భారతమాత చిత్రాన్ని చిత్రించిన వారు ఎవరు ?
1. ఆత్మశుద్ధి ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు?
1) 1930
2) 1931
3) 1933
4) 1934
- View Answer
- సమాధానం: 3
వివరణ: మహాత్మాగాంధీ ఆత్మశుద్ధి ఉద్యమాన్ని అస్పృశ్యత నివారణ కోసం 21 రోజులు నిరాహారదీక్ష చేయాలని నిశ్చయించారు. ఇది రాజకీయ చర్యకాకపోవడంతో ప్రభుత్వం వెంటనే ఆయనను విడుదల చేసింది. (గాంధీజీని అంతకు ముందే అరెస్ట్ చేశారు). ఆరు వారాలపాటు శాసనోల్లంఘనోద్యమాన్ని నిలుపుదల చేస్తున్నట్లుగా గాంధీజీ ప్రకటించాడు. రాజకీయ ఖైదీలు అందరినీ విడుదల చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు.
- సమాధానం: 3
2. హోంరూల్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1916 ఆగస్ట్ 15
2) 1916 సెప్టెంబర్ 15
3) 1916 అక్టోబర్ 16
4) 1916 నవంబర్ 16
- View Answer
- సమాధానం: 2
వివరణ: అనీబిసెంట్ ఐర్లాండ్ దేశస్థురాలు. ఈమె దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధురాలిగా భారత్ వచ్చి, క్రియాశీల రాజకీయాలలో పాల్గొని భారతీయులను చైతన్యపరిచింది. 1916 సెప్టెంబర్ 15న హోంరూల్ ఉద్యమాన్ని మద్రాస్‌లో ప్రారంభించి, దాని కోసం హోంరూల్ లీగ్‌ను ప్రారంభించింది. స్వయంపాలన లక్ష్యంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. జాతీయ కళాశాలలను ప్రారంభించి చైతన్యపరిచింది. కామన్వీల్, న్యూ ఇండియా వంటి పత్రికలను స్థాపించింది. అనీబిసెంట్‌ను ఊటీలో అరెస్ట్ చేసి, కోయంబత్తూర్‌లో జైలులో నిర్భంధించారు. 1917 ఐఎన్సీకి కలకత్తాలో అధ్యక్షత వహించారు. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ, విదేశీ మహిళ ఈమే.
- సమాధానం: 2
3. అఖిల భారత కార్మిక కాంగ్రెస్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1919
2) 1920
3) 1922
4) 1926
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎన్.ఎం. జోషి నేతృత్వంలో 1920, అక్టోబర్ 31న ‘అఖిలభారత కార్మిక కాంగ్రెస్’ను స్థాపించారు. దీనినే ఆంగ్లంలో ‘ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్’ అంటారు. సంక్షిప్తంగా ఏఐటీయూసీ అంటారు. దీని తొలి అధ్యక్షుడు లాలాలజపతిరాయ్. 1921లో వేల్స్ రాకుమారుడు భారత పర్యటనను ఈ కార్మిక సంస్థ బహిష్కరించింది. 1926లో బ్రిటిష్ ప్రభుత్వం కార్మిక సంఘాల చట్టాన్ని చేసింది.
- సమాధానం: 2
4. ఆజాద్ హింద్ ఫౌజ్ తరపున స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులను బ్రిటిష్‌వారు ఎక్కడ విచారించారు?
1) ఢిల్లీ (ఎర్రకోట)
2) మద్రాసు (సెయింట్ జార్జి కోట)
3) కలకత్తా (సెయింట్ విలియం కోట)
4) కడలూరు (సెయింట్ డేవిడ్ కోట)
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1945 నవంబర్ 5 నుంచి 11 తేదీ మధ్య బ్రిటిష్‌వారు ఢిల్లీలోని ఎర్రకోటలో విచారించారు. షానవాజ్‌ఖాన్, ప్రేమ్ సెహగల్, గురు భ„Š సింగ్ ధిల్లాన్‌లను విచారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ ప్రముఖుల తరపున తేజ్ బహదూర్ సప్రూ, జవహర్లాల్ నెహ్రూ, బూలాభాయ్ దేశాయ్, కైలాష్‌నాథ్ ఖట్జూ, అసఫ్ అలీ లాంటి న్యాయ నిపుణులు వాదించారు. ప్రజాగ్రహానికి లొంగిన ఆనాటి భారత సైన్యాధ్యక్షుడు అచిన్లేక్ వారి శిక్షలు రద్దు చేశారు.
- సమాధానం: 1
5. నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తొలి సంస్థానం?
