Skip to main content

English Practicals in Inter : ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కూడా ప్రాక్టికల్స్‌.. ఈ ఏడాది నుంచే.. ఎలా అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇక‌పై ఈ ఏడాది నుంచే ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ విధానం రానున్న‌ది.
Inter English Practicals

గ‌త ఏడాది ఇంట‌ర్‌ ఫస్టియర్‌లో ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ను విజయవంతంగా అమలుచేసిన విష‌యం తెల్సిందే. ఈ ఏడాది నుంచి సెకండియర్‌లో కూడా ఈ విధానంను తీసుకురానున్నారు.

ఈ త‌ర‌హాలోనే ప్రాక్టికల్స్‌..
ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం(ఐఈఎల్‌టీఎస్‌) ఎగ్జామ్‌ తరహాలో ప్రాక్టికల్స్‌ను నిర్వహించనున్నారు. ఈ విధానంతో ఆర్ట్స్‌, సైన్స్‌, ఒకేషనల్‌ కోర్సులన్న తేడా లేకుండా అందరికీ ప్రాక్టికల్స్‌ తప్పనిసరి అయ్యాయి. ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు 80 మార్కులు థియరీ, 20మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయిస్తారు. థియరీ ప్రశ్నపత్రాన్ని 80 మార్కులకు కుదించడంతో ప్రశ్నపత్రం స్వరూపం మారింది. మాదిరి ప్రశ్నపత్రాన్ని ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

Published date : 12 Aug 2024 06:01PM

Photo Stories