రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది?
1. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది?
1) భీష్మ ప్రతిజ్ఞ
2) భక్త ప్రహ్లాద
3) మాలపిల్ల
4) రైతుబిడ్డ
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్రీ.శ. 1931లో హెచ్.ఎం.రెడ్డిగారు తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రథమంగా భక్తప్రహ్లాద అనే తొలి తెలుగు టాకీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హిరణ్యకశిపునిగా మునిపల్లె సుబ్బయ్య, హిరణ్యకశిపుని అర్థాంగి లీలావతిగా సురభి కమలాభాయి మొదలగువారు నటించారు. భీష్మప్రతిజ్ఞ తెలుగు నేలలో తొలి మూకీ చిత్రం. మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాలు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించిన చిత్రాలు.
- సమాధానం: 2
2. తంజావూరు నాయక రాజ్యస్థాపకుడెవరు?
1) చెవ్వప్ప
2) అచ్యుతప్ప
3) రఘునాథ నాయకుడు
4) విశ్వనాథ నాయకుడు
- View Answer
- సమాధానం: 1
వివరణ: క్రీ.శ. 1535లో తంజావూరు నాయక రాజ్యం ఏర్పడింది. ఈ రాజ్య స్థాపకుడు చెవ్వప్ప. ఈయన విజయనగర సామ్రాజ్య పాలకుడు అచ్యుత దేవరాయలు తోడల్లుడు. పోర్చుగీస్ వారికి మత విస్తరణలో భాగంగా చర్చి నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. చెవ్వప్ప కుమారుడు అచ్యుతప్ప. తంజావూరు నాయక రాజులలో గొప్పవాడు రఘునాథ నాయకుడు. మధుర నాయక రాజ్య స్థాపకుడు విశ్వనాథ నాయకుడు.
- సమాధానం: 1
3. ‘ఆంధ్రకవితా పితామహుడు’ అల్లసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం?
1) రెంటచింతల
2) పెంచికలదిన్నె
3) కోకట
4) నవఖండవాడ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ‘మనుచరిత్ర’ (స్వారోచిషమనుసంభవం)ను అల్లసాని పెద్దన రచించారు. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి, అష్టదిగ్గజాలలో ప్రముఖుడు. ఈయనకు కోకట, మొదలగు గ్రామాలను అగ్రహారంగా ఇచ్చి సత్కరించి, గండ పెండేరం తొడిగాడు. అల్లసాని వారి అల్లిక జిగిబిగి. ఈయన పేరుతో పెద్దనపాడు ఉంది. ‘మనుచరిత్ర’ శ్రీకృష్ణదేవరాయలుకు పెద్దన అంకితమిచ్చాడు.
- సమాధానం: 3
4. తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది?
1) 1853
2) 1862
3) 1869
4) 1872
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్రీ.శ. 1853లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ డల్హౌసీ తొలి రైలును ప్రవేశపెట్టాడు. ఇది ముంబాయి నుంచి థానే ప్రాంతాల మధ్య నడిచింది. 1856లో దక్షిణ భారతదేశంలో తొలి రైలు మద్రాస్ నుంచి అరక్కోణం మధ్య నడిచింది. 1862లో తొలి రైలు పుత్తూరు నుంచి రేణిగుంట ప్రాంతాల మధ్య నడిచింది. బ్రిటీష్ వారి రవాణా కోసం ఆ మార్గాలను ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా కలప, ఇనుములాంటి ఖనిజాలు, ఆయుధాలు, వస్తువులు రైళ్ళ ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తరలించేవారు.
- సమాధానం: 2
5. సాంఘిక శుద్ధి ఉద్యమం అంటే ఏమిటి?
1) ప్రతి గ్రామంలో వీధులను శుభ్రం చేయడం
2) ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం
3) ప్రతి గ్రామంలో వైద్యాలయాలు ఏర్పాటు చేయడం
4) మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం.
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆర్య సమాజం కార్యకలాపాలలో సాంఘిక శుద్ధి ఉద్యమం కీలకమైంది. అన్యమతాలవారు హిందువులను తమ మతంలోకి మార్చుచున్నారు. కాబట్టి తిరిగి వారిని స్వమతం అయిన హిందూ మతంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించిబడింది. దయానంద సరస్వతి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, తెలుగు నేలలో రఘుపతి వెంకటరత్నం నాయుడు నిర్వహించాడు.
- సమాధానం: 4
6. జతపరచండి.
