Tenth Class: పరీక్షలు ప్రారంభం.. ఈసారి పరీక్ష ఇలా..
ఏప్రిల్ 13 వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే వారికి హాల్‌టికెట్లు అందాయి. మొత్తం 2,652 కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. సైన్స్, కాంపోజిట్ సబ్జెక్టులకు 20 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నారు. కోవిడ్ మూలంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్ ఆధారంగానే పరీక్షలు జరగ్గా ఈసారి వంద శాతం సిలబస్‌తో పరీక్షలు జరుగుతున్నాయి.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
అలాగే 11 పేపర్లకు బదులు ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరగనుండటం గమనార్హం. మరోవైపు టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో ఆ తరహా అనుభవాలు ఎదురవకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించనున్నారు. మరోవైపు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఈ సౌకర్యం పొందొచ్చు.
తెలుగు
రామాయణ పాఠంపై పట్టు ఉంటే 12 మార్కులు వచ్చే వీలు
గణితం
గ్రాఫ్‌లు, నిర్మాణాల సమస్యలకు సమాధానాలు కనుగొనడంపై దృష్టి పెడితే నూటికి నూరు మార్కులు సాధించే వీలుంది.
సైన్స్
భౌతిక శాస్త్రంలో ప్రయోగాలపై పట్టు సాధిస్తే పరీక్షల్లో పూర్తి మార్కులొస్తాయి. ప్రయోగ సమాచార సేకరణలో నైపుణ్యాలు, బొమ్మలు, నిత్య జీవితంలో వాటి వినియోగం అంశాలపై దృష్టి పెట్టాలి.