Skip to main content

స్టెతస్కోప్‌లో శబ్దం పెద్దగా వినపడటానికి కారణం?

ద్వని అభిలక్షణాలు:
ధ్వనికి ప్రధానంగా 3 రకాల అభిలక్షణాలు ఉంటాయి. అవి..
1. పిచ్‌ లేదా కీచుదనం
2.తీవ్రత
3. నాదగుణం లేదా నాణ్యత
1. పిచ్‌ లేదా కీచుదనం: కీచుస్వరం, బొంగురుస్వరాల మధ్య ఉండే లక్షణమే కీచుదనం.
ఇది పౌనపున్యంపై ఆధారపడి ఉంటుంది.
ఈ లక్షణాన్ని హెర్ట్జ్‌(Hz) ప్రమాణంతో
కొలుస్తారు.
ధ్వని కీచుదనం కొలవడానికి వాడే పరికరం టోనోమీటర్‌.

పిచ్‌ లేదా కీచుదనం ఉండే జీవులు:
1) దోమలు
2) చిన్నపిల్లలు
3) మహిళలు
4) తుమ్మెద
మహిళల స్వరానికి పురుషుల స్వరం కంటే ఎక్కువ కీచుదనం ఉంటుంది.
శృతిదండం పిచ్‌ దాని భుజాలపై ఆధారపడి ఉంటుంది.

2. తీవ్రత: ఇది కంపనపరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఈ లక్షణాన్ని dB(డెసిబెల్‌) ప్రమాణంతో కొలుస్తారు.
ధ్వని తీవ్రత కొలవడానికి వాడే పరికరం సౌండ్‌ మీటర్‌ లేదా నాయిస్‌ మీటర్‌.
తీవ్రత ఉండే జీవులు:
1) పురుషులు
2) సింహం
3) ఏనుగు
80dB కంటే ఎక్కువ తీవ్రత ఉండే ధ్వనుల వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
విమానాశ్రయాల సమీపంలో పని చేసే ప్రజలు ఇయర్‌ప్లగ్స్‌ను ఉపయోగించి తమ చెవులు కాపాడుకోవాలి.

3. నాదగుణం: ధ్వనుల్లో ఉండే వ్యత్యాసాన్ని గుర్తించే స్వభావాన్ని నాదగుణం అంటారు.
ఉదా: వాహనాన్ని చూడకుండా దాని నుంచి వచ్చే ధ్వని ఆధారంగా వాహనాన్ని గుర్తించవచ్చు.
ఇది వ్యక్తికి ఉండే శృతి గ్రాహ్యతపై ఆధారపడి ఉంటుంది.
ధ్వని ముద్రణ, పునరుత్పత్తి: పాల్సన్‌ మొదటిసారి స్టీల్‌ పలకలపై ధ్వనిని రికార్డ్‌ చేసి పునరుత్పాదన చేశారు. ఈ పద్ధతిలో ధ్వని తీవ్రత, స్పష్టత చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాచుర్యం పొందలేకపోయింది.
టేప్‌ రికార్డర్‌లో ఉండే ప్లాస్టిక్‌ టేప్‌పై ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ లేదా ఐరన్‌ ఆక్సైడ్‌తో పూతపూసి ధ్వనిశక్తిని అయస్కాంతశక్తి రూపంలో నిల్వ చేస్తారు.

టేప్‌రికార్డర్‌ ఆవిష్కర్త
: పాల్సన్‌.
థామస్‌ ఆల్వా ఎడిసన్‌ గ్రామ్‌ఫోన్‌ ప్లేట్లపై ధ్వనిని రికార్డ్‌ చేసి పునరుత్పత్తి చేశారు. ఈ పద్ధతిలో పునరుత్పత్తి చేసిన∙ధ్వని తీవ్రత, స్పష్టత అధికం.
ఆధునిక కాలంలో సి.డి., డి.వి.డి.లలో ధ్వని రికార్డ్‌ చేసి పునరుత్పత్తి చేసే ప్రక్రియలో లేజర్‌ కిరణాలను ఉపయోగిస్తారు.
సి.డి.ని ఆవిష్కరించింది: సోనీ, ఫిలిప్స్‌
సినిమా రీల్‌లో ధ్వనిని రికార్డ్‌ చేసి, పునరుత్పాదన చేసేందుకు ‘కాంతి విద్యుత్‌ ఫలితం’ ఉపయోగిస్తారు.
ధ్వని వెలువడే సందర్భం ధ్వని తీవ్రత (dB లలో)
కనురెప్పలు కదిలినప్పుడు 0
గుసగుసలాడినప్పుడు 15–20
గోడ గడియారంలో లోలకం కదిలినప్పుడు 30
సాధారణ సంభాషణ 50–60
టెలిఫోన్‌ రింగ్‌ 60
చెవికి ప్రమాదకరమైన ధ్వని 85
ట్రాఫిక్‌ నుంచి విడుదలయ్యే ధ్వని 80–90
చెవిపోటుకి కారణమయ్యే ధ్వని 120
ఉరుములు ఉరిమినప్పుడు 150
జీఎస్‌ఎల్‌వీ నుంచివిడుదలయ్యే ధ్వని 250