జాబితా–1
1. అభినవ సోక్రటీస్
2. కలియుగార్జున
3. ఇండియన్ హెర్క్యూలస్
4. స్టార్ ఆఫ్ ఇండియా
జాబితా–2
ఎ. అఫ్జల్ ఉద్ధౌలా
బి. కోడి రామమూర్తి
సి. ఎ. రామమూర్తి
డి. రఘుపతి వెంకటరత్నం నాయుడు
1) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
2) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
- View Answer
- సమాధానం: 3
వివరణ: గ్రీక్ దేశ తత్వవేత్త సోక్రటీస్‌తో రఘుపతి వెంకటరత్నం నాయుడిని పోలుస్తారు. ధనుర్విద్యా ప్రవీణుడైన ఎ.రామమూర్తిని కలియుగార్జున అంటారు. సర్కస్ కంపెనీ స్థాపకుడైన కోడి రామమూర్తిని ‘కలియుగభీమ’, మల్ల మార్తాండ మొదలగు బిరుదులతో కీర్తిస్తారు. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయులకు సహకరించినందుకు అఫ్జల్ ఉద్ధౌలా అనే హైదరాబాద్ నిజాంకు ‘స్టార్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదు ఇచ్చారు ఆంగ్లేయులు.
- సమాధానం: 3
7. ‘ముసారం’ అని ఏ విదేశీయుడిని పిలిచేవారు?
1) రేమండ్
2) జార్జి రస్సెల్
3) విలియం పామర్
4) మెట్కాఫ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫ్రెంచ్ సేనాని అయిన రేమండ్ గతంలో కొంతకాలం టిప్పు సుల్తాన్ కొలువులోనూ, కొంతకాలం బుస్సీకి అంగరక్షకుడుగా ఉన్నాడు. నిజాం ఆలీఖాన్ ఆంగ్లేయులను కాదని ఫ్రెంచ్ సేనాని రేమాండ్ సహాయంతో తన సైన్యాన్ని పటిష్టపరచుకొన్నాడు. నేటి హైదరాబాద్‌లోని గన్ ఫౌండ్రీలో రేమండ్ నెలకొల్పిన తుపాకుల కర్మాగారం అవశేషాలు కన్పిస్తాయి. స్థానికులు ఈయనను ‘ముసారాం’ అనేవారు. మలక్‌పేటలో ఈయన సమాధి ఉంది.
- సమాధానం: 1
8. ‘తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్’ గ్రంథకర్త?
1) కాళోజి నారాయణరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) దాశరథి కృష్ణమాచార్యులు
4) పుచ్చలపల్లి సుందరయ్య
- View Answer
- సమాధానం: 4
వివరణ: ‘కమ్యూనిస్ట్ గాంధీ’ అని పిలువబడిన పుచ్చలపల్లి సుందరయ్య ‘తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్’ అనే గ్రంథాన్ని రాశారు. అందులో అప్పటి సమకాలీన పరిస్థితులు, పార్టీ విధానాలు, పోరాట క్రమాన్నీ విశదీకరించారు. ఈయనను ‘కామ్రేడ్ పి.ఎస్’ అని పిలిచేవారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ అనే గ్రంథాన్ని కూడా ఈయన రాశాడు.
- సమాధానం: 4
9. 1904లో ‘శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం’ ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) సూర్యాపేట
2) హన్మకొండ
3) హైదరాబాద్
4) జోగిపేట
- View Answer
- సమాధానం: 2
వివరణ: తెలుగు భాషాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి, గ్రంథ ప్రచురణలకు గ్రంథాలయోద్యమానికి కొంతమంది మేథావులు దోహదం చేశారు. 1904లో హన్మకొండలో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయాన్ని స్థాపించారు. 1901లో హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, 1905లో సికింద్రాబాద్‌లో ‘ఆంధ్ర సంవర్థనీ గ్రంథాలయం’ను నెలకొల్పారు. వార్షిక సమావేశాలు, సారస్వత సభలు ఆంధ్ర భాషా సంస్కృతుల పట్ల అభిమానం ఏర్పడేటట్లు ఈ సంస్థలు కృషి చేశాయి.
- సమాధానం: 2
10. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది?
