ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదని, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
సర్కారీ కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలు: సబిత
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్కులను సాధించిన ప్రభుత్వ కాలేజీల విద్యార్థులను సెప్టెంబర్ 29న ఆమె హైదరాబాద్‌లో సన్మానించారు. ఈ సందర్బంగా సబిత మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ పాల్గొన్నారు.