Skip to main content

విద్యుత్- 3

  • విద్యుత్ కదిలే ప్రవాహం లాంటిదని పేర్కొని దానికి ‘హూమర్’ అనే పేరు పెట్టినవారు - విలియం బర్డ్స్ (ఇంగ్లండ్)
  • స్థిర విద్యుత్‌ను కనుగొన్న శాస్త్రవేత్త - థేల్స్ (గ్రీక్)
  • విద్యుత్‌కు ధన, రుణ ఆవేశాలుంటాయని తెలిపినవారు - బెంజిమన్ ఫ్రాంక్లిన్
  • విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నవారు - హాన్స్ అయిర్‌స్టడ్
  • విద్యుత్ మోటార్, విద్యుత్ జనరేటర్లను కనుగొన్న శాస్త్రవేత్త - మైకేల్ ఫారడే
  • పయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతం - గోడల్మింగ్ (ఇంగ్లండ్)
  • అమెరికాలో తొలి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించినవారు - థామస్ అల్వా ఎడిసన్
  • విద్యుత్ బల్బ్‌ను కనుగొన్న శాస్త్రవేత్త - థామస్ అల్వా ఎడిసన్
  • ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలలో వాడే ఫిలమెంట్‌ను తయారు చేయడానికి వాడే మిశ్రమ లోహం - నిక్రోమ్
  • CFL అంటే.. - Compact Flouroscent Lamp
  • వలయంలో ఫ్యూజ్‌కు బదులుగా వాడే పదార్థం - MCB (మీనియేచర్ సర్క్యూట్ బ్రేకర్)
  • విద్యుత్ డైనమో, ట్రాన్స్ ఫార్మర్లను కనుగొన్న శాస్త్రవేత్త - మైకేల్ ఫారడే (ఇంగ్లండ్)
  • LED అంటే.. - Light Emitting Diode
  • రాగి, జింక్ పలకలను సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉంచి సెల్‌ను తయారు చేసిన శాస్త్రవేత్త - ఓల్టా (ఇటలీ)
  • బ్యాటరీ సెల్‌పై ఉండే లోహం - జింక్
  • విద్యుత్ ఘటంలో ఏ శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది? - రసాయన శక్తి
  • మైలతుత్తంగా పిలిచే పదార్థం - కాపర్ సల్ఫేట్
  • ఒక లోహంపై మరో లోహాన్ని పూతపూయడాన్ని ఏమంటారు? - ఎలక్ట్రోప్లేటింగ్
  • యంత్ర భాగాలు తుప్పు పట్టకుండా ఉండటానికి, మెరవడానికి తరచుగా పూత పూసే పదార్థం - క్రోమియం
  • వంతెనల నిర్మాణంలో, వాహనాల పరికరాల తయారీలో వాడే ఇనుముపై పూత పూయడానికి ఉపయోగించేది - జింక్
  • తినుబండారాలను నిల్వ ఉంచే ఇనుప పాత్రలపై పూత పూయడానికి ఉపయోగించే మూలకం - టిన్ (తగరం)
  • గాజు కడ్డీని సిల్క్‌గుడ్డతో రుద్దినప్పుడు.. గాజుకడ్డీ - ధనావేశాన్ని, సిల్క్‌గుడ్డ - రుణావేశాన్ని పొందుతాయి.
  • వెంట్రుకలు దుస్తులను ఆకర్షించడం, ఆకాశంలో మెరుపులు మెరవడం.. రెండూ ఒకే దృగ్విషయాలని తెలిపినవారు - బెంజిమన్ ఫ్రాంక్లిన్ (అమెరికా)
  • ఉన్నిగుడ్డతో రుద్దిన రెండు బెలూన్ల మధ్య పనిచేసే బలాలు - వికర్షణ బలాలు
  • వస్తువు ఆవేశ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం - విద్యుద్దర్శిని
    గమనిక: గతంలో విద్యుద్దర్శినిలో అల్యూమినియం బదులుగా బంగారు రేకులను వినియోగించేవారు.