1) కాకినాడ, విశాఖపట్నం
2) కృష్ణపట్నం, మచిలీపట్నం
3) హైదరాబాద్, సికింద్రాబాద్
4) కరీంనగర్, నిర్మల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అడాల్ఫ్ హెర్ హిట్లర్ నాయకత్వంలో జర్మనీ సేనలు విజృంభిస్తుండడంతో భీతిల్లిన బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో గందరగోళానికి గురైంది. 1942 మార్చి 29న సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్‌ను చర్చల కోసం భారత్ పంపింది. ఈ సమయంలోనే 1942 ఏప్రిల్ 6న జపాన్ విశాఖపట్నం, కాకినాడలపై బాంబులు వేసింది.
- సమాధానం: 1
11. కొండపల్లి దుర్గమును శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు ఆక్రమించాడు?
1) 1509
2) 1512
3) 1516
4) 1519
- View Answer
- సమాధానం: 3
వివరణ: విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు గజపతుల నుంచి క్రీ.శ. 1516లో కొండపల్లి దుర్గమును ఆక్రమించాడు. కొండపల్లి దుర్గము గిరి దుర్గమును (కొండపై నిర్మించింది). నేటికీ ఈ ప్రాంతం కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నాదెండ్ల తిమ్మరుసు నిర్మించిన బావి, శ్రీకృష్ణదేవరాయలు మరణ వివరణ ఉన్న శాసనము దర్శించదగిన ప్రాంతాలు.
- సమాధానం: 3
12. అర్జునుని తపస్సు శిల్పంను ఎక్కడ శిల్పీకరించారు?
1) మథురై
2) కాంచీపురం
3) శ్రావణ బెళగొళ
4) మహాబలిపురం
- View Answer
- సమాధానం: 4
వివరణ: దక్షిణ భారతదేశంలో గొప్పవారైన పల్లవుల పాలనా కాలంలో నిర్మించిన అనేక గుహాలయాలు, శిల్పాలు ప్రపంచ ఖ్యాతిని అర్జించాయి. అటువంటి వాటిలో మహాబలిపురంలోని అర్జునుని తపస్సు శిల్పం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ శిల్పాన్నే గంగావతరణ శిల్పం అని కూడా అంటారు.
- సమాధానం: 4
13. దక్షిణ భారతదేశంలో 1898లో ‘భారత సంఘసంస్కరణల సభ’ ఎక్కడ జరిగింది?
1) మచిలీపట్నం
2) హైదరాబాద్
3) మద్రాస్
4) కోయంబత్తూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: క్రీ.శ.1898లో మద్రాస్‌లో ‘భారత సంఘ సంస్కరణల’ సభ జరిగింది. ఈ సంస్థను 1870లో కేశవ్ చంద్రసేన్ స్థాపించారు. మహదేవ్గోవిందరనడే మద్రాస్ సభలో మాట్లాడుతూ ‘దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్’ అని కందుకూరి వీరేశలింగంను పొగిడారు. ఈ సభకు అధ్యక్షుడు కందుకూరి వీరేశలింగం. సమాజ ఉద్ధరణ ఈ సంస్థ లక్ష్యం.
- సమాధానం: 3
14. జస్టిస్ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి?
1) ఏనుగు
2) త్రాసు
3) నిచ్చెన
4) గాలిపటం
- View Answer
- సమాధానం: 2
వివరణ: దక్షిణ భారత ప్రజల అసోషియేçషన్‌గా ప్రారంభమై, బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ 1917లో జస్టిస్ పార్టీగా అవతరించింది. 1919 మాంటేగు–ఛేమ్స్‌ఫర్డ్ చట్టం ద్వారా 1920లో జరిగిన ఎన్నికల్లో 98 సీట్లకు గానూ 63 గెలిచింది జస్టిస్ పార్టీ. ఈ పార్టీ ఎన్నికల గుర్తు త్రాసు. తొలి ముఖ్యమంత్రి సుబ్బరాయలు రెడ్డియార్, చివరి జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రి కె.వి. రెడ్డి నాయుడు.
- సమాధానం: 2
15. ‘మధురై కొండ’ అనే బిరుదు ధరించినవారు?
1) రాజరాజు–1
2) విజయాలయుడు
3) మొదటి పరాంతకుడు
4) రాజేంద్ర చోళ–1
- View Answer
- సమాధానం: 3
వివరణ: చోళరాజు మొదటి పరాంతకుడు ‘మధురై’ ప్రాంతాన్ని ఆక్రమించి ‘మధురై కొండ’ అనే బిరుదు పొందాడు. విజయాలయుడు చోళ వంశ మూల పురుషుడు. రాజరాజు–1 బిరుదు ‘జయగొండ’, ‘చోళ మార్తాండ’. రాజేంద్ర చోళ–1 బిరుదు ‘కడారం కొండ’.
