Skip to main content

TSRTC: పరీక్ష కేంద్రం వరకు ప్రయాణించొచ్చు

పదోతరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్‌పాస్‌లో పేర్కొన్న దూరం (గమ్యస్థానంతో) సంబంధం లేకుండా వారి నివాసం నుంచి పరీక్షకేంద్రానికి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఏప్రిల్ 3న‌ ఒక ప్రకటనలో తెలిపింది.
TSRTC
పరీక్ష కేంద్రం వరకు ప్రయాణించొచ్చు

విద్యార్థులకు జారీ చేసిన రాయితీ పాస్‌, హాల్‌ టికెట్‌తో పరీక్ష వరకు కండక్టర్లు అనుమతించాలని కోరారు. ఒకవేళ పరీక్షకు హాజరయ్యే విద్యార్థి దగ్గర ఎలాంటి బస్‌పాస్‌ లేకపోతే సాధారణ చార్జీతో టికెట్‌ జారీ చేయాలన్నారు.

చదవండి: Tenth Class: ఇలా సాధన చేస్తే మంచి మార్కులు సాధించే వీలుంది

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌, బస్‌పాస్‌తో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని ఏప్రిల్‌ 13 వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో రాయితీ బస్‌పాస్‌, హాల్‌టికెట్‌తో కూడిన కాంబినేషన్‌ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూడా విద్యార్థులు ప్రయాణించడానికి అనుమతించాలని కండక్టర్లకు సూచించారు.

చదవండి: Tenth Class: పరీక్షలు ప్రారంభం.. ఈసారి పరీక్ష ఇలా..

Published date : 04 Apr 2023 04:14PM

Photo Stories