School Fees: స్కూల్ ఫీజుల నియంత్రణ పట్టదా?
Sakshi Education
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు నిర్ణయించేందుకు 2017లో ప్రభుత్వం వేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదిక సమరి్పంచి రెండున్నరేళ్లు దాటినా ఎందుకు తగిన చర్యలు చేపట్టడం లేదని నిలదీసింది. తిరుపతిరావు కమిటీ నివేదికపై ఆరు వారాల్లోగా తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం డిసెంబర్ 22న ఆదేశించింది.
చదవండి:
Jahnavi Dangeti: నాసా స్పేస్ ప్రోగ్రాంలోకి ఎల్పీయూ విద్యార్థిని
Published date : 23 Dec 2021 01:06PM