  • వస్తువుకు ఉన్న ఆవేశాలను భూమికి బదిలీ చేసే పద్ధతి - ఎర్త్ చేయడం
  • పిడుగులు, మెరుపుల నుంచి పెద్ద భవనాలు, కట్టడాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం - తటిద్వాహకం (Lightening Conductor)
  • ధనాత్మక అయాన్ల అమరికను ఏమంటారు? - లాటిస్
  • లోహాల లాంటి వాహకాల్లో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు, ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాల్లో ఉంటాయని ప్రతిపాదించినవారు - డ్రూడ్, లారెంజ్
  • పమాణ ధనావేశాన్ని కదిలించడానికి విద్యుత్ బలం చేసిన పని - పొటెన్షియల్ భేదం లేదా ఓల్టేజ్
  • పొటెన్షియల్ భేదానికి ప్రమాణం - ఓల్ట్ లేదా జౌల్/కూలుంబ్
  • దవాల్లో విద్యుత్ ప్రవాహం జరగడానికి కారణం - ధన, రుణ ఆవేశాల చలనం
  • ఘన పదార్థాల్లో విద్యుత్ ప్రవాహం జరగడానికి కారణం - ఎలక్ట్రాన్ల చలనం
  • అయాన్లపై విద్యుద్విశ్లేష్యం ప్రయోగించే బలం - రసాయన బలం
  • వాహకంలో విద్యుత్ క్షేత్ర దిశ - ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపు
  • పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం - ఓల్ట్ మీటర్
  • ఓమ్ నియమంలో స్థిరంగా ఉండే భౌతిక రాశి - ఉష్ణోగ్రత
  • నిరోధానికి SI ప్రమాణం - ఓమ్ (W) లేదా Volt/A
  • నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలు - ఉష్ణోగ్రత, పదార్థ స్వభావం, జ్యామితీయ కారకాలు
  • విశిష్ట నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలు - ఉష్ణోగ్రత, పదార్థ స్వభావం
  • పదార్థ విశిష్ట నిరోధం వాహకత్వాన్ని తెలుపుతుంది. విశిష్ట నిరోధం తక్కువగా ఉన్న లోహాలు మంచి వాహకాలుగా పనిచేస్తాయి. అందువల్ల విద్యుత్ తీగల తయారీకి రాగి లాంటి లోహాలను వాడతారు.
  • విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్‌ను తయారుచేయడానికి ఉపయోగించే లోహం - టంగ్‌స్టన్ (టంగ్‌స్టన్ విశిష్ట నిరోధం, ద్రవీభవన స్థాన విలువలు అధికం)
  • గమనిక: విద్యుత్ బంధకాల విశిష్ట నిరోధం విలువలు అత్యధికంగా 1014 నుంచి 1016 Wవరకు ఉంటాయి. నిక్రోమ్ (Ni, Cr, Fe) లాంటి మిశ్రమ లోహాల విశిష్ట నిరోధం విలువలు, లోహాల విశిష్ట నిరోధానికి 30 నుంచి 100 రెట్లు ఉంటాయి. అందువల్ల వీటిని ఇస్త్రీ పెట్టె లాంటి వాటిలో తాపన పరికరాలు (Heating elements)గా వినియోగిస్తారు.
  • డయోడ్, ట్రాన్సిస్టర్, ఇంటిగ్రేటెడ్ చిప్స్ (IC)ల తయారీలో వాడే పదార్థాలు - అర్ధ వాహకాలు
  • కిర్చాఫ్ మొదటి నియమం ‘ఆవేశ నిత్యత్వ నియమం’ను అనుసరిస్తుంది.
  • కిర్చాఫ్ రెండో నియమం ‘శక్తి నిత్యత్వ నియమం’ను అనుసరిస్తుంది.
  • సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ, విడివిడి నిరోధాల విలువ కంటే తక్కువగా ఉంటుంది.
  • శేణి సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ, విడివిడి నిరోధాల విలువ కంటే ఎక్కువగా ఉంటుంది.
  • ఇళ్లల్లో వాడే విద్యుత్‌ను యూనిట్లలో తెల్పుతారు.
    ఒక యూనిట్ = KWH
    1 KWH = 3.6 ×106 J = 3.6 MJ
  • ఇళ్లల్లో వాడే రెండు తీగల మధ్య పొటెన్షియల్ భేదం = 240 Volts
  • ఇళ్లల్లో వాడే తీగల ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం = 5A - 20A
    గమనిక: 20A కంటే ఎక్కువ విద్యుత్ ప్రవాహం జరిగితే వలయం వేడెక్కి మంటలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్నే ‘ఓవర్ లోడ్’ అంటారు. ఓవర్ లోడ్ విలువ ఇళ్లకు, పరిశ్రమలకు వేర్వేరుగా ఉంటుంది.
  • అయస్కాంత క్షేత్రానికి లంబంగా ప్రమాణ వైశాల్యం ద్వారా వెళ్లే బలరేఖల సంఖ్యను ‘అయస్కాంత అభివాహం’ అంటారు.
  • అయస్కాంత అభివాహానికి S.I. ప్రమాణం - వెబర్.
  • అయస్కాంత అభివాహ సాంద్రత (B)కు ప్రమాణం = Wb/m2 లేదా Tesla
  • సమసర్పిలంగా(హెలిక్స్) దగ్గరగా చుట్టిన పొడవైన తీగను ‘సాలినాయిడ్’ అంటారు.
