Skip to main content

ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం (1900-1950 భాగం-1)

10th class study materialముఖ్యంశాలు:

  1. చరిత్ర కారుడైన ఎరిక్ హబ్స్‌బామ్ 20వ శతాబ్దాన్ని ‘‘తీవ్ర సంచలనాల యుగం’’గా పేర్కొన్నాడు.
  2. ఈ కాలంలో రెండు రకాల భావ జాలాలు అభివృద్ధి చెందాయు. ఒక వైపు ఫాసిజం, మరో వైపు ప్రజాస్వామ్యం.
  3. అందరికీ అక్షరాస్యతాస్థాయు, సగటు జీవిత కాలం అపారంగా పెరిగాయు.
  4. సినిమాల వంటి కొత్త కళలు ఆవిర్భవించాయు.
  5. విజ్ఞాన శాస్త్రం కొత్త శిఖరాలను అందుకుని పరమాణువు, జీవుల రహస్యాన్ని ఛేదించింది.
  6. పాశ్చాత్య దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లభించింది.
  7. 1929లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడింది.
  8. రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించి అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
  9. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా, ఆసియా, ఆఫ్రికాలకు చెందిన వలస రాజ్యాలుగా విడిపోయుంది.
  10. తిరిగి పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలు త్రైపాక్షిక కూటమి (జర్మనీ, ఆస్ట్రియా, హంగెరీ, ఇటలీ) కేంద్ర రాజ్యాలు, మిత్ర రాజ్యాల కూటమి (బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా)గా విడిపోయాయు.
  11. 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది.
  12. ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్యకు గురి కావడం మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం.
  13. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1919లో వర్సయుల్స్ ఒప్పందం జరిగింది.
  14. 1920లో నానా జాతి సమితి ఏర్పడింది.
  15. 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలండ్ పై దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.
  16. దీనికి ప్రధాన కారకులు జర్మనీలో నాజీ స్థాపకుడు హిట్లర్, ఇటలీ ఫాసిస్టు పార్టీ స్థాపకుడు ముస్సోలిని.
  17. దురహంకార పూరిత జాతీయతావాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు, సైనిక వాదం. ఇవి రెండు ప్రపంచ యుద్ధాలకు ఉమ్మడి కారణాలు.
  18. జర్మనీ చాన్స్‌లర్ బిస్మార్క్ 1879లో ఆస్ట్రియాతో, 1882లో ఇటలీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడు. ఇదే త్రైపాక్షిక కూటమి.
  19. ఫ్రాన్స్ కూడా 1891లో రష్యాతో, 1904లో బ్రిటన్‌తో ఒప్పందం చేసుకుంది. ఇదే మిత్ర రాజ్యాల కూటమి.
  20. వర్సయుల్స్ ఒప్పందం, నానాజాతి సమితి వైఫల్యం, ప్రతీకార పెత్తందారీతనం, సామ్యవాదం, రష్యా పట్ల భయాలు.ఇవి రెండో ప్రపంచ యుద్ధానికి పత్యేక కారణాలు.
  21. 1917లో రష్యాలో విప్లవం సంభవించింది. 1924లో సోవియట్ సోషలిస్ట్ దేశాల సమాఖ్య USSR గా మారింది.
  22. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు ప్రయోగించింది. ఇది ప్రపంచంలోనే తొలి ప్రయోగం.
  23. ప్రపంచ యుద్ధాల వల్ల అసంఖ్యాక ప్రాణ నష్టం జరిగింది. అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు ఊపందుకున్నాయు.
  24. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అధికార సమాతుల్యంలో మార్పు వచ్చి కొత్తగా అమెరికా, రష్యాలు అగ్రరాజ్యాలుగా అవతరించాయు.
  25. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి ఏర్పడింది.
  26. 1918లో బ్రిటిష్‌లో మొదటి సారిగా మహిళలకు ఓటు హక్కు లభించింది.
1మార్కు ప్రశ్నలు
1. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచనాల యుగంగా పేర్కొన్నది ఎవరు?
జ:
20వ శతాబ్దాన్ని తీవ్ర సంచనాల యుగంగా పేర్కొన్నదిప్రముఖ చరిత్రకారుడు ఎరిక్ హబ్స్ బామ్.

2. 20వ శాతాబ్దం ప్రారంభ కాలంలో రాజకీయంగా ప్రపంచంలో ఎలాంటి మార్పులు వచ్చాయు?
జ:
1) కోన్ని దేశాల్లో ప్రజాస్వామ్య భావాలు వ్యాపించగా మరికొన్ని దేశాల్లో ఫాసిస్టు భావాలు   వ్యాపించాయు.
2) మొదటి సారిగా మహిళలు ఓటు హక్కు సంపాదించుకున్నారు.

3. తీవ్ర ఆర్థిక మాంద్యము ఎప్పుడు, ఎక్కడ సంభవించింది?
జ:
తీవ్ర ఆర్థిక మాంద్యము1929లో ముందుగా అమెరికాలో మొదలై పపంచమంతా విస్తరించింది.

4. 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచంలో పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలు ఏవి?
జ:
బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా మెదలైనవి.

5. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌లోని ఏ నగరాలపై అణుబాంబు వేసింది?
జ:
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్‌లోనిహిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు వేసింది.

