Skip to main content

Chahat Bajpai: చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ఉట్నూర్‌రూరల్‌: గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాల్లో రాణించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు.
Chahat Bajpai
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

అక్టోబ‌ర్ 4న‌ ఉట్నూర్‌ కేబీ కాంప్లెక్‌ ప్రాంగణంలో నిర్వహించిన జోనల్‌స్థాయి ఆశ్రమ పాఠశాలల క్రీడోత్సవాలలో పీవో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో జోనల్‌స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదిలాబాధ్‌, నిర్మల్‌ జిల్లాలకు చెందిన 1200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు.

చదవండి: Job Mela: రేపు జాబ్‌మేళా

కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, వాలీబాల్‌, క్యారం, చెస్‌, టెన్నికాయిడ్‌ వంటి పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. డీడీ దిలీప్‌కుమార్‌, నిర్మల్‌ జిల్లా డీటీడీవో అంబాజీ, క్రీడల అధికారి పార్థసారఽథి, ఏటీడీవోలు క్రాంతికుమార్‌, నిహారిక, అమిత్‌కుమార్‌, ఏసీఎంవో జగన్‌, తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Selected for SI Post: ఉద్యోగంలో విధులు నిర్వ‌హిస్తూనే ఎస్ఐగా ఎంపిక‌

Published date : 05 Oct 2023 01:42PM

Photo Stories