- సమాధానం: 3
16. జగన్ మిత్రమండలి స్థాపకుడెవరు?
1) ఉన్నవ లక్ష్మీనారాయణ
2) కుసుమ ధర్మన్న
3) మాదిరి భాగ్యరెడ్డివర్మ
4) బోయి జంగయ్య
- View Answer
- సమాధానం: 3
వివరణ: హైదరాబాద్ సంస్థానంలో సంఘసంస్కర్తగా కీర్తివహించిన మాదిరి భాగ్యరెడ్డివర్మ 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించారు. దీని ప్రధాన ఉద్దేశం అణగారిన వర్గాల వారికి విద్య నేర్పించుట. ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి అనే రచన చేశాడు. కుసుమధర్మన్న ‘మాకొద్దీ నల్లదొరతనం’ అనే నినాదం ఇచ్చాడు. బోయి జంగయ్య ‘జాతర’ అనే రచన చేశాడు. వీరందరూ సంఘసంస్కరణలకు కృషిచేశారు.
- సమాధానం: 3
17. శ్రీభాగ్ ఒప్పందం నాటి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
1) రాజారామరాయణింగార్
2) సుబ్బరాయలు రెడ్డియార్
3) సి. రాజగోపాలాచారి
4) కె.వి. రెడ్డి నాయుడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1937 నవంబర్ 16 మద్రాస్‌లోని కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం ‘శ్రీభాగ్’లో ఆంధ్ర–రాయలసీమ నాయకులు సమావేశం అయి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం జరిగిన వెంటనే మద్రాస్ శాసనసభలోని ఆంధ్ర నాయకులు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక తీర్మానం ప్రవేశపెట్టమని నాటి ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారిని కోరారు. కానీ ఆయన భారత ప్రభుత్వానికి నివేదిక పంపినా ఆమోదించలేదు.
- సమాధానం: 3
18. గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగువాడు?
1) గుంటూరు శేషేంద్రశర్మ
2) దర్శి చెంచయ్య
3) పి.ఆనందాచార్యులు
4) తల్లాప్రగడ సుబ్బారావు
- View Answer
- సమాధానం: 2
వివరణ: క్రీ.శ.1913లో గదర్ పార్టీ స్థాపించబడింది. ఇది ‘శాన్ఫ్రాన్సిస్కో’లో సోహన్ సింగ్ బక్నా, భాయ్ పరమానంద్, కర్తార్ సింగ్ శరభ, లాలా హరదయాళ్ ఆలోచనలతో ఉద్భవించింది. గదర్ అంటే అర్థం తిరుగుబాటు. దర్శి చెంచయ్య ఈ పార్టీలో పనిచేసిన ఏకైక తెలుగువాడు. సోహాన్ సింగ్ బక్నా ఈ పార్టీ స్థాపక అధ్యక్షుడు.
- సమాధానం: 2
19. హైదరాబాద్‌లో విడిది చేసిన తొలి భారతదేశ వైశ్రాయి?
1) లార్డ్ డఫ్రిన్
2) లార్డ్ మేయో
3) లార్డ్ రిప్పన్
4) లార్డ్ కర్జన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మీర్ మహబూబ్ అలీఖాన్ మేజర్ కావడంతో ఆనాటి భారతదేశ వైశ్రాయి లార్డ్ రిప్పన్ 1884 ఫిబ్రవరి 5వ తేదీన నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. ఈ సంప్రదాయంను అనుసరించి హైదరాబాద్‌కు వైశ్రాయి వచ్చి విడిది చేయుట ఒక ఆచారమైంది.
- సమాధానం: 3
20. కామ్రేడ్స్ అసోషియేషన్ను ఎవరు స్థాపించారు?
1) వట్టికోట అళ్వార్‌స్వామి
2) దొడ్డి కొమరయ్య
3) రావి నారాయణరెడ్డి
4) మక్థూం మెహినుద్దీన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: కామ్రేడ్స్ అసోషియేషన్ను హైదరాబాద్‌లో మక్థూం మొహినుద్దీన్ స్థాపించారు. సయ్యద్ ఇబ్రహీం, లింగారెడ్డి, బహదూర్ గౌడ్ లాంటి ప్రముఖులు ఇందులో కీలక సభ్యులు. ఆర్థిక, సాంఘిక, సమానత్వం సాధించుట ఈ సంస్థ లక్ష్యం.
- సమాధానం: 4