6. అణుబాంబు ప్రభావం వల్ల హిరోషిమా, నాగసాకిప్రజలను దశాబ్దాలుగా పీడించిన వ్యాధులు ఏవి?
జ:
ల్యుకీమియా, కాన్సర్.

7. కేంద్ర రాజ్యల (అక్షరాజ్యాలు) కూటమిలోని ప్రధాన దేశాలు ఏవి?
జ:
జర్మనీ, ఆస్ట్రియా, హంగెరీ, ఇటలీ, జపాన్

8. మిత్ర రాజ్యాల కూటమిలోని ప్రధాన దేశాలు ఏవి?
జ:
బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మొదలైనవి.

9. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జ:
1914 జూన్ 28న ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ ఒక సెర్బియన్ వ్యక్తి చేతిలో హత్యకు గురి కావడం.

10. రెండో పపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జ:
1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలండ్ పై దాడి చేయడం. దీనికి కారణం డాంజింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలండ్ నిరాకరించడం.

11. జాతీయతా వాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరణ ఎందుకు?
జ:
1)జాతియతా వాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరణ ఎందుకంటే ఆధునికజాతీయ రాజ్యాలు ఏర్పడటానికి, స్వాతంత్య్రఉద్యమ్యాలు తీవ్రం కావడానికి ఇది కారణం.

2) జర్మనీ, ఇటలీలు ఏకీకరణ సాధించడానికి ఇది కారణం.
12.
దురహంకార పూరిత జాతీయ వాదాలకు ఉదాహరణలు ఏవి?
జ: ఇటలీలోని ఫాసిజం, జర్మనీలోని నాజీజం

13. ‘‘సామ్రాజ్యవాదం’’ అనగానేమి?
జ:
వలస రాజ్యాల విస్తరణ కోసం ఐరోపా రాజ్యాల మధ్య నెలకొన్న పోటియే సామ్రాజ్య వాదం.
4మార్కుల ప్రశ్నల్లోని 10వ ప్రశ్నలో ఇచ్చిన పట్టిక ఆధారంగా ఈ క్రింది ప్రశ్నలకు జవాబు వ్రాయండి.

14. రష్యాపై జర్మనీ దండెత్తిన సంవత్సరం ఏది?
జ:
1942

15. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది?
జ:
నానాజాతి సమితి

4మార్కుల ప్రశ్నల్లోని 11వ ప్రశ్నలోని గ్రాఫ్ ఆధారంగా ఈ కింది ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
16. ఏ సంవత్సరంలో దేశాల సైనిక ఖర్చు ఎక్కువగా ఉంది?
జ:
1914

17. 1880లో యూరప్‌లోని ప్రధాన దేశాల సైనిక ఖర్చు ఎంత?
జ:
132 మిలియన్ పౌండ్లు

18. 1880 లో పోల్చినపుడు 1900 సంవత్సరంలో సైనిక ఖర్చులో ఎంత పెరుగుదల ఉంది?
జ:
73 మిలియన్ పౌండ్లు

బహుళైచ్ఛిక ప్రశ్నలు (1/2 మార్కు)
1. 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ జనాభా ఎంత? ( )