1) హైదరాబాద్
2) బరోడా
3) జునాఘడ్
4) కాశ్మీర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: దేశంలో నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని కోరిన జాతీయ నాయకుడు గోపాలకృష్ణగోఖలే. బరోడా సంస్థానం మొదటిసారిగా నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. సయాజీరావ్ గైక్వాడ్, ప్రతాప్సింగ్రావ్ గైక్వాడ్ నిర్భంధ ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
- సమాధానం: 2
6. చౌరీచౌరా సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1922 జనవరి 22
2) 1922 జనవరి 26
3) 1922 ఫిబ్రవరి 5
4) 1922 ఫిబ్రవరి 27
- View Answer
- సమాధానం: 3
వివరణ: సహాయనిరాకరణోద్యమం జరుగుతున్న కాలంలో గాంధీజీ అహింసా సిద్ధాంతంతో జాతి యావత్తూ ముందుకుపోతుంటే ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ జిల్లాలోని చౌరీచౌరా అనే ప్రాంతంలో 1922 ఫిబ్రవరి 5న ప్రజలు ఊరేగింపు జరుపుతూ ఉండగా పోలీసులు ప్రజలను కవ్వించడంతో ప్రజలు ఆగ్రహానికి గురై పోలీస్‌స్టేషన్‌కు నిప్పంటించారు. 22 మంది పోలీసులు, ముగ్గురు సామాన్య ప్రజలు మరణించారు. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో గాంధీజీ 1922 ఫిబ్రవరి 22న ఉద్యమాన్ని నిలిపి వేశారు.
- సమాధానం: 3
7. ‘తాకట్టులో భారతదేశం’ గ్రంథకర్త?
1) తరిమెల నాగిరెడ్డి
2) చండ్ర రాజేశ్వరరావు
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) దేవులపల్లి రామానుజరావు
- View Answer
- సమాధానం:1
వివరణ: మార్క్సిస్ట్, లెనినిస్ట్ సిద్ధాంతాల విశ్లేషణ, భారతదేశ ఆర్థిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని తరిమెల నాగిరెడ్డి ఈ గ్రంథాన్ని రాశారు. ఈయనను టి.ఎన్. అని కూడా పిలుస్తారు. పుచ్చలపల్లి సుందరయ్య ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే గ్రంథాన్ని రాశారు. చండ్ర రాజేశ్వరరావును సి.ఆర్. అని ముద్దుగా పిలిచేవారు. దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సారస్వత పరిషత్‌లో కీలక పాత్ర పోషించారు. సారస్వత నవనీతం, వేగుచుక్కలు మొదలగు రచనలు చేశారు.
- సమాధానం:1
8. ‘ఇండియా ఇన్ ట్రాన్సిషన్’ గ్రంథకర్త ?
1) ఎస్.ఎ. డాంగే
2) సుభాష్ చంద్రబోస్
3) జయప్రకాశ్ నారాయణ్
4) ఎం.ఎన్. రాయ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: మానవేంద్రనాథ్ రాయ్ (ఎం.ఎన్. రాయ్) ‘ఇండియా ఇన్ ట్రాన్సిషన్’ గ్రంథాన్ని రాశారు. ఈయన అనేక ప్రయోజనాత్మక గ్రంథాలు రాశారు. ‘హోంరూల్స్ ఇండియా’, ‘ది ఫ్యూచర్ ఇండియన్ పాలిటిక్స్’ లాంటి గ్రంథాలు రాశారు. ఎస్.ఎ. డాంగే ‘సోషలిస్ట్’ అనే తొలి కమ్యూనిస్ట్ పత్రికను స్థాపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ‘స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం’, యాన్ ఇండియన్ పిలిగ్రిమ్’ అనే గ్రంథాలు రాశారు. ‘సర్వోదయ’ ఉద్యమకర్త జయప్రకాశ్ నారాయణ్.
- సమాధానం: 4
9. భారతదేశ స్వాతంత్య్ర చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది?
1) 1946 సెప్టెంబర్ 2
2) 1946 ఆగస్ట్ 16
3) 1947 ఆగస్ట్ 15
4) 1947 జూలై 18
- View Answer
- సమాధానం: 4
వివరణ: రెండో ప్రపంచ యుద్ధానంతరం బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్లెమెంట్ అట్లీ ప్రధాని అయ్యాడు. భారతదేశ చివరి వైశ్రాయి అయిన లార్డ్ మౌంట్ బాటెన్ 1947 జూన్ 3న ఒక ప్రణాళికను రూపొందించాడు. దీనినే కొద్ది మార్పులతో బ్రిటన్ పార్లమెంట్ 1947 జూలై 18వ తేదీన ఆమోదించింది. 1947 ఆగస్ట్ 14న పాకిస్తాన్ అవతరించింది. 1947 ఆగస్ట్ 15న భారత్ స్వాతంత్య్రాన్ని పొందింది.
- సమాధానం: 4
10. వార్థా ఆశ్రమం ఏ నదీ తీరాన ఉంది?
