TS10th Class : టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు చివరి తేదీ ఇదే..
విద్యార్థులు జూలై 18లోగా సంబంధిత పాఠశాలలో పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. www.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్కుల రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.
ఫెయిల్ అయిన వారికి ప్రత్యేక క్లాసులు: మంత్రి సబిత
టెన్త్ ఫలితాలపై మంత్రి సబిత సంతృప్తి వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల దాకా వారానికి రెండు రోజుల పాటు ప్రత్యేక క్లాసులు తీసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ఆమె అభినందించారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో అతి తక్కువ ఫలితాలు నమోదవ్వడంపై లోతైన పరిశీలన చేపడతామని చెప్పారు.