A) 180 కోట్లు
B) 150 కోట్లు
C) 100 కోట్లు
D)160 కోట్లు
2. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొన్నది ఎవరు? ( )
A) ఎరిక్ హబ్స్ బామ్
B) విన్‌స్టన్ చర్చిల్
C)రూస్‌వెల్ట్
D)స్టాలిన్
3.సినిమాలు ఆవిర్భవించిన కాలం. ( )
A) 20 శతాబ్దం చివరిలో
B) 20వ శతాబ్దం పారంభంలో
C)19వ శతాబ్దంలో
D) 18వ శతాబ్దంలో
4. ఆర్థిక మాంద్యము ఏర్పడిన సంవత్సరం.... ( )
A) 1930
B) 1929
C) 1920
D) 1919
5.ఇది కేంద్ర రాజ్యాల కూటమిలోని దేశం కాదు ( )
A) జర్మనీ
B)ఆస్ట్రియా
C)అమెరికా
D)జపాన్
6.రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది? ( )
A) జూన్, 1945
B) జులై, 1945
C)ఆగస్టు, 1945
D)సెప్టెంబర్, 1945
7.ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య జరిగిన తేదీ.. ( )
A) 1914 జూన్ 28
B) 1914 జులై28
C) 1914 ఆగస్టు 28
D)1914 మే 28
8.రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు ( )
A) 1929 సెప్టెంబర్ 1
B) 1939 ఆగస్టు 28
C)1930 జులై 28
D)1939 సెప్టెంబర్ 1
9.జర్మనీ చాన్స్‌లర్ బిస్మార్క్ 1879లో ఈ దేశంతో రహస్య ఒప్పందం చేసుకున్నాడు.( )
A) ఇటలీ
B) ఆస్ట్రియా
C) జపాన్
D)టర్కీ
10.మొదటి ప్రపంచ యుద్ధం ఐరోపా రాజ్యాల మధ్య ఏర్పడిన ఒప్పందం... ( )
A) వర్సయుల్స్ ఒప్పందం
B)వార్సా ఒప్పందం
C)నాటో ఒప్పందం
D)అట్లాంటిక్ ఒప్పందం
11. నానాజాతి సమితి ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి.... ( )
A)ఉడ్రో విల్సన్   B) రూస్‌వెల్ట్    C)చర్చిల్     D)లెనిన్
12. నానాజాతి సమితిలో ఏర్పడి ఇప్పటికి పని చేస్తున్న సంస్థ... ( )
A) అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(UNICEF)
B) ఆహరము, వ్యవసాయ సంస్థ(FAO)
C)అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)
D)అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO)
13. రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏర్పడింది... ( )
A) 1917
B) 1919
C) 1905
D) 1929
14. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే అంతమైన సామ్రాజ్యం... ( )
A) ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం
B) రష్యాన్ సామ్రాజ్యం
C)జర్మన్ సామ్రాజ్యం
D)పై వన్నీ
15. ‘ప్రపంచప్రభుత్వం’గా పిలుస్తున్న సంస్థ.. ( )
A) నానాజాతి సమితి
B) ఐక్యరాజ్య సమితి
C) భద్రతా మండలి
D)జి-20 దేశాల కూటమి
16.W.H.O ను విస్తరించుము ( )
A) World Health Organisation
B) World Heal Organisation
C) White House Organisation
D) White House Office
17. కింది వాటిలో విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ ఏది? ( )
A)UNICEF
B) UNESCO
C) ILO
D) W.H.O
18. మహిళలకు మొదటి సారి ఓటు హక్కు లభించిన సంవత్సరం ( )
A) 1900
B) 1910
C) 1918
D)1924
19. మహిళలకు మొదటి సారి ఓటు కల్పించిన దేశం..... ( )
A)ఫ్రాన్స్
B)రష్యా
C)అమెరికా
D)బిటన్
20.అంతర్జాతీయ మహిళల ఓటు హక్కు ఉద్యమ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ( )
A) 1910
B) 1914
C) 1918
D) 1916
జవాబులు
1) D 2) A 3) B 4) B 5) C 6) C 7) A 8) D 9)B 10)A
11) A 12) D 13) A 14) D 15 ) B 16) A 17) B 18) C 19) D 20)B
4మార్కుల ప్రశ్నలు
 1.ప్రపంచ యుద్ధాలలో జాతీయ రాజ్యాలు, జాతీయతా భావం యుద్ధ కాంక్షను ఎలాప్రభావితం చేశాయు?
జ:
  1. ప్రపంచ యుద్ధాల కాలంలో జాతీయతావాదం అనే భావజాలం ఒక మంచి ప్రేరణ.
  2. ఆధునిక జాతీయ రాజ్యాలు ఏర్పడటానికి, జర్మనీ, ఇటలీల ఏకీకరణకు ఇది కారణమైంది.
  3. ఈ భావజాలాన్ని చాలా దేశాలు తమపై గర్వాన్ని , ఇతరులపై ద్వేషాన్ని కలిగించడానికి వాడుకున్నారు.
  4. యూరప్‌లోని దేశాల మధ్య ఈ ద్వేషం 19వ శతాబ్దంలో క్రమేపీ పెరుగుతూ వచ్చింది.
  5. ఇటలీ ఫాసిజం, జర్మనీ నాజీజం రెండూ కూడా దురహంకార పూరిత జాతీయవాదాలు.
  6. వీరు ప్రపంచంలో తమ జాతే గొప్పదని ప్రపంచాన్ని తామే పరిపాలించాలని భావించారు.
  7. ముఖ్యంగా జర్మనీ ఈ దురంహకార జాతీయ వాదాన్ని మరింత రెచ్చగొట్టి ప్రపంచాన్ని జర్మనీ విజేతగా పాలిస్తుందని భ్రమ కల్పించారు.
  8. యూరప్‌లోని ఇతర దేశాలకు వ్యతిరేకంగా జర్మనీ ప్రజలను రెచ్చగొట్టారు.
  9. మరొక వైపు ఆసియాలో జపాన్ కూడా ఈ వాదాన్ని అనుసరించింది.ఈ విధంగా దురహంకార పూరితమైన జాతీయతా భావం ప్రపంచ యుద్ధలకు దారితీసింది.
2.రెండు ప్రపంచ యుద్ధాల కారణాల మీద క్లుప్తంగా రాయండి.
ప్రపంచంలోని ఏదైనా దేశాలలో ఈనాటికి ఈ అంశాలు ఏమైనా ఉన్నాయా ? ఏ రూపంలో?
జ:
రెండు ప్రపంచ యుద్ధాల కారణాలు.
ప్రతి యుద్ధానికి తక్షణ కారణాలు, దీర్ఘకాలంగా మసులుతున్న కారణాలు ఉంటాయు.
తక్షణ కారణాలు :-
1.మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం:-

1914 జూన్ 28న ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్‌ను ఒక సెర్బియన్ యువకుడు హత్య చేయడం.
2.రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం:-
డాంజింగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడంతో 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్ పై దాడి చేయడం.
రెండు యుద్ధాలకు ఉమ్మడిగా ఉన్న దీర్ఘకాలిక కారణాలు :-
1. దురహంకార పూరిత జాతీయ వాదం:-

