Jahnavi Dangeti: నాసా స్పేస్ ప్రోగ్రాంలోకి ఎల్పీయూ విద్యార్థిని
Sakshi Education
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) లో బీటెక్ ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జాహ్నవి దంగేటి చరిత్ర సృష్టించింది.
అలబామా (యూఎస్‌ఏ)లో ఉన్న నాసా లాంచ్ ఆపరేషన్స్ కెన్నడీ స్పేస్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం (ఐఏఎస్పీ) లో చోటు సాధించిన మొదటి భారతీయురాలిగా ఘనత సాధించింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రోగ్రాం కోసం ఐఏఎస్పీ ప్రపంచం నలుమూలల నుంచి కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి ఈ ప్రోగ్రాంకు ఎంపికైన మొదటి భారత సంతతి వ్యక్తిగా నిలిచింది. ఆమె కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో వ్యోమగామిగా జీరో గ్రావిటీ, అండర్ రాకెట్ లాంచ్, ఎయిర్‌క్రాఫ్ట్ నడపడం వంటి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసింది. అంతేగాక జాహ్నవి ‘టీమ్ కెన్నెడీ’ మిషన్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించనుంది. ఈ సందర్భంగా ఎల్పీయూ చాన్స్ లర్ అశోక్ మిట్టల్ జాహ్నవికి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
చదవండి:
Published date : 23 Dec 2021 12:28PM