కాంతి విద్యుత్‌ ఫలితం :
కాంతి కిరణాలు క్షారలోహ పలకల ఉపరితలంపై పతనం చెందినప్పుడు అవి ఎలక్ట్రాన్లను ఉద్గారం చేయడం వల్ల వలయంలో విద్యుత్‌ ప్రసారం జరుగుతుంది. దీన్ని కాంతి విద్యుత్‌ ఫలితం అంటారు.
  • కాంతి విద్యుత్‌ ఫలితాన్ని హెన్రిచ్‌ రుడాల్ఫ్‌ హెర్ట్జ్‌ కనుగొన్నాడు. ఇతడు రేడియో, టెలిఫోన్, టీవీ, టెలిగ్రాఫ్‌ల అభివృద్ధికి పునాది వేశారు. ఇతడి సేవలకు గుర్తింపుగా పౌనపున్యానికి ప్రమాణం ‘హెర్ట్జ్‌’ అని నామకరణం చేశారు.
  • కాంతి విద్యుత్‌ ఫలితాన్ని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వివరించారు.
  • ఆడియోగ్రాఫ్‌: ధ్వనిని రికార్డింగ్‌ చేయడం.
  • వీడియోగ్రాఫ్‌: కాంతిని రికార్డింగ్‌ చేయడం.

పరికరం

కనుగొన్నవారు

ల్యాండ్‌లైన్‌ ఫోన్‌

అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌

మొబైల్‌ ఫోన్‌

మార్టిన్‌ కూపర్‌

హైడ్రోఫోన్‌

ఎర్నెస్ట్‌ రూథర్‌ఫర్డ్‌

క్యాలిక్యులేటర్‌

పాస్కల్‌

కంప్యూటర్‌

చార్లెస్‌ బబేజ్‌(కంప్యూటర్‌ పితామహుడు)

డైనమో

మైఖేల్‌ ఫారడే

ఎలక్ట్రిక్‌ బల్బ్‌

థామస్‌ ఆల్వా ఎడిసన్‌

ఆప్టికల్‌ ఫైబర్‌

నరేంద్రసింగ్‌ కపానీ

విమానం

రైట్‌ బ్రదర్స్‌

హెలికాప్టర్‌ న్యూక్లియర్‌

బ్రాకెట్‌

రియాక్టర్‌

ఫెర్మి

రేడియో

మార్కొని

టెలివిజన్‌

జె.ఎల్‌. బయర్డ్‌

లిఫ్ట్‌

ఓటీస్‌

టెలిస్కోప్‌

గెలీలియో

థర్మామీటర్‌

గెలీలియో

భారమితి

టారిసెల్లీ

లైటనింగ్‌ డిటెక్టర్‌

బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌

అణుబాంబు

ఓపెన్‌ హైమర్‌

హైడ్రోజన్‌ బాంబ్‌

ఎడ్వర్డ్‌ టెల్లర్‌

థర్మాస్‌ ప్లాస్క్‌

డివేర్‌

సైకిల్‌

మెక్‌మిలన్‌

బాల్‌ పెన్‌

జేజే బాండ్‌

ఫౌంటెన్‌ పెన్‌

వాటర్‌ మాన్‌

పెట్రోల్‌ కారు

కార్ల్‌ బెంజ్‌

రైల్‌ ఇంజన్‌

స్టీవెన్‌సన్‌

జలాంతర్గామి

బుష్‌నెల్‌

ఎయిర్‌ కండిషనర్‌

కారియర్‌

సేఫ్టీ రేజర్‌

జిల్లెట్‌

రాడార్‌

వాట్సన్‌


ముఖ్యమైన ప్రశ్నలు :
1. ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) తరంగదైర్ఘ్యం
బి) పౌనపున్యం
సి) డోలనపరిమితి
డి) అతిస్వరం
Published date : 04 Dec 2019 04:13PM

Photo Stories