English Medium: ‘ఇంగ్లిష్ మీడియానికి అనుమతించండి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 40 ప్రభుత్వ పాఠశాల్లో 9, 10 చదివే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో అదనపు తరగతుల నిర్వహణ కు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర నేతలు రాజాభానుచంద్ర ప్రకాశ్, రాజుగంగారెడ్డి విద్యామంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కోరారు.
టెన్త్ ఫీజు చెల్లించే తేదీలు ప్రకటించినా ఇంకా ఇంగ్లిష్ మీడియానికి అను మతించలేదని, దీంతో విద్యార్థులకు నష్టం జరుగుతోందని తెలిపారు.
చదవండి: Govt schools: ఇంగ్లిష్ మీడియంపై విద్యార్థుల్లో ఆసక్తి..
వెంటనే ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలని, తమ సంఘం లేవనెత్తిన అనేక అంశాలు పెండిగ్‌లో ఉన్నాయని మంత్రికి వివరించారు. తమ విజ్ఞప్తిపై సబిత సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.
Published date : 15 Nov 2022 01:17PM