TSBIE: నిఘా నేత్రాల నడుమ ఈ పరీక్షలు.. నవీన్ మిత్తల్ సూచనలు ఇవే..
ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. మార్చి 13న మం త్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల ఏర్పాట్లపై నిర్వ హించిన వీడియో కాన్పరెన్స్ లో వారు వెల్లడిం చారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచి నీటి సౌకర్యం, మెడికల్ కిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్లను వెబ్ సైట్ www.tsbie.egg.gov.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు. కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వకుంటే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్ |
అర గంట ముందే చేరుకోండి..
పరీక్ష సమయం కంటే ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు అధికారులు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. చివరి నిమిషంలో టెన్షన్ పడకుం డా.. అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేసు కునేలా ఏర్పాట్లు చేసుకోవాలని.. దీనివల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. ఆయా పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్
పరీక్షల నేపథ్యంలో రౌండ్ క్లాక్ పని చేసే విధం గా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040- 24801010 లేదా 040- 24655027 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. జిల్లాల వారీగా మినీ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టెలీ మానస హెల్ప్ లైన్ నం బర్ 14416ను ఏర్పాటు చేశారు.
తక్షణమే స్పందిస్తాం: నవీన్ మిత్తల్
మార్చి 14న ఇంటర్ పరీక్షల నిర్వహణపై నవీన్ మిత్తల్ మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
''ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటాం. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోంది. ఎలాంటి మానసిక ఒత్తిడి అన్పించినా విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకోవాలి.. మనోధైర్యం ప్రతీ విద్యార్థికి అవసరం''అని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అన్నారు.
మొత్తం పరీక్షా కేంద్రాలు |
1,473 |
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు |
614 |
ప్రైవేటు కాలేజీలు |
859 |
పరీక్షలు సిబ్బంది... |
|
చీఫ్ సూపరింటెండెంట్లు |
1,473 |
డిపార్ట్మెంట్ల అధికారులు |
1,473 |
ఇన్విజిలేటర్లు |
26,333 |
ప్లైయింగ్ స్క్వాడ్స్ |
75 |
సిట్టింగ్ స్క్వాడ్స్ |
200 |
హాజరయ్యే విద్యార్థులు మొత్తం |
9,47,699 |
మొదటి సంవత్సరం |
4,82,677 |
ద్వితీయ సంవత్సరం |
4,65,022 |
గ్రూప్ |
ఫస్టియర్ |
సెకండియర్ |
మొత్తం |
ఎంపీసీ |
2,07,756 |
1,65,634 |
3,73,390 |
ఎంఈసీ |
14,675 |
19,559 |
34,234 |
బైపీసీ |
1,00,332 |
1,11,128 |
2,11,460 |
సీఈసీ |
98,598 |
1,11,760 |
2,10,358 |
హెచ్ఐసీ |
11,295 |
10,263 |
21,558 |