19వ, 20వ శతాబ్దం ప్రారంభంలో జర్మనీ,ఇటలీ దేశాలు అనుసరించిన దురహంకార పూరిత జాతీయ వాదం ప్రపంచ యుద్ధాలకు దారి తీసింది.
2. సామ్రాజ్య వాదం:-
ముడి పదార్థాల కోసం, తమ పారిశ్రామిక ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్ల కోసం వలస ప్రాంతాలను ఆక్రమించుకునే విషయంలో యూరప్ రాజ్యాల మధ్య తలెత్తిన వివాదం చివరకు ప్రపంచ యుద్ధాలకు దారితీసింది.
3.రహస్య ఒప్పందాలు:-
జర్మనీ, ఆస్ట్రియా ఇటలీ త్రైపాక్షిక కూటమిగా, బ్రిటిష్, ఫ్రాన్స్, రష్యాలు, మిత్ర రాజ్యాల కూటమిగా ప్రపంచ దేశాలు విడిపోయు పరస్పరం ఘర్షణకు దిగి అవి చివరకు యుద్ధాలకు దారితీశాయు.
4. సైనిక వాదం:-
1880 నుంచి 1914 నాటికి యూరప్ దేశాలు తమ సైనిక ఖర్చు 300 శాతానికి పెంచాయు. పెద్ద సంఖ్యలో సైన్యాన్ని, ఆయుధాలను పెంచయు. దీని వల్ల యుద్ధం అంటే ఎవరికీ భయం లేకుండా పోయుంది.
పైన వివరించిన అంశాలలో ప్రపంచంలో నేడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయు. దేశల మద్య సైనిక ఒప్పందాలు ఉన్నాయు. దురహంకార పూరిత జాతీయ వాదం, సామ్రాజ్య వాదం దాదాపు లేదు. దేశాల మధ్య సైనిక ఒప్పందాలు ఉన్నాయి.
ఉదా:- NATO, వార్సా ఒప్పందం. కొన్ని అగ్ర దేశాలు ఇప్పటికీ సైన్యాన్ని, మారణాయుధలను ప్రోత్సహిస్తున్నాయు. పాకిస్తాన్, అరబ్ దేశాలలో కూడా మనం ఈ లక్షణాలు చూడవచ్చు.

3. 20వ శతాబ్దపు ప్రథమ ఆర్థభాగంలో యుద్ధాల వివిధ ప్రభావాలు ఏమిటి?
: 20వ శతాబ్దపు ప్రథమ అర్థభాగంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచ రాజకీయాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపాయు.

1.అసంఖ్యక ప్రాణ నష్టం:-
ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది చనిపోయారు, గాయపడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు కోటి మంది, రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండున్నర కోట్ల మంది చనిపోయారని అంచనా. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రయోగించిన అణు బాంబుల వల్ల ల్యుకేమియా, కాన్సర్ సమస్యలు దశాబ్దాల పాటు కొనసాగాయు.
2. ప్రజా స్వామ్య సూత్రాల పునరుద్ఘాటన:-
రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత చాలా దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయు. రష్యాలో సామ్యవాదం, జర్మనీలో వైమర్ గణతంత్రం, టర్కీలో ప్రజాస్వామ్య, లౌకిక ప్రభుత్వం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు అన్ని వలస రాజ్యాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయు.
3.అధికార సమతౌల్యంలో మార్పు:-
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, ఆస్ట్రో-హంగేరియన్, రష్యన్, టర్కిష్ సామ్రాజ్యాలు అంతమయ్యాయు. రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయున బ్రిటిష్, ఫ్రాన్స్ దేశాలు తమ వలస ప్రాంతాలకు స్వాతంత్య్రాన్ని ఇవ్వడంతో ప్రపంచ పటం రూపు రేఖలు మారిపోయాయు. కొత్తగా అమెరికా,రష్యాలు అగరాజ్యాలుగా అవతరించాయు.
4. కొత్త అంతర్జాతీయ సంస్థలు:-
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి (UNO)ఏర్పడింది. ఇది ప్రపంచ శాంతి పరిరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తోంది.
5. మహిళలకు ఓటు హక్కు:-
1918లో బ్రిటిష్‌లో మహిళలకు ఓటు హక్కు లభించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత వారు దీన్ని సాధించుకున్నారు.

4. 20వ శతాబ్దపు ఆరంభంలో ప్రపంచ రాజకీయ,సామాజిక, ఆర్థిక అంశాలలో చోటు చేసుకొన్న పరిణామాలను వివరింపుము.
జ:
ప్రముఖ చరిత్ర కారుడైన ఎరిక్ హబ్స్‌బామ్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొనారు.
రాజకీయ పరిణామాలు:-
  1. పారిశ్రామిక పెట్టుబడి దారీ విధానం కొన్ని యూరప్ దేశాలకే పరితమై అవి ప్రపంచమంతటా విశాల వలస సామ్రాజ్యాలు ఏర్పాటు చేశాయు.
  2. దీని మూలంగా యూరప్ దేశాల మధ్య పోటి ఏర్పడి పగ, ప్రతీకారాలు ఏర్పడ్డాయు.
  3. పంచంలోని ఇతర ప్రజలపై ద్వేషం, అవధులు లేని అధికారంతో ఫాసిజం భావజాలం తీవ్ర రూపం దాల్చింది.
  4. మరి కొన్ని దేశాలలో ప్రజాస్వామ్య యుతమైన ప్రభుత్వాల కోసం ఆకాంక్షలు పెరిగాయు.

సామాజిక పరిణామాలు:-

  1. అందరికీ అక్షరాస్యత స్థాయు, సగటు జీవిత కాలం అపారంగా పెరిగాయు.
  2. సినిమాలు వంటి కొత్త కళలు ఆవిర్భవించాయు.
  3. విజ్ఞాన శాస్త్రం కొత్త శిఖరాలను అందుకొని పరమాణువు, జీవల రహస్యాన్ని ఛేదించింది.
  4. ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళలకు పాశ్చాత్య దేశాలలో ఓటు హక్కు లభించింది.

