TS Inter Supply Results 2023: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల తేదీ ఇదే..
మూల్యాంకన ప్రక్రియ పూర్తయిందని, రెండురోజుల్లో క్రాస్‌చెక్ అయిపోతుందని, ఆ తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి అప్‌లోడ్ చేస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2023 మే నెలలో వెల్లడించిన ఇంటర్ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో 1.50 లక్షల మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వీళ్లంతా ఫెయిలైన సబ్జె క్టుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. ఫెయిలైన వారితోపాటు మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ రాసిన వాళ్లు మొత్తం 4.50 లక్షల మంది ఉన్నారు. రెండేళ్లకు కలిపి 10 లక్షల పేపర్లకు మూల్యాంకనం నిర్వహించారు.
చదవండి: IGNOU Admissions: ఇగ్నో ప్రవేశాల గడువు పొడిగింపు
ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వెల్లడయితే తప్ప, విద్యార్థులు డిగ్రీ సీట్లకు నిర్వహించే దోస్త్, ఇంజ నీరింగ్‌కు నిర్వహించే ఎంసెట్‌లో పాల్గొనే వీలుండదు. ఇప్పటికే దోస్త్ రెండు దశలు పూర్తయింది. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో త్వరగా ఫలితాలు వెల్లడించాలని సన్నాహాలు చేస్తున్నామని ఇంటర్ పరీక్షల విభాగం అధికారి జయప్రదాభాయ్ తెలిపారు. ఈ ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.
చదవండి: Degree: నైపుణ్యాలు పెంచేలా ఆనర్స్ డిగ్రీ.. ప్రవేశాల షెడ్యూల్ ఇలా..