక్తి పరివర్తనం ఏ విధంగా ఉంటుంది?
ఎ) అణుశక్తి యాంత్రికశక్తిగా మారుతుంది
బి) అణుశక్తి ఉష్ణశక్తిగా మారుతుంది
సి) ఉష్ణశక్తి అణుశక్తిగా మారుతుంది
డి) యాంత్రికశక్తి అణుశక్తిగా మారుతుంది
- View Answer
- సమాధానం: బి
16. ‘బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ’ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) బెంగళూరు
బి) న్యూఢిల్లీ
సి) ముంబై
డి) కోల్‌కతా
- View Answer
- సమాధానం: సి
17. మానవుడు కనుగొన్న తొలి కణం ఏది?
ఎ) న్యూట్రాన్
బి) ఎలక్ట్రాన్
సి) ప్రోటాన్
డి) పాజిట్రాన్
- View Answer
- సమాధానం: బి
18. రాళ్లు లేదా శిలల వయసును నిర్ధారించడానికి రేడియో డేటింగ్లో ఉపయోగించే ఐసోటోప్ ఏది?
ఎ) U235
బి) P32
సి) C14
డి) Co60
- View Answer
- సమాధానం: ఎ
19. న్యూక్లియర్ రియాక్టర్‌లోని న్యూట్రాన్‌ను శోషించుకొని గొలుసుచర్యలను పూర్తిగా ఆపేయడానికి ఉపయోగించే నియంత్రకం?
ఎ) కాడ్మియం కడ్డీ
బి) బోరాన్ కడ్డీ
సి) స్టీల్ కడ్డీ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
20. మొదటిసారిగా అణు రియాక్టర్‌ను నిర్మించింది ఎవరు?
ఎ) ఫారెస్ట్
బి) ఫెర్మి
సి) ఫారడే
డి) అండర్సన్
- View Answer
- సమాధానం: బి
21. సబ్‌మెరైన్‌ను కనుగొన్నది ఎవరు?
ఎ) బుష్నెల్
బి) కాస్టన్
సి) గిల్లెట్
డి) గేటింగ్
- View Answer
- సమాధానం: ఎ
22. హైడ్రోజన్ బాంబు ఏ సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది?
ఎ) కేంద్రక సంలీనం
బి) కేంద్రక విచ్ఛిత్తి
సి) ఎ, బి
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
23. కోబాల్ట్-60లో విడుదలయ్యే ఏ వికిరణాన్ని రేడియోథెరపీలో ఉపయోగిస్తారు?
ఎ) ఆల్ఫా కిరణం
బి) బీటా కిరణం
సి) గామా కిరణం
డి) ఎక్స్ కిరణం
- View Answer
- సమాధానం: సి
24. ‘క్యూరీ’ దేనికి ప్రమాణం?
ఎ) రేడియోధార్మికత
బి) ఉష్ణోగ్రత
సి) ఉష్ణం
డి) శక్తి
- View Answer
- సమాధానం: ఎ
25. శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గుర్తించడానికి దోహదపడే రేడియోధార్మిక ఐసోటోపు ఏది?
ఎ) అయోడిన్-131
బి) సోడియం-23
సి) కోబాల్ట్-60
డి) యురేనియం-233
- View Answer
- సమాధానం: బి
26. తొలిసారిగా ప్రయోగించిన ఆటమ్ బాంబు పేరేమిటి?
ఎ) ఫ్యాట్ మ్యాన్
బి) లిటిల్ బాయ్
సి) ఫ్యాట్ బాయ్
డి) లిటిల్ బాంబ్
- View Answer
- సమాధానం: బి
27. ఆధునికశాస్త్ర (Modern Sciences) పితామహుడు ఎవరు?
ఎ) ఐన్‌స్టీన్
బి) గెలీలియో
సి) మాక్స్‌ప్లాంక్
డి) మాక్స్వెల్
- View Answer
- సమాధానం: బి
28.పరమాణు కేంద్రకంలో ఉండే ప్రాథమిక కణాలేవి?
ఎ) ఎలక్ట్రాన్లు
బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు
డి) బి, సి
- View Answer
- సమాధానం: డి
29. ఎలక్ట్రాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) జె.జె.థామ్సన్
బి) జి.పి.థామ్సన్
సి) హెన్రీ బెకరల్
డి) రూథర్‌ఫర్డ్
- View Answer
- సమాధానం: ఎ
30. కింది వాటిలో ఏ ప్రాథమిక కణాన్ని న్యూక్లియాన్ అని పిలవరు?
ఎ) ఎలక్ట్రాన్
బి) ప్రోటాన్
సి) న్యూట్రాన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
31. X - కిరణాల ఉత్పత్తిలో ఉపయోగించే ప్రాథమిక కణం ఏది?
ఎ) న్యూట్రాన్
బి) ప్రోటాన్
సి) ఎలక్ట్రాన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
32. అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్లు ఏ మార్గంలో ప్రయాణిస్తాయి?
ఎ) రుజు మార్గం
బి) వృత్తాకార మార్గం
సి) దీర్ఘవృత్తాకార మార్గం
డి) క్రమరహితంగా ప్రయాణిస్తాయి
- View Answer
- సమాధానం: బి
33. ఎలక్ట్రాన్ రుణావేశ విలువను ప్రయోగాత్మకంగా నిర్ధారించిన శాస్త్రవేత్త?
ఎ) జె.జె.థామ్సన్
బి) హిటార్ఫ్
సి) మిల్లికాన్
డి) రూథర్‌ఫర్డ్
- View Answer
- సమాధానం: సి
34. ప్రోటాన్‌ను ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
ఎ) గోల్డ్‌స్టీన్
బి) ఐన్‌స్టీన్
సి) రూథర్‌ఫర్డ్
డి) జి.పి.థామ్సన్
- View Answer
- సమాధానం: సి
35. ప్రోటాన్‌ను ఏ పరమాణు కేంద్రకంతో సూచిస్తారు?
ఎ) హైడ్రోజన్
బి) హీలియం
సి) నైట్రోజన్
డి) కార్బన్
- View Answer
- సమాధానం: ఎ
36. ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఆవేశాల నిష్పత్తి?
ఎ) 1 : 2
బి) 2 : 1
సి) 1 : 1
డి) 1 : 4
- View Answer
- సమాధానం: సి
37. ప్రోటాన్, ఆల్ఫా కణం విశిష్టావేశాల నిష్పత్తి?
ఎ) 2 : 1
బి) 1 : 2
సి) 1 : 1
డి) 1 : 3
- View Answer
- సమాధానం: ఎ
38. మూలకం పరమాణు సంఖ్య ఏ ప్రాథమిక కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది?
ఎ) న్యూట్రాన్లు
బి) ప్రోటాన్లు
సి) ఎలక్ట్రాన్లు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
39. న్యూట్రాన్‌ను ఎవరు కనుగొన్నారు?
ఎ) కూలుంబ్
బి) చాడ్విక్
సి) మిల్లికాన్
డి) మైఖేల్ ఫారడే
- View Answer
- సమాధానం: బి