1) సబర్మతి నది
2) తపతి నది
3) పౌనార్ నది
4) నర్మదా నది
- View Answer
- సమాధానం: 3
వివరణ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపాన ఉన్న పౌనార్ నది ఒడ్డున వార్థా ఆశ్రమాన్ని నిర్మించారు. జమన్‌లాల్ బజాజ్ అనే ప్రముఖ వ్యాపారి ధన సహాయంతో ఇది నిర్మితమైంది. 1937లో గాంధీజీ వార్థా ఆశ్రమం నుంచే ‘బేసిక్ ఎడ్యుకేషన్’ను ప్రకటించాడు. జాతీయోద్యమంలో వార్థా ఆశ్రమం గణనీయమైన పాత్ర పోషించింది. ఉప్పు సత్యాగ్రహం అనంతరం గాంధీజీ తన కార్యక్రమాలకు వార్థా ఆశ్రమాన్ని కేంద్రంగా చేసుకున్నాడు.
- సమాధానం: 3
11. ‘శాసనోల్లంఘనోద్యమ రాణి’ అని ఎవరిని పిలిచారు?
1) అరుణా అసఫ్ అలీ
2) కాదింబినీ గంగూలీ
3) మాగంటి అన్నపూర్ణమ్మ
4) సరోజినీ నాయుడు
- View Answer
- సమాధానం: 4
వివరణ: దరశామ (దర్శన) ఉప్పుడిపోపై దాడిచేసి ఆంగ్లేయుల చట్టాలను ఉల్లంఘించింది సరోజినీ నాయుడు. ఈమెను ‘భారత కోకిల’ అని వ్యవహరిస్తారు. ఈమె జన్మదినాన్ని ‘జాతీయ మహిళా దినోత్సవం’గా ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్, ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ వనిత (1925–కాన్పూర్ ఐఎన్‌సీ) సరోజినీ నాయుడు.
- సమాధానం: 4
12. ‘ఫ్రీ ఇండియన్ సొసైటీ’ని స్థాపించింది ఎవరు?
1) సరోజినీ నాయుడు
2) అనీబిసెంట్
3) కాదింబినీ గంగూలీ
4) మేడం బికాజీకామా
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఫ్రీ ఇండియన్ సొసైటీని లండన్‌లో మేడం బికాజీకామా స్థాపించారు. వి.డి. సావర్కర్ లాంటి స్వాతంత్య్ర సమరయోధులు దీనిలో కీలక పాత్ర పోషించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడం. అనీబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని సాగించారు. ఐఎన్సీకి హాజరైన తొలి కలకత్తా విశ్వవిద్యాలయ విద్యావంతురాలు కాదింబినీ గంగూలీ, ప్రముఖ వక్త, కవయిత్రి; ‘భారత కోకిల’ సరోజినీ నాయుడు, ‘భారతదేశ విప్లవ భావానికి తల్లి’ మేడం బికాజీకామా.
- సమాధానం: 4
13. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణురాలైన తొలి మహిళా పట్టబద్దురాలు?
1) కార్నేలియా సోరాబ్జీ
2) భానూ జహంగీర్ కోయాజీ
3) కాదింబినీ గంగూలీ
4) ఆర్.ఎస్. సుబ్బులక్ష్మి
- View Answer
- సమాధానం: 1
వివరణ: కార్నేలియా సోరాబ్జీ బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి పట్టబద్దురాలైన తొలి మహిళ. ఈమె భారత్‌లో తొలి మహిళా న్యాయమూర్తి. ఈమె బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో చదివిన తొలి భారతీయ వనిత. భానూ జహంగీర్కోయాజీ జనాభా నియంత్రణ ఉద్యమకారిణి. కాదింబినీ గంగూలీ కలకత్తా విశ్వవిద్యాలయంలో పట్టా పొందిన తొలి మహిళ, ఐఎన్‌సీ సమావేశాలకు హాజరైన తొలి మహిళ. ఆర్.ఎస్. సుబ్బులక్ష్మి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తొలి మహిళ.
- సమాధానం: 1
14. కాకోరి కుట్రకేసు సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1925
2) 1919
3) 1915
4) 1908
- View Answer
- సమాధానం: 1
వివరణ: హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోషియేషన్ సంస్థకు చెందిన ప్రతినిధులు రాంప్రసాద్ బిస్మిల్, అష్పాకుల్లాఖాన్, చంద్రశేఖర్ ఆజాద్ మొదలగువారు లక్నో, కాకోరి మధ్య రైలును దోచుకున్నారు. భారతదేశపు పన్నుల డబ్బులు బ్రిటీష్ ఖజానాకు తరలిపోతోంది కాబట్టి దోచుకున్నామని చెప్తారు. కొంతమందికి ఈ కేసులో శిక్షలు పడ్డాయి.
