Intermediate: ఇంటర్ ఫస్టియర్ మూల్యాంకనం, ఫలితాలు వివరాలు
Sakshi Education
ఇంటర్ మొదటి సంవత్సరం సమాధాన పత్రాల మూల్యాంకనం నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి.
వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఈ నెలాఖరులోగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మొదలయ్యాయి. నవంబర్ 1తో సాధారణ సబ్జెక్టుల పరీక్షలు ముగిశాయి. అధికారులు మూల్యాంకనం కోసం నవంబర్ 1న పలు ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 30 పేపర్ల వరకూ వాల్యూయేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ ప్రక్రియ ఉంటుందని, మూల్యాం కనం జరిగే కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.
చదవండి:
NEET Results: నీట్ ఫలితాలు, కటాఫ్ సమాచారం
AP EAPCET: ఇంజనీరింగ్, ఫార్మసీలో సీట్లు వివరాలు
Published date : 02 Nov 2021 05:28PM