ఆర్థిక పరిణామాలు :-

  1. 1929 లో ‘తీవ్ర ఆర్థిక మాంద్యము’ సంభవించి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.
  2. ప్రజలు పెద్ద సంఖ్యాలో నిరుద్యోగులయ్యారు.
  3. రెండు ప్రపంచ యుద్ధాలు సంభవించి కోట్లాది మంది చనిపోయారు.
  4. అపార ఆస్తి నష్టం జరిగింది.

5. రెండో ప్రపంచ యుద్ధానికి దోహద చేసిన ప్రత్యేకఅంశాలు ఏవి?
జ:
రెండో ప్రపంచ యుద్ధానికి దోహద చేసిన ప్రత్యేక అంశాలు:-
1) వర్సయుల్స్ ఒప్పందం

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1919 లో వర్సయుల్స్ శాంతి సమావేశం జరిగింది. యుద్ధంలో విజేతలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ,జపాన్ లతో పాటు 32 దేశాలు పాల్గొన్నాయు. రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, టర్కి దేశాలకు ఆహ్వనం లేదు. గెలిచిన దేశాలు యుద్ధానికి ప్రధాన కారణం జర్మనీ అని నిర్ధారించి జర్మనీ పైన అపారమైన నష్ట పరిహరాన్ని విధించాయు. దీనిని జర్మనీ ప్రజలు తమకు జరిగిన అవమానంగా భావించారు.
2. నానాజాతి సమితి వైఫల్యం:-
వర్సయుల్స్ ఒప్పందం ప్రకారం 1920లో నానాజాతి సమితి ఏర్పడింది. భవిష్యత్‌లో యుద్ధాలను నివారించడం దీని ప్రధాన ఉద్దేశం. అమెరికా దీనిలో చేరలేదు. జర్మనీ, రష్యాలకు సభ్యత్వం ఇవ్వలేదు. అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాలపై దండెత్తకుండా జర్మనీ, ఇటలీ దేశాలను ఇది నివారించలేకపోయుంది.
3. ప్రతీకార పెత్తందారీ తనం - జర్మనీ సవాలు.
వర్సయుల్స్ ఒప్పందంలో తమకు జరిగిన అవమానానికి ప్రతికారం తీర్చుకునే ఆలోచనలు జర్మనీ ప్రజల్లో కలిగాయు. హిట్లర్ అధికారంలోకి వచ్చాక జర్మనీని అన్ని రంగాల్లో బలంగా తయారు చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఆయుధ పరిశ్రమలు స్థాపించడం, సైనికులను నియమించుకోవడం ద్వారా సైన్యాన్ని బలంగా తయారు చేశాడు. దీంతో జర్మనీ బ్రిటన్ , దాని మిత్ర రాజ్యాలకు సవాలుగా నిలిచింది.
4. సామ్యవాదం- రష్యాపై భయాలు:-
1917 సంవత్సరంలో రష్యాలో విప్లవం సంభవించి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. బ్రిటన్ లాంటి పాశ్చాత్య పెట్టుబడి దారీ దేశాలు తమ దేశాలకు కమ్యూనిజం వ్యాపిస్తుందని భయపడ్డాయు. అందువల్ల హిట్లర్, ముస్సోలినీలు ఎన్ని ఆక్రమణలు చేస్తున్నా ఊరుకున్నాయు. వారు చివరికి రష్యాను కూడా ఆక్రమిస్తారని బ్రిటన్, ఫ్రాన్స్‌లు భావించాయు. కాని 1939 లో జర్మనీ, రష్యాలో ఒప్పందం చేసుకొని రష్యాపై దాడి చేయలేదు. చివరకు బ్రిటిష్, ఫ్రాన్స్‌లకు వ్యతిరేకంగా హిట్లర్ నిలిచాడు.

6.ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన కొన్ని ప్రతికూలమైన వాస్తవాలు తెలపండి.
జ:
పపంచ యుద్ధాలకు సంబంధించిన కొన్ని ప్రతికూలమైన వాస్తవాలు:-
1) 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం ఆర్థికంగా రెండు భాగాలుగా విభజించి ఉంది.
i) పాశ్చాత్య, పారిశ్రామిక అభివృద్ధి దేశాలు
ఉదా: బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ మొదలైనవి.
ii) ఆఫ్రికా, ఆసియాలకు చెందిన వలస పాలిత దేశాలు
ఉదా: భారతదేశం, ఇండొనేషియా, దక్షిణాఫ్రికామొదలైనవి.
2) పారిశ్రామిక దేశాలు ఒకదానితో ఒకటి పోటి పడుతూ రెండు బృందాలుగా చీలిపోయు ఉన్నాయు.
i) జర్మనీ-ఆస్ట్రియా-హంగెరీ-ఇటలీ
ii) బిటన్- ఫ్రాన్స్- రష్యా
3) ఇవి ప్రపంచ ఆధిపత్యం కోసం, తద్వారా వలస ప్రాంతాలు, మార్కెట్లపై ఆధిపత్యం కోసం పోటి పడసాగాయు.
4) మరోవైపు వలసపాలిత ప్రాంతాలు స్వాతంత్య్ర పోరాటాలు మొదలు పెట్టి స్వయం పాలన కోసం డిమాండ్ చేయడం ప్రారంభించాయు.
5) 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. 1918లో జర్మనీ దాని మిత్ర రాజ్యాలు ఓటమితో ,బ్రిటన్,ఫ్రాన్స్ వాటి మిత్ర రాజ్యాల గెలుపుతో ఇది ముగిసింది.
6) ఈ యుద్ధం తర్వాత శాంతి కోసం జరిగిన వర్సయుల్స్ ఒప్పందం అనేక వివారాలకు దారితీసి చివరకు రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైంది.
7) 1939లో జర్మనీ పోలండ్ పై దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇందులో జర్మనీ, ఇటలీ,జపాన్ ఒకవైపు, బ్రిటిష్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మరోవైపు పోరాటం చేశాయి. చివరకు 1945లో జర్మనీ దాని మిత్ర రాజ్యాల ఓటమితో ఈ యుద్ధం ముగిసింది.
8) కాని అప్పటికే యుద్ధంలో పాల్గొన్న దేశాలన్నీ తీవ్రంగా దెబ్బ తిన్నాయు. అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.

