Skip to main content

టీచర్లు ఐదుగురు.. విద్యార్థులు ముగ్గురే

తిరుమలగిరి (నాగార్జునసాగర్‌): ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయుల సంఖ్యనే ఎక్కువ. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలంలోని నెల్లికల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐదుగురు టీచర్లు ఉండగా విద్యార్థులు మాత్రం ముగ్గురే ఉన్నారు.
There are five teachers and three students
టీచర్లు ఐదుగురు.. విద్యార్థులు ముగ్గురే

ఇదే పాఠశాలలో 2021లో 56 మంది విద్యార్థులు ఉండగా.. గతేడాది 34 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో ఎనిమిది మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభించగా...వారిలో ఐదుగురు విద్యార్థులు మూడు రోజుల క్రితం టీసీలు తీసుకొని వెళ్లిపోయారు. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు జూలై 2న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గ్రామానికి వచ్చి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి మన బడులను మనమే కాపాడుకోవాలని చెప్పారు.

చదవండి: High Cort: ఒకేసారి భారీగా బదిలీలు ఎందుకు?

సర్పంచ్‌తో కూడిన పది మంది సభ్యులతో కమిటీ వేశారు. ఈ కమిటీలోని సభ్యులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ విద్యపై అవగాహన కల్పించి విద్యార్థులను పాఠశాలలో చేర్చాలి. ఇలా మూడు రోజులు తిరిగినా ఒక్క విద్యార్థి కూడా పాఠశాలలో చేరలేదు. 

చదవండి: School Education: ఈ స్కూల్‌ టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం

Published date : 06 Jul 2023 03:42PM

Photo Stories