Skip to main content

Holidays: దసరా సెలవులు కుదింపు?

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(State Council of Education Research and Training–SCERT) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
Holidays
దసరా సెలవులు కుదింపు?

ఈ మేరకు SCERT డైరెక్టర్‌ రాధారెడ్డి సెప్టెంబర్‌ 20న పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆగ‌ష్టు 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, సెప్టెంబ‌ర్‌ 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. 2022–23 విద్యా క్యాలెండర్‌ ప్రకారం 230 రోజులు పాఠశా లల పనిదినాలుగా ఉండాలని, అనుకోకుండా ఇచ్చిన సెలవుల వల్ల విద్యార్థుల బోధనకు నష్టం జరిగే అవకాశముందని పాఠశాల డైరెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ కారణంగా ఈ నెల 26వ తేదీ నుంచి 14 రోజులపాటు ఇవ్వాల్సిన దసరా సెలవులను అక్టోబర్‌ 1 నుంచి 9 వరకూ ఇస్తే (9 రోజులు) సరి పోతుందని ప్రతిపాదించారు. వచ్చే నవంబర్, డిసెంబర్, 2023 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో రెండో శనివారం కూడా పనిదినాలుగా చేయడం వల్ల మరో 5 రోజులు బోధనకు వీలుంటుందని సూచించారు. ఈ ప్రతిపాదనలపై సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. 

చదవండి: టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

Published date : 24 Sep 2022 01:40PM

Photo Stories