Skip to main content

Telangana 10th Class Supplementary Results 2023 : టెన్త్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాలు విడుద‌ల‌.. ఎంత మంది పాస్ అయ్యారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను జూన్ 7వ తేదీన‌(శుక్ర‌వారం) మ‌ధ్యాహ్నం 3:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.

తెలంగాణ‌లో ఇంట‌ర్‌, టెన్త్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ఒకే రోజు.. ఒక గంట వ్య‌వధిలోనే విడుద‌ల చేశారు. తెలంగాణ‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లు జూన్ 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు జ‌రిగిన విష‌యం తెల్సిందే.

మొత్తం ఈ ప‌రీక్ష‌ల‌కు 71,695 మంది రిజ‌స్ట‌ర్ చేసుకోగా.. ఇందులో 66732 మంది ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. వీరిలో ఉత్తీర్ణ‌త సాధించిన వారు 53777 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అంటే టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల్లో 80.59 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఈ ప‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.
​​​​​​​​​​​​​​☛ తెలంగాణ టెన్త్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లు-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి

How to check TS 10th Class Supply Results 2023 :

  • Visit https://sakshieducation.com/
  • Click on TS 10th class supply results link available on the home page.
  • Enter your roll no. and click on submit.
  • The results will be displayed on the screen.
  • Download and save a copy of the mark sheet for further use.

తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు (regular) ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 4,86,194 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

తెలంగాణ టెన్త్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌ ఫలితాల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 07 Jul 2023 03:22PM
PDF

Photo Stories