  • q ఆవేశం v వేగంతో అయస్కాంత క్షేత్రం Bకు లంబంగా కదులుతుంటే ఆ ఆవేశంపై పనిచేసే బలం F = qvB
  • ఇండక్షన్ స్టవ్, టేప్‌రికార్డర్లు పనిచేసే సూత్రం - విద్యుదయస్కాంత ప్రేరణ
    గమనిక: టేప్‌రికార్డర్లలోని ప్లాస్టిక్ టేప్‌లపై ఐరన్ ఆక్సైడ్ పూత పూస్తారు.
  • ఆవేశానికి ప్రమాణం- కూలుంబ్
  • 1 కూలుంబ్ అవేశంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య = 6.25 × 1018
  • రెండు ఆవేశాల మధ్య ఉన్న బలాన్ని వివరించే నియమం - కూలుంబ్ నియమం
  • విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశం ప్రయాణించే మార్గాన్ని తెలిపేది - విద్యుత్ బలరేఖ
  • విద్యుత్ బలరేఖల దిశ - ధనావేశం నుంచి రుణావేశం వైపు
  • ఓల్టా ఘటం విద్యుచ్ఛాలక బలం = 1 ఓల్ట్
  • లెక్లాంచి ఘటం విద్యుచ్ఛాలక బలం = 1.46 Volts
  • టార్చిలైట్, రిమోట్లలో వాడే ఘటం లెక్లాంచి ఘటానికి రూపాంతరం.
  • సెల్‌ఫోన్లలో వాడే లిథియం అయాన్ (Li+) ఘటం విద్యుచ్ఛాలక బలం = 3.7 ఓల్ట్
  • అధిక ఓల్టేజీ అవసమైనప్పుడు బ్యాటరీలను ‘శ్రేణి’ సంధానంలో కలపాలి.
  • అధిక విద్యుత్ ప్రవాహం అవసరమైనప్పుడు బ్యాటరీలను ‘సమాంతర’ సంధానంలో కలపాలి.
  • విద్యుత్ అలంకరణకు ఉపయోగించే బల్బ్‌లను ‘శ్రేణి’ సంధానంలో కలుపుతారు.
  • ఇళ్లలో ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని వాడతారు. దీనికి 230-240 ఓల్ట్‌ల పొటెన్షియల్, 50 Hertz పౌనఃపున్యం ఉంటుంది.
  • ఏకాంతర ప్రవాహం ఓల్టేజీని పెంచడానికి లేదా తగ్గించడానికి వాడే పరికరం - ట్రాన్స్ ఫార్మర్ (పరివర్తకం)
  • ఓల్టేజీని తగ్గించడానికి వాడే పరివర్తకం - స్టెప్‌డౌన్ ట్రాన్స్ ఫార్మర్
  • ఓల్టేజీని పెంచడానికి వాడే పరివర్తకం - స్టెప్ అప్ ట్రాన్స్ ఫార్మర్
  • సాధారణంగా పవర్ జనరేటింగ్ స్టేషన్లలో వాడే ట్రాన్స్ ఫార్మర్‌లు - స్టెప్ అప్ ట్రాన్స్ ఫార్మర్‌లు
  • బెడ్‌ల్యాంప్‌లలో ఉపయోగించే ట్రాన్స్ ఫార్మర్ - స్టెప్‌డౌన్ ట్రాన్స్ ఫార్మర్
  • టాన్స్ ఫార్మర్ పనిచేసే సూత్రం - అన్యోన్య ప్రేరణ సూత్రం
  • విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం - ఆంపియర్ లేదా కూలుంబ్/సెకన్
  • అత్యుత్తమ విద్యుత్ వాహకం - వెండి
  • విద్యుత్ జనరేటర్ (డైనమో) పనిచేసే సూత్రం - ఫ్లెమింగ్ కుడిచేతి నిబంధన
  • విద్యుత్ మోటార్ పనిచేసే సూత్రం - ఫ్లెమింగ్ ఎడమచేతి నిబంధన
  • గాల్వానా మీటర్‌కు స్వల్ప నిరోధం (షంట్)ను సమాంతరంగా కలపడం వల్ల అది అమ్మీటర్‌లా పనిచేస్తుంది.
  • అమ్మీటర్‌ను విద్యుత్ ప్రవాహ విలువ కనుగొనేందుకు శ్రేణిలో కలుపుతారు. ఆదర్శ అమ్మీటర్ నిరోధం శూన్యం.
  • గాల్వానా మీటర్‌కు అధిక నిరోధాన్ని శ్రేణిలో కలపడం వల్ల అది ‘ఓల్ట్ మీటర్’లా పనిచేస్తుంది.
  • ఓల్ట్ మీటర్‌ను విద్యుత్ పొటెన్షియల్ భేదం కనుగొనడానికి సమాంతరంగా కలుపుతారు. ఆదర్శ ఓల్ట్ మీటర్ నిరోధం అనంతం.
Published date : 05 Jul 2016 11:26AM

Photo Stories