- సమాధానం: 1
15. జలియన్ వాలాబాగ్ దురాగతానికి చింతిస్తూ ‘పాంచాల పరాభవం’ నాటకాన్ని రాసిందెవరు?
1) దామరాజు పుండరీకాక్షుడు
2) గరిమెళ్ల సత్యన్నారాయణ
3) సురవరం ప్రతాపరెడ్డి
4) దర్శి చెంచయ్య
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లో జలియన్ వాలాబాగ్‌లో అనేక మంది భారతీయులను కాల్చి చంపారు. ఈ సంఘటనకు చింతిస్తూ దామరాజు పుండరీకాక్షుడు ‘పంచాల పరాభవం’ అనే నాటకం రాశారు. పాంచాలం లేదా పాంచాల అంటే ‘పంజాబ్’. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ గేయకర్త గరిమెళ్ల సత్యన్నారాయణ. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను సురవరం ప్రతాపరెడ్డి రాశారు. ‘నేను–నా దేశం’ను దర్శి చెంచయ్య రాశారు.
- సమాధానం: 1
16. ఆలిండియా ఖిలాఫత్ కమిటీ అధ్యక్షుడు?
1) మహాత్మా గాంధీ
2) లాలాలజపతిరాయ్
3) షౌకత్ ఆలీ
4) హకీం అజ్మల్‌ఖాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్‌లోని ముస్లింలు ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా టర్కీ సుల్తాన్‌కు మద్దతుగా ఉద్యమాన్ని నడిపారు. అదే చరిత్రలో ఖిలాఫత్ ఉద్యమంగా ్రçపసిద్ధమైంది. 1919 అక్టోబర్ 17వ తేదీన ఉద్యమ దినోత్సవాన్ని నేటికీ స్మరించుకుంటారు. ఈ ఉద్యమ నిర్వాహకులు మహ్మదాలీ, షౌకత్ ఆలీ, హకీం అజ్మల్‌ఖాన్ మొదలగువారు. ఆల్ ఇండియా ఖిలాఫత్ అధ్యక్షుడు మహాత్మా గాంధీ.
- సమాధానం: 1
17. అఖిల భారత ముస్లింలీగ్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1904
2) 1905
3) 1906
4) 1908
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1906లో ఢాకాలో ఆగాఖాన్, సలీం ఉల్లాఖాన్ మొదలగువారు అఖిల భారత ముస్లిం లీగ్‌ను స్థాపించారు. వారు బెంగాల్ విభజనను సమర్థించారు. ప్రభుత్వ రంగంలో మహ్మదీయులకు ప్రత్యేక సౌకర్యాలు కోరారు. వీరికి లార్డ్ మింటో మద్దతు ఇచ్చారు. 1909లో మింటో–మార్లే సంస్కరణల ఫలితంగా ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు మత ప్రాతిపదికపై కేటాయించారు. ఆల్ ఇండియా ముస్లీంలీగ్ ప్రధాన కేంద్రం లక్నోలో ఏర్పరిచారు.
- సమాధానం: 3
18. భారతమాత చిత్రాన్ని చిత్రించినవారు?
1) గగనేంద్రనాథ్ ఠాగూర్
2) ప్రతిమాదేవి
3) అభనీంద్రనాథ్ ఠాగూర్
4) రాజా రవివర్మ
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1905లో స్వదేశీ ఉద్యమం (వందేమాతర ఉద్యమం) జరుగుతున్న కాలంలో అభనీంద్రనాథ్ ఠాగూర్ భారతమాత చిత్రాన్ని చిత్రించాడు. ఈయన ‘బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్’కు చెందినవారు. ఈయన సాహిత్యకారుడు, అనేక బెంగాలీ గ్రంథాలు రచించారు.
- సమాధానం: 3
19. ‘సింథసిస్ ఆఫ్ యోగా’ గ్రంథకర్త ఎవరు?
1) సచిన్ సన్యాల్
2) అరవిందఘోష్
3) భగత్‌సింగ్
4) రాంప్రసాద్ బిస్మిల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: అరవింద్‌ఘోష్ పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించుకొని ఆధ్యాత్మిక జీవనాన్ని సాగించాడు. ‘సింథసిస్ ఆఫ్ యోగా’, డివైన్ౖలైఫ్, సావిత్రి, భవానీ మందిర్ లాంటి రచనలు, ‘న్యూలాంఫ్స్ ఫర్ ఓల్డ్’ లాంటి వ్యాసం రాశాడు. సచిన్ సన్యాల్ ‘బందీ జీవన్’ గ్రంథాన్ని రాశాడు. భగత్‌సింగ్ ‘వై అయాం యాన్ ఎథిస్ట్’ అనే గ్రంథాన్ని రాశాడు. ‘బోల్షి వికోంకి కర్తూత్’ను రాంప్రసాద్ బిస్మిల్ రాశాడు.
- సమాధానం: 2