4మార్కుల ప్రశ్నలు:- ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం.
7. క్రింది పేరాను చదివి నీ అభిప్రాయాన్ని తెలియజేయుము.
ఓటు హక్కు వంటి రాజకీయ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం తర్వాత 1918లో బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు లభించింది. ప్రపంచ యుద్ధాల మాదిరి దీర్ఘ కాలం పాటు జరిగే యుద్ధ కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి, ఇతర సేవలు కొనసాగవలసిన అవసరం ఉంది. మగవాళ్లు యుద్ధ భూమిలో ఉండటంలో ఫ్యాక్టరీలు, దుకాణాలు, కార్యాలయాలు, స్వచ్ఛందసేవలు, ఆసుపత్రులు, పాఠశాలల లాంటి వాటిలో మహిళలు పని చేయాల్సి వచ్చింది. సంపాదనపరులు కావడంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో జీవితంలోని అన్ని అంశాలలో మహిళలు సమానత్వాన్ని కోరసాగారు. ఆ దిశలో ఓటు హక్కు లభించడం అనేది ఒక పెద్ద ముందడగు.
జ:

  1. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన ఏ యుద్ధము కూడా ఏ కారణం లేకుండా మొదలు కాలేదు.
  2. ప్రతి యుద్ధానికి ఆ యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని సంవత్సరాల నుంచి మసులుతున్న దీర్ఘ కాలిక కారణాలు ఉంటాయు.
  3. అలాగే ప్రతి యుద్ధానికి ఆ యుద్ధం మొదలు కావడానికి ఒక తక్షణ కారణం ఉంటుంది.
  4. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణము ఆస్ట్రియా రాకుమారుడు ఫెర్డినాండ్ హత్య.
  5. 1914 జూన్ 28న ఫెర్డినాండ్‌ను ఒక సెర్బియా దేశస్థుడు హత్య చేశాడు.
  6. దీంతో ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది.
  7. సెర్బియాకు మద్దతుగా బ్రిటన్,ఫ్యాన్స్, రష్యాలు యుద్ధంలోకి దిగాయు.
  8. ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ,ఇటలీ కూడా యుద్ధంలోకి దిగాయు.
  9. అలగే 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్‌పై దాడి చేయడం, రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం.
  10. పోలాండ్ కు మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్‌లు, యుద్ధంలోకి దిగాయు. జర్మనీకి మద్దతుగా ఇటలీ, ఆస్ట్రియా లాంటి దేశాలు వచ్చాయు. ఈ విధంగా ఈ రెండు సంఘటనలు ప్రపంచ యుద్ధాలకు దారి తీశాయు.

4మార్కుల ప్రశ్నలు -సమాచార నైపుణ్యాలు
9. ఈ గ్రాఫ్‌ను పరిశీలించి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
యుద్ధమరణాలు 1500-1999

----------------------------------------
1)1700-1799 శతాబ్దంలో యుద్ధ మరణాలు ఎంత? ప్రతి వెయ్యు మందికి ఎంతమంది మరణించారు?
2) 1800-1899 శతాబ్దం, 1900-1999 శతాబ్దంలోని యుద్ధ మరణాలు పోలిస్తే ఎంత తేడా ఉంది?
3) 1900-1999 శతాబ్దంలో యుద్ధ మరణాలు అధికంగా ఉండటానికి కారణం ఏమిటి?
4) ఏ శతాబ్దంలోని యుద్ధ మరణాల రేటు (ప్రతి 1000 మందికి) అంతకు క్రితం శతాబ్దం కంటే తక్కువగా ఉంది?
జ:

  1. 1700-1799లో యుద్ధ మరణాలు 7 మిలియన్లు. ప్రతి వెయ్యు మందికి 9.7 మంది మరణించారు.
  2. 1800-1899, 1900-1999 శతాబ్దంలోని యుద్ధ మరణాల మధ్య తేడా 90.3 మిలియన్లు
  3. 1900-1999 శతాబ్దంలో యుద్ధ మరణాలు ఎక్కువగా ఉండడానికి కారణం ప్రపంచ యుద్ధాలు.
  4. 1700-1799 శతాబ్దంలోని యుద్ధ మరణాల రేటు (9.7), 1600-1699 లోని యుద్ధ మరణాల రేటు (11.2) కంటే తక్కువ.

