Skip to main content

'Open' results released: ‘ఓపెన్‌’ ఫలితాలు విడుదల

Tenth Class Supplementary Exam Results Telangana Sarvathrik Vidyapeeth Statement Intermediate Supplementary Exam Results

కొత్తగూడెంఅర్బన్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో గత అక్టోబర్‌లో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి, ఉమ్మడి జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో – ఆర్డినేటర్‌ మద్దినేని పాపారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం వారొక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 439 మంది హాజరు కాగా 71 మంది ఉత్తీర్ణులయ్యారని(16.17 శాతం), ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 443 మంది హాజరు కాగా 191 మంది(43.12 శాతం) ఉత్తీర్ణత సాధించారని వివరించారు.

Also Read : Success Story : మా అమ్మ ఇచ్చిన ఆ డ‌బ్బుతోనే.. కోట్లు సంపాదించానిలా.. కానీ..

పరీక్ష ఫలితాలను www.telanganaopenschool.org వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కావాలనుకునే వారు ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌లో లేదా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Published date : 06 Dec 2023 10:43AM

Photo Stories