Telangana : ఇంటర్ పరీక్షలపై హైకోర్టు సంచలన తీర్పు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ పరీక్షలు ఆపలేమని హైకోర్టు అక్టోబర్ 22వ తేదీన తేల్చి చెప్పింది.
అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఇంటర్ బోర్డ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
Inter Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని..
Inter: హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి.. తప్పులుంటే సవరించుకోండి ఇలా...
Published date : 22 Oct 2021 05:18PM