10. కింది కాల పట్టికను గమనించి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.

సంఘటన

సంవత్సరం

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం 1914
రష్యా విప్లవం 1917
మొదటి ప్రపంచ యుద్ధ ముగింపు 1918
వర్సయుల్స్ ఒప్పందం 1919
నానాజాతి సమితి ఏర్పాటు 1919 (1920)
జర్మనీలో హిట్లర్ ప్రాభవం 1933
రెండోప్రపంచ యుద్ధం ప్రారంభం 1939
రష్యా పై జర్మనీ దండెత్తటం 1942
ఐక్యరాజ్య సమితి ఏర్పాటు 1945
రెండో ప్రపంచ యుదంధ ముగింపు 1945
(1)మొదటి ప్రపంచ యుద్ధంఏ ఒప్పందమతో ముగిసింది?
(2)రెండో ప్రపంచ యుద్ధము తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఏది?
(3) మొదటి ప్రపంచ యుద్ధముముగిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు రెండో ప్రపంచ యుద్ధము మొదలైంది?
(4) 1917 సంవత్సరానికి సంబంధించిన ముఖ్య సంఘటన ఏది?
జ:
(1) వర్సయుల్స్ ఒప్పందం
(2) ఐక్యరాజ్య సమితి
(3) 21 సంవత్సరాలు
(4) రష్యా విప్లవం

11. కింది గ్రాఫ్‌ను పరిశిలించి ఇచ్చిన ప్రశ్నలకుజవాబులు రాయండి.
ఆయుధ పోటీ
---------------
1880-1914 మధ్య ప్రధాన శక్తులైన జర్మనీ, ఆస్ట్రియా- హంగెరీ, బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్‌ల సైనిక ఖర్చు (మూలం: టైమ్స్ ప్రపంచ చరిత్ర అట్లాసు, లండన్, 1978)
(1)1880-1914 ల మధ్య ఆయుధ పోటీ ప్రధానంగా ఏ దేశాల మధ్య ఉంది?
(2) 1900 సంవత్సరంలో యూరప్‌లోని ప్రధాన శక్తుల సైనిక ఖర్చు ఎంత?
(3) సైనిక ఖర్చులో 1880 సంవత్సరంతో పోల్చినపుడు 1914 సంవత్సరంలో ఎంత పెరుగుదల ఉంది?
(4) 1910 నుంచి 1914 వరకు నాలుగు సంవత్సరంలోనే సైనిక ఖర్చులో 109 మిలియన్ పౌండ్ల పెరుగుదల నమోదైంది? దానికి కారణం ఏమిటి?
జ:

(1)జర్మనీ, ఆస్ట్రియా-హంగెరీ, ఇటలీ ఒకవైపు బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్‌లు మరోవైపు ఉండి ఆయుధ పోటీకి పాల్పడ్డాయు.
(2) 205 మిలియన్ పౌండ్లు
(3) 265 మిలియన్ పౌండ్లు
(4) మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడం.

4మార్కుల ప్రశ్నలు పటనైపుణ్యాలు
12. ఐరోపా పటములో కింది వాటిని గుర్తించండి.
Group-A 1) బ్రిటన్ 2) ఫ్రాన్స్ 3) స్పెయున్ 4) పోర్చుగల్
Group-B 1) జర్మనీ 2) ఆస్ట్రియా- హంగెరీ 3) రష్యా 4) పోలండ్
Group-C 1) స్వీడన్ 2) ఇటలీ 3) ఫీన్‌లాండ్ 4) నార్వే

2మార్కుల ప్రశ్నలు
1. పారిశ్రామికీకరణ ఆధునిక యుద్ధాలకు ఎలా దారి తీసింది?
జ:
  1. బిటన్ ,రష్యా,ఫ్రాన్స్, జపాన్ , జర్మనీలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలుగా గుర్తించారు.
  2. ఇవి ముడి పదార్థాలు, నూతన మార్కెట్ల కొరకు పోటీ పడి చాలా దేశాలను తమ వలస ప్రాంతాలుగా మార్చుకున్నాయు.
  3. ఒక దేశం మరొక దేశంపైన ఆధిపత్యం చెలాయుస్తూ ఉండటం వలన తరచూ గొడవలు జరుగుతుండేవి.
  4. తద్వారా అభద్రతా భావం, జాత్యాహంకారం, సామ్రాజ్యవాద రూపాలు అత్యున్నత దశకు చేరుకోవడంతో ఆధునిక యుద్ధాలకు దారితీసింది.

2. తమ దేశంపై ప్రజలకు ఉన్న ప్రేమ ఇతర దేశాలతో యుద్ధానికి దారి తీస్తుందా?
జ:

  1. యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మొదలగు దేశాల ప్రజలలో తమ దేశంపై ప్రేమ మితిమీరింది.
  2. ఏ దేశ ప్రజలకైనా వారి దేశంపై ప్రేమ ఉండాలి కాని అది మితిమీరితేఇతర దేశాలపై ద్వేషానికి తద్వారా యుద్ధానికి దారితీస్తుంది.
  3. తమ దేశమే ఈ ప్రపంచానికి నాయకత్వం వహించాలనే అహంకారపూరిత ప్రేమ విద్వేషాలను రెచ్చగొట్టింది.
  4. ఇది దురాక్రమణలను ప్రేరేపించి యుద్ధాలకు దారి తీసింది.

