TS Inter: మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిన ఇంటర్ విద్యార్థులు వీరే...
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలను ఇప్పటికే అధికారులు వెల్లడించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
అయితే 16వ తేదీ గురువారం ఇంటర్ సెకండియర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2(సెట్ బి) ముగిసింది. పరీక్షలో మాల్ ప్రాక్టీస్ చేస్తూ నలుగురు విద్యార్థులు దొరికిపోయారు. కరీంనగర్‌లో ముగ్గురు, వరంగల్‌లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్ చేసినట్లు ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు.
14 వేల మంది గైర్హాజరు
సెకండ్ ఇయర్ పేపర్‌కు మొత్తం 4,34,862 మంది హాజరుకావాల్సి ఉండగా 4,20,195 మంది పరీక్షకు హాజరయ్యారు. 14,667 మంది గైర్హాజరయ్యారు. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు పరీక్షల పరిశీలకులు వెళ్లారు. రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
చదవండి: తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం... పరీక్ష రాసేవారు ఎంతమందంటే
Published date : 16 Mar 2023 05:48PM