TSBIE: ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును పెంచుతూ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీచేశారు.
జూలై 31తో అడ్మిషన్ల గడువు ముగిసింది. అయితే వర్షాలు, వరుస సెలవుల నేపథ్యంలో ఆగస్టు 5 వరకు అడ్మిషన్లకు అనుమతించారు. విద్యార్థులు రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 16లోగా కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చని ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ ఆదేశాన్ని పాటించాలని పేర్కొంది.
ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే విద్యార్థులను చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించింది. గుర్తింపు ఉన్న కాలేజీల జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు బోర్డు తెలిపింది.
చదవండి: 12,828 Government Jobs After 10th: జీడీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఎంపిక విధానం ఇలా..
Published date : 01 Aug 2023 11:43AM