గెస్ట్ లెక్చరర్లకు శుభవార్త
Sakshi Education
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో గతంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లనే తిరిగి కొనసాగించాలని ఇంటర్ విద్య అధికారులు నిర్ణయించారు.
ఈ మేరకు అక్టోబర్ 13న క్షేత్రస్థాయి అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలంగాణ ఇంటర్ బోర్డ్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 405 జూనియర్ కాలేజీల్లో 1654 మంది గెస్ట్ లెక్చరర్లు 2020 ఏప్రిల్ వరకూ పనిచేశారు. కోవిడ్ కారణంగా వారి సేవలు వినియోగించుకోవడం లేదు. కాలేజీల్లో అధ్యాపకుల కొరతను దృష్టిలో ఉంచుకుని గెస్ట్ లెక్చరర్స్ సేవలు వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఇంటర్ అధికారులతో ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ సమీక్ష జరిపారు. గతంలో పనిచేసిన వారినే తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు.
చదవండి:
EAMCET: ఎంత ర్యాంకొస్తే.. కంప్యూటర్స్ కోర్సుల్లో సీటు వస్తుంది: నిపుణులు
Good News: విద్యార్ధులకు నైపుణ్యాలను పెంపొందించేలా ఉచిత శిక్షణ
Published date : 14 Oct 2021 03:47PM