Intermediate Exams 2024: ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఉచిత ఆర్టీసీ బస్సులు
ఖమ్మం మామిళ్లగూడెం: ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 28నుండి జరగనుండగా, విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేగా ఆర్టీసీ బస్సులు నడిపించనున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సీహెచ్.వెంకన్న తెలిపారు. ఉదయం 8గంటలకల్లా విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేలా సర్వీసులు నడిపించాలని డీఎంలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఇంటర్ విద్యార్థులు బస్‌పాస్ రూట్‌తో సంబంధం లేకుండా హాల్‌టికెట్‌పై ఉన్న కేంద్రానికి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు.
Also Read : ఒత్తిడి తగ్గించేందుకు... పరీక్షల విధానంలో పలు మార్పులు!!
పాస్ కలిగిన విద్యార్థులు కాంబినేషన్ టికెట్ తీసుకుంటే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థినులకు బస్‌పాస్ లేకున్నా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. ఈమేరకు ఇబ్బందులు ఎదురైతే సంప్రదించాల్సిన నంబర్లను ఆర్‌ఎం విడుదల చేశారు. ఖమ్మం కొత్త బస్టాండ్ నంబర్ 99592 25979, పాత బస్టాండ్ 99592 25965, సత్తుపల్లి 99592 25990, మణుగూరు 89853 61796, కొత్తగూడెం 99592 25982, మధిర 73829 25289, భద్రాచలం 99592 25987, ఇల్లెందులో 99592 25984 నంబర్ల ద్వారా సంప్రదించాలని ఆర్‌ఎం సూచించారు.