3. దురహంకార పూరిత జాతీయం వాదం అంటే ఏమిటి?
జ:
దురహంకార పూరిత జాతీయం వాదం:-

  1. జాతీయం వాదంఅనే భావజాలం ఒక మంచి ప్రేరేపణ. ఆధునిక జాతీయ రాజ్యాలు ఏర్పడటానికి, జర్మనీ, ఇటలీలు ఏకీకరణ చెందడానికి ఇది కారణం అయుంది.
  2. అయుతే ఈ భావజాలం తమపై గర్వాన్ని, ఇతరులపై ద్వేషాన్ని కలిగించడానికి కూడా దారితీసింది.
  3. యూరప్‌లోని దేశాల మధ్య ఈ ద్వేషం క్రమేపి 19వ శతాబ్దంలో పెరుగుతూ వచ్చింది.
  4. ముఖ్యంగా 1923 నుంచి ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజీజం రెండూ కూడా దురహంకార పూరిత జాతీయ వాదాలే.

4. సామ్రాజ్య వాదం అంటే ఏమిటి?
జ:
సామ్రాజ్య వాదం:-

  1. బ్రిటన్,జర్మనీ వంటి ఐరోపా దేశాలలో పారిశ్రామిక మూలధనం అభివృద్ధి చెందడంతో ముడి సరుకుల, తమ ఉత్పత్తులు మార్కెట్‌లకోసం అన్వేషణ జరిగింది.
  2. దీంతో 19వ శతాబ్దం ముగిసేనాటికి ఐరోపా దేశాల మధ్య వలస ప్రాంతాల ఆక్రమణ కోసం పోటీ మొదలైంది.
  3. ఈ పోటి చివరకు ఐరోపా దేశాల మధ్య ఘర్షణలకు దారితీసి ఆసియా, ఆఫ్రికాలలోని చాలా దేశాల ఆక్రమణకు, దోపిడికి దారి తీసింది.
  4. దీనినే సామ్రాజ్య వాదం అంటారు.

5. ‘రహస్య ఒప్పందాలు’అంటే ఏమిటి?
జ:
రహస్య ఒప్పందాలు:-

  1. జర్మనీ 1879లో ఆస్ట్రియాతోను, 1882లో ఇటలీతోను రహస్య ఒప్పందం కుదుర్చుకుని త్రైపాక్షిక కూటమిని ఏర్పరిచింది.
  2. ఫ్రాన్స్ కూడా 1891 లో రష్యాతోను, 1904లో బ్రిటన్‌తోను జత కలిసి చివరకు 1907లో రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు మిత్ర రాజ్యాల కూటమిగా ఏర్పడ్డాయు.
  3. ఈ రెండు కూటములు పరస్పరం ఒకరిపై మరొకరు అనుమానాలు, విద్వేషాలతో రెచ్చ గొట్టుకున్నాయు.
  4. చివరకు ఇది ప్రపంచ యుద్ధాలకు దారితీసింది.

6. సైనిక వాదం అంటే ఏమిటి?
జ:
సైనిక వాదం:-

  1. భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరియైన విధానమని నమ్మటాన్ని సైనిక వాదం అంటారు.
  2. 1880 నుంచి 1914 నాటికి యూరప్‌లోని ఆరు ప్రధాన శక్తులు జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు తమ సైనిక ఖర్చును అమితంగా పెంచాయు.
  3. ఇవి పెద్ద సంఖ్యలో శాశ్వత సైనాన్ని ఏర్పరుచుకున్నాయు.
  4. ఆయుధాలు సమకూర్చ కొవడంలో పోటి పడ్డాయు.

7.నానాజాతి సమితి గురించి వ్రాయండి.
జ:
నానాజాతి సమితి:-

  1. భవిష్యత్‌లో యుద్ధాలను నివారించడానికి వర్సయుల్స్ ఒప్పందం ప్రకారం నానాజాతి సమితి ఏర్పడింది.
  2. రష్యా, జర్మనీలకు ఇందులో సభ్యత్వం ఇవ్వలేదు.
  3. అమెరికా కాంగ్రెస్ వ్యతిరేకించడంతో అది దీనిలో సభ్యత్వం తీసుకోలేదు.
  4. కాబట్టి నానాజాతి సమితి బలహీనంగా తయారైంది. ఆక్రమణలను, యుద్ధాలను ఆపే స్థితిలో అది లేదు. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం తప్పలేదు.

8. మహిళలకు ఓటు హక్కు ఎలా సాధించుకున్నారు?
జ:
మహిళలకు ఓటు హక్కు:-

  1. ఓటు హక్కు సాధించడం కోసం మహిళలు సుదీర్ఘ పోరాటం చేశారు.
  2. చివరకు 1918లో మొదటి సారిగా బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు కల్పించింది.
  3. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మగవాళ్లు అందరూ యుద్ధ భూమిలో ఉండటంతో ఫ్యాక్టరీలు , దుకాణాలు, కార్యాలయాలు, స్వచ్ఛంద సేవలు, ఆసుపత్రులు, పాఠశాలలు లాంటి వాటిలో మహిళలు పని చేయాల్సి వచ్చింది.
  4. ఈ ఆత్మవిశ్వాసంతో మహిళలు అన్ని అంశాల్లో సమానత్వాన్నికోరుకున్నారు.ఈ విధంగా ఓటు హక్కు సాధించారు.
Published date : 28 Dec 2023